
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తుండడంతో యువతి ఆత్మాహుతికి యత్నించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌కు చెందిన యువతి(17)ఈ నెల 23వ తేదీ తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఐదుగురు యువకులు రహస్యంగా వీడియో తీశారు.
లైంగిక వాంఛ తీర్చాలని యువతిని వేధించారు. మనస్తాపానికి గురైన యువతి రెండు రోజుల క్రితం కిరోసిన్ పోసుకుని ఆత్మహుతికి యత్నించింది. స్థానికులు చెన్నై వైద్యశాలకు తరలించారు. ఎస్పీ కల్యాణ్ ఆదేశాలతో మంగళవారం రాత్రి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment