ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్‌లోని బార్‌పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్‌షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది.
కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్‌పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది.
Comments
Please login to add a commentAdd a comment