ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడ్డారు. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు.
స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.
ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది.
కాగా,ఇదే కేసులో మిహిర్ మిషిర్ షా తండ్రి శివసేన నేత రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment