ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది.
వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్‌లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్‌గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు.
అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్‌యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్‌కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది.
ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్‌వర్క్ డిస్‌కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్‌లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు.
దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్‌లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు.
తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్‌గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్‌లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్‌లైన్‌లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!.
(చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment