నెల వ్యవధిలో మూడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులు | Man deceased in Mumbai hit and run accident by BMW, driver arrested | Sakshi
Sakshi News home page

నెల వ్యవధిలో మూడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులు

Published Mon, Jul 29 2024 10:40 AM | Last Updated on Mon, Jul 29 2024 11:00 AM

Man deceased in Mumbai hit and run accident by BMW, driver arrested

ముంబై: మహారాష్ట్రలో వరుసగా చోటు చేసుకుంటున్న హిట్‌ అండ్‌ రన్‌ ఉదంతాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా.. నగరంలో మరో ప్రమాదం జరగ్గా, బాధితుడు ప్రాణం కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఈ నెల 20వ తేదీన వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ  కారు వేగంగా వెళ్తూ.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బైకర్‌.. జూలై 27న మృతి చెందారు. ఈ ఘటన జూలై 20న ముంబైలోని వర్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడ్ని వినోద్‌ లాల్‌(28)గా పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కిరణ్‌ ఇందుల్కర్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. 

ముంబైలో ఈ నెలలో ఇది మూడో హిట్‌ అండ్‌ రన్ కేసు. జూలై 7న ముంబైలోని వర్లీలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా నడిపిన  బీఎండబ్ల్యూ.. ముందు వెళ్తున్న ఓ స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఒక మహిళ మరణించగా.. ఆమె భర్త గాయపడ్డాడు. జూలై 22 న ముంబైలో వేగంగా వెళ్తున్న ఆడి కారు రెండు ఆటో-రిక్షాలను ఢీకొట్టింది. ఈ  ఘటనలో రెండు ఆటో రిక్షాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement