Thiruvallur district
-
కీచక కరస్పాండెంట్.. ప్లస్‌టూ విద్యార్థినులతో..
సాక్షి, చెన్నై(తిరువళ్లూరు): ప్లస్‌టూ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైగింక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించిన బాలికలు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు.. తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్ మెట్రిక్ ప్రైవేటు పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సరీ నుంచి ప్లస్‌టూ వరకు పాఠశాల చైర్మన్ సిందై జయరామన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు వినోద్(34) కరస్పాడెంట్‌గా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్ ప్లస్‌టూ, ప్లస్‌వన్ విద్యార్థినులను కౌన్సిలింగ్ పేరిట ప్రత్యేక గదికి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లౌగింక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లపై సైతం లౌగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై పలుమార్లు పాఠశాల చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు బుధవారం ఉదయం తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినోద్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలుసుకున్న సీఈఓ రామన్, డీఈఓ రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జరిగిన విషయాలను విద్యార్థినులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతనిపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వినోద్ కోసం గాలిస్తున్నారు. నాలుగు రోజులు పాఠశాలకు సెలవు విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులు ఆందోళన చేయవద్దని..నిందితులపై చర్యలు తీసుకుంటామని.. విద్యార్థినుల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తూ మేసేజ్‌లు పంపింది. బీజేపీ నాయకులకు చుక్కెదురు విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వారికి మద్దతుగా నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన రాజకీయ కోణంలో వెళుతున్నట్లు గుర్తించిన కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య సమస్య అని.. తామే పరిస్కరించుకుంటామని తెలిపారు. -
ప్రియుడితో ఏకాంతంగా ఉండగా వీడియో.. లైంగిక వాంఛ తీర్చాలంటూ..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తుండడంతో యువతి ఆత్మాహుతికి యత్నించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్‌కు చెందిన యువతి(17)ఈ నెల 23వ తేదీ తన ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఐదుగురు యువకులు రహస్యంగా వీడియో తీశారు. లైంగిక వాంఛ తీర్చాలని యువతిని వేధించారు. మనస్తాపానికి గురైన యువతి రెండు రోజుల క్రితం కిరోసిన్ పోసుకుని ఆత్మహుతికి యత్నించింది. స్థానికులు చెన్నై వైద్యశాలకు తరలించారు. ఎస్పీ కల్యాణ్ ఆదేశాలతో మంగళవారం రాత్రి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. చదవండి: (ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు కుట్ర..?) -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి.. కట్‌చేస్తే రెండేళ్ల తర్వాత..
తిరువళ్లూరు (చెన్నై): ఫేస్బుక్లో పరిచయమైన దాదాపు రెండేళ్ల ప్రేమ వ్యవహరాన్ని నడిపి కులాంతర వివాహం చేసుకున్న యువతిని అత్తారింటి వాళ్లు గెంటేయడంతో న్యాయం చేయాలని బాధిత యువతి ఎస్పీ పకెర్లా సెఫాస్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం యూనియన్ విరయూర్ గ్రామానికి చెందిన అంథోనిరాజ్ కుమార్తె అన్బరసి(25). ఇంజినీరింగ్ పూర్తి చేసి పెరంబలూరులోని ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేసేది. 2018లో ఫేస్బుక్ ద్వారా తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడు యూనియన్ చిన్నకలకాటూరు గ్రామానికి చెందిన జయరామన్ కుమారుడు లక్ష్మణన్ పరిచయమయ్యాడు. రెండేళ్ల ప్రేమించుకున్న అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి మార్చి13, 2020న తిరువళాంగాడులోని ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. వీరికి ప్రస్తుతం రష్మిక(01) అనే కూతురు వుంది. వివాహం సమయంలో రూ.1.30 లక్షల నగదు, పది సవర్ల బంగారు నగలు కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వివాహమైన కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కుటుంబంలో కులాంతర చిచ్చు రేగింది. వినతిపత్రం చూపుతున్న అన్బరసి అన్బరసి దళిత కులానికి చెందిన యువతి కావడంతో ఆమెకు ప్రత్యేక గ్లాస్, ప్లేటును ఇచ్చి ప్రత్యేక గదిలో ఉంచి వేధింపులకు గురి చేశారు. తరచూ కులం పేరుతూ దూషిస్తుండడంతో ఆరు నెలల క్రితం బాధితురాలు తిరుత్తణి మహిళ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అన్బరసిపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులు మరో సారి దాడికి దిగారు. దీంతో బాధితురాలు మంగళవారం ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. తనను, కూతురిని కులం పేరుతో దూషిస్తున్నారని, తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, భర్త లక్ష్మణ్, అత్త దేవకితో పాటు మరో ఐదు మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేసిన వీడియోను సైతం ఎస్పీకి అందించింది. ఈ సంఘటనపై స్పందించి తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి పోలీసులను ఎస్పీ ఆదేశించారు. చదవండి: (వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..) -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
తమిళనాడులో సీజ్ చేసిన బంగారం ఎవరిది?
సాక్షి, హైదరాబాద్: తమి ళనాడు పోలీసులు బుధ వారం సీజ్ చేసిన బంగారం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవా లను ప్రజల ముందుం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాల యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బంగారం పట్టివేత వ్యవహారంలో ప్రజలు పూర్తి వివరాలను కోరుకుంటున్నారని చెప్పారు. సీజ్ చేసిన దాదాపు 1,400 కిలోల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) సంబంధించిందనే వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. దీనిపై టీటీడీ చైర్మన్, ఈవో, ఇతర అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. (చదవండి : ఆ బంగారంపై అన్నీ అనుమానాలే) అనధికారికంగా తరలిస్తున్నారా? ‘‘భారీస్థాయిలో బంగారం పట్టుబడితే, అది టీటీడీది అని ఎస్పీ ధ్రువీకరిస్తే, ఇక్కడ ఈవో, చైర్మన్, అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? ఇందులో ఏం మతలబు ఉందో అర్థం కావడం లేదు. టీటీడీ బంగారాన్ని రక్షణ లేకుండా, ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? భక్తులు సమర్పించే బంగారం, నిధులకు లెక్కాపత్రం లేకపోవడం ఏమిటి? అనే సందేహాలు భక్తు ల్లో తలెత్తుతున్నాయి. అందుకే విచారణ జరపాలి’’ అని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. -
ఆ బంగారంపై అన్నీ అనుమానాలే
సాక్షి, తిరుపతి: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై నుంచి తిరుపతి వైపు తరలిస్తున్న 1,381 కేజీల బంగారాన్ని తిరువళ్లూరు పుదుసత్రం వద్ద తమిళనాడు అధికారులు బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. బంగారాన్ని ప్యాక్ చేసిన బాక్స్‌లపై బ్రిటిష్ ఎయిర్వేస్ లేబుల్స్ ఉన్నా యి. దీనిని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా తేలిందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికా రులు వెల్లడించారు. పూందమల్లి రిటర్నింగ్ అధికారి రత్న సైతం దీనిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు తేలిందని స్పష్టం చేశారు. అయితే, చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని శ్రీవారి క్షేత్రానికి తరలిస్తుండగా తమిళనాడులో పట్టుకు న్నారని చెబుతున్న టీటీడీ అధికారులు, ప్యాకెట్లపై బ్రిటిష్ ఎయిర్వేస్ లేబుల్స్ ఎందుకు ఉన్నాయనే దానికి సమాధానం ఇవ్వటం లేదు. స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తమిళనాడు అధికారులు చెబుతుండగా.. దీనిపైనా టీటీడీ పెదవి విప్పటం లేదు. శ్రీవారి నగలను కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే మింట్‌కు తరలించి కరిగిస్తారు. కడ్డీలుగా మార్చి ఆ తరువాత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే పట్టుబడ్డ బంగారంపై మింట్ ముద్రలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీళ్లకు బదులు వేరే ముద్రలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి : 1,381 కేజీల బంగారం సీజ్) శ్రీవారి నిధులు, బంగారాన్ని బ్యాంకు ల్లో డిపాజిట్ చేసే ముందు ధర్మకర్తల మండలి, స్పెసిఫైడ్ అథారిటీ, ఫైనాన్స్ కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారి బంగారాన్ని టీటీడీ అధికారులు ఎవరి అనుమతితో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనే దానిపైనా ఎలాంటి సమాధానం లేదు. డిపాజిట్ గడువు తీరటంతో టీటీడీకి తీసుకు వస్తుండగా పట్టుకున్నారని చెబుతున్న అధికారులు.. కనీస భద్రత కూడా లేకుండా ఎలా తీసుకువస్తున్నా రనే దానిపైనా స్పష్టత ఇవ్వటం లేదు. ఇలాంటి ఎన్నో చిక్కుముడుల నడుమ స్వామివారి బంగారం విదేశాలకు వెళ్లిందా? అక్కడ కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారా? అనే అనుమానాలూ ఉన్నాయి. అంత నిర్లక్ష్యమేంటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం రూ.50 లక్షల నగదు, బంగారాన్ని ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు లేదా మరో చోటుకు తరలించాలంటే ఇద్దరు బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది, మరో ఇద్దరితో పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తారు. అయితే, రూ.400 కోట్ల విలువ చేసే 1,381 కేజీల బంగారాన్ని తీసుకొచ్చే సమయంలో అటు బ్యాంకర్లు గానీ.. టీటీడీ అధికారులు గానీ ఈ నిబంధనలను పాటించి న దాఖలాలు కనిపించటం లేదు. ఒక మినీ లారీలో బంగారాన్ని ఉంచి డ్రైవర్, మరో ముగ్గురు సాధారణ వ్యక్తులు తీసుకొస్తున్నారు. ఆ వాహనం ముందు, వెనుక ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేదు. సాధారణంగా చిన్న ఆభరణాన్ని డిపాజిట్ చేస్తేనే తిరిగి తీసుకునే ప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. డిపాజిట్ చేసినట్టు ధ్రువీకరించే రసీదును విధిగా తీసుకుంటా రు. అటువంటిది రూ.400 కోట్ల విలువ చేసే బంగారాన్ని తీసుకునే సమయంలో ఇటువంటి జాగ్రత్తలేవీ పాటించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. అటు బ్యాంక్ అధికారులు సైతం బంగారా నికి ఎటువంటి పత్రాలు ఇవ్వకపోవడం వెనుక అంతర్యమేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రూ.50 వేలకు మించి నగదు, బంగారం ఉండకూడదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో రూ.400 కోట్ల విలువ చేసే శ్రీవారి బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందనే దానికి సమాధానం లేదు. పైగా ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానాలు చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపాజిట్ చేసిన గడువు ముగిసి 20 రోజులు కావస్తోందని, ఈ దృష్ట్యా తిరిగి టీటీడీకి అప్పగించాలని బ్యాంక్ అధికారులకు లేఖ రాసినట్టు టీటీడీ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. పట్టుబడిన బంగారాన్ని బ్యాంక్ అధికారులే సంబంధిత పత్రాలతో వెళ్లి విడిపించుకు తెస్తారని టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో శ్రీవారి సొమ్ము రూ.వెయ్యి కోట్లు ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడంపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ బ్యాంక్‌లు ఉండగా.. ప్రైవేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం ద్వారా టీటీడీ సంప్రదాయానికి తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులో ఎలా తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఆనవాయితీ. టీటీడీలో కొందరు అధికా రులు కమీషన్లకు కక్కుర్తిపడి నగదు, బంగారాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. పొరపా టున జరగరానిది జరిగి ప్రైవేట్ బ్యాంకులు జెండా ఎత్తేస్తే పరిస్థితి ఏమిటని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1,381 కేజీల బంగారాన్ని తిరుపతిలో ఉండే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అవకాశం ఉన్నా.. కమీషన్లకు కక్కుర్తిపడి చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
1,381 కేజీల బంగారం సీజ్
సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ తరలిస్తున్న క్వింటాళ్లకొద్దీ బంగారాన్ని తమిళనాడు అధికారులు బుధవారం పట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మూడు వాహనాల్లో రవాణా చేస్తున్న 1,381 కేజీల బంగారు కడ్డీలను చూసి షాకైన అధికారులు.. ఆనక తేరుకుని వాటిని సీజ్ చేశారు. తమిళనాడులో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు తమిళనాట ఫ్లయింగ్ స్క్వాడ్స్ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇందులో తిరువళ్లూరు పుదుసత్రం వద్ద చెన్నై నుంచి తిరుపతి వైపు వెళుతున్న మూడు వాహనాలను ఆపిన అధికారులకు వాటిలో అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్లు కనిపించాయి. వాటిని పూందమల్లి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ గిఫ్ట్ ప్యాక్ రూపంలో ఉన్న ప్యాకెట్లను తెరిచి చూశారు. ఆ ప్యాకెట్లలో బంగారు దిమ్మెలను గుర్తించి అవాక్కయ్యారు. పెద్దమొత్తంలో బంగారం పట్టుబడటంతో రిటర్నింగ్ అధికారి రత్న ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పూందమల్లి తాలూకా కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఇచ్చేందుకు తరలిస్తున్నారా, ఓటర్ల పంచేందుకు తీసుకెళుతున్నారా లేక స్మగ్లింగ్‌లో భాగంగా రవాణా చేస్తున్నారా అనే అనుమానంతో నలుగురినీ విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ బంగారం స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూందమల్లి రిటర్నింగ్ అధికారి రత్న మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో 1,381 కిలోల బంగారం పట్టుబడిందని, దీనిని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అది శ్రీవారి బంగారమే ఇదిలావుండగా, వాహనాల డ్రైవర్లు మాట్లాడుతూ.. ఈ బంగారు కడ్డీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించేందుకు తీసుకెళుతున్నట్టు వివరించారు. కొనుగోలు డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. దేవస్థానం అధికారుల వద్ద సరైన డాక్యుమెంట్లు ఉంటే బంగారాన్ని వారికి అప్పగిస్తామని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. టీటీడీ అధికారుల ఏమంటున్నారంటే.. తమిళనాడు పోలీసులు సీజ్ చేసిన బంగారం శ్రీవారికి చెందినదేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీకి సంబంధించిన శ్రీవారి బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు తెలిపారు. 20 రోజుల క్రితం గడువు తీరడంతో వాటిని రిలీజ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీకి తరలిస్తున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్నట్టుగా బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు. బ్యాంక్ అధికారులు మాత్రం బంగారం తరలింపుపై ఎన్నికల సంఘానికి లేఖ పంపినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు. ఆధారాలను గురువారం తిరవళ్లూరు కలెక్టర్‌కు అందజేసి బంగారాన్ని టీటీడీకి చేరేలా చర్యలు తీసుకుంటామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు వివరించినట్టు సమాచారం. ఇటీవల తిరుమల ఆలయంలో భారీఎత్తున ఆభరణాలు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్న తరుణంలో చెన్నైలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం అనేక అనుమానాలు తావిస్తోంది. -
చెన్నైలో గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
-
గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి
చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన ఘటన మన మనోఫలకంపై నుంచి చెరగకమందే.... తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరి సమీపంలోని ఉపరపలియమ్ లోని గోడౌన్ గోడ కూలింది. ఆ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికిచేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఒక బాలుడిని రక్షించారు. కొంత మంది కూలీలు గోడౌన్ గోడను ఆసరాగా చేసుకుని గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెలపై ఆ గోడౌన్ గోడ కూలింది. అయితే బాధితులంతా ఉత్తరాంధ్ర, తమిళనాడు సరిహద్దులోని జిల్లాలకు చెందిన తెలుగువారిగా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వర్షం వల్ల గోడౌన్ కు చెందిన 20 అడుగుల గోడ కూలిందని అధికారులు తెలిపారు.