server
-
భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉన్న బీజింగ్ కంపెనీ లెనోవో.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది. వీటిని పుదుచ్చేరి ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు.ఏటా 50,000 యూనిట్ల ఎంటర్ప్రైస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా సరుకును ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు.అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్ డిజైన్, డెవలప్మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్‌లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి. -
‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ
హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ (హెచ్‌పీఈ) తాజాగా దేశవ్యాప్తంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సర్వర్లను మనేసర్‌లోని వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తయారుచేసినట్లు చెప్పింది. గత ఏడాది జూలైలో హెచ్‌పీఈ, వీవీడీఎన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో మేక్ ఇన్ ఇండియా ప్రణాళికలను వెల్లడించింది. అందులో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లను తయారుచేస్తామని హామీ ఇచ్చింది. దాంతో అలా హామీ ఇచ్చిన ఏడాదికాలంలోపే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రానున్న ఐదు ఏళ్లలో భారత్‌లో సుమారు 1 బిలియన్ డాలర్ల(రూ.8300 కోట్లు) విలువైన హైవాల్యూమ్ సర్వర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌పీఈ సర్వర్లు ఐటీ పరిశ్రమ అంతటా పనిభారాన్ని తగ్గిస్తూ విస్తృత శ్రేణి అప్లికేషన్ల కోసం ఉపయోగపడుతాయని కంపెనీ తెలిపింది. వీవీడీఎన్ టెక్నాలజీ హెచ్‌పీఈ తయారుచేస్తున్న సర్వర్ మదర్‌బోర్డులను రూపొందించడానికి పూర్తి స్థాయి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ)ని అందిస్తున్నట్లు తెలిసింది. ప్రాసెసర్లు, మెమరీలు, డిస్క్‌లు, డ్రైవ్‌లతో సర్వర్ మదర్‌బోర్డులను తయారు చేయడానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)కి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇదీ చదవండి: కొత్త యూజర్లు ఫీజు చెల్లించాల్సిందే.. ఎందుకంటే.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎస్ఐ) పథకం ద్వారా విదేశీ కంపెనీలను భారత్‌లోకి ఆహ్వానించి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌పీఈ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సోమ్ సత్సంగి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ)కి అభినందనలు తెలియజేశారు. -
వామ్మో.. నీళ్లన్నీ తాగేస్తున్న చాట్‌జీపీటీ, ఇలా అయితే కష్టమే!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసింది చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నె అద్భుతాలు చేస్తున్న అందరి నోట ఔరా అనిపించింది. దిగ్గజ సంస్థలకు సైతం పోటీగా నిలబడే స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు మనకు పైకి తెలిసిన విషయం మాత్రమే. కాయిన్‌కు రెండు వైపుల ఉన్నట్లు చాట్‌జీపీటీ కూడా రెండో వైపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్పిట్ని పరీక్షిస్తున్నారా…? చాట్జీపీతో ఒక అంశం ఆధారంగా కథనం, కథ లేదా కవిత రాయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంకో విషయం తెలుసుకోవాలి...! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇలా ChatGPTని ఉపయోగిస్తున్నందున, మనం దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అసలు చాట్‌జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే.. ChatGPT వంటి ఏఐ మోడల్లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయట. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్‌వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్‌ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్‌ట్యాగ్ అనానిమస్ సూడాన్‌లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్‌క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్‌తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్‌కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్‌గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు దాని సర్వర్‌ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్‌ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్‌సైట్‌ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్‌గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్‌లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
ఎస్బీఐ సేవల్లో అంతరాయం.. సర్వర్ డౌనా? సైబర్ అటాకా?
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరక్క ఇబ్బంది పడుతున్న ఖాతాదారులకు సోమవారం రోజు (3-4-2023) సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, యోనో యాప్ పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ల్లో తాము చేయాల్సిన లావాదేవీలు ఆగిపోయాయని వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఖాతాదారులు ట్విటర్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య మార్చి 31 నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈరోజు 4వ రోజు. మార్చి 31 నుంచి ఎస్బీఐ బ్యాంక్ సైట్/ యాప్స్ పనిచేయడం లేదు. డౌన్ అయ్యాయి. సైబర్ అటాక్ జరిగిందా? లేదంటే బ్యాంకుల్లో సాధారణంగా జరిగే సర్వర్ సమస్యలా? అనే దానిపై సమాధానం చెప్పాలని, లేదంటే వినియోగదారులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ట్వీట్లలో పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్బీఐ సర్వర్ల పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా సేవల్లో తలెత్తే అంతరాయాల్ని వెలుగులోకి తెచ్చే డౌన్ డిటెక్టర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ రోజు ఉదయం 9.19 గంటల నుంచి ఎస్బీఐ సేవల్లో లోపాలు తలెత్తినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. Second working day of the new financial year and the SBI website is down. @TheOfficialSBI @RBI pic.twitter.com/mpRVH5ESBb — Gaurav Dutta (@dgaurav7) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 I hope @TheOfficialSBI you have money and we are just facing a technical glitch from last 10 days. "NET BANKING IS NOT WORKING"#SBIDOWN — Harsh Patel (@hiharsh07) April 3, 2023 -
నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ఉన్న అనేక సెక్యూరిటీ లోపాలను గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. పరీక్ష పేపర్లను దొంగిలించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు పి.ప్రవీణ్‌కుమార్ వాటిని తన పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాడు. అందరికీ దాని యాక్సెస్ లేకుండా చేయడానికి డేటా లాక్ చేసి ఉంచాడు. దీన్నిబట్టి చూస్తే టీఎస్పీఎస్సీ తన డేటా రక్షణ కోసం ఈ మాత్రం చర్యలు కూడా తీసుకోలేదని స్పష్టమవుతోంది. కార్యాలయంలో నిఘా వ్యవస్థ, కంప్యూటర్లకు సర్వర్ లేకపోవడం విస్మయపరుస్తోంది. గేటు వద్దనే యాక్సెస్ కంట్రోల్.. టీఎస్పీఎస్సీలోనికి వెళ్లే వారిని కేవలం గేటు వద్ద, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాలు దాటి ముందుకు వెళ్లిన వ్యక్తి.. ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితరాలు పరిశీలించే అవకాశం కమిషన్‌లో లేదని పోలీసులు గుర్తించారు. కమిషన్ ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కొన్ని సరిగ్గా పని చేయట్లేదు. పరీక్ష పత్రాలు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ రెండో అంతస్తులో ఉంది. అయితే అక్కడ ఒక్క కెమెరా కూడా లేదు. దీంతో సెక్షన్లోకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరిని కలిసారు? అనేది సాంకేతికంగా గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సర్వర్ లేకపోవడంతో నిఘా కరువు.. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో దాదాపు 130 వరకు కంప్యూటర్లు ఉన్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి విభాగాల్లో కంపూటర్లను ల్యాన్ ద్వారా కనెక్ట్ చేయరు. పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా సర్వర్ ఏర్పాటు చేసుకుని దాని ఆధారంగానే నెట్వర్క్ నిర్వహిస్తారు. ఇలా చేస్తే ఎవరు ఏ కంప్యూటర్ ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది తేలిగ్గా గుర్తించవచ్చు. కమిషన్‌లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడం లీకు వీరులకు కలిసి వచి్చంది. మరోపక్క సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్వర్డ్స్, యూజర్ ఐడీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఏ అంశం పైనా సిబ్బందికి కనీస అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. సైబర్ ఆడిటింగ్ ఉన్నట్లా..? లేనట్లా..? టీఎస్పీఎస్సీ లాంటి కీలక సంస్థలకు అనునిత్యం సైబర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సరీ్వసెస్ (టీఎస్టీఎస్) ఆ«దీనంలోని నిపుణులు క్రమం తప్పకుండా దీన్ని నిర్వహించాలి. అక్కడి కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్ వాల్స్ తదితరాలను పరీక్షించి సమకాలీన సైబర్ దాడులు తట్టుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయా? లేదా అన్నది తేల్చి నివేదిక ఇవ్వడంతో పాటు అవసరమైన సిఫారసులు కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ ఆడిట్ జరుగుతోందా? సిఫారసులు చేస్తున్నారా? చేస్తే కమిషన్ పట్టించుకుంటోందా? తదితర అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే లీకేజీలపై స్పష్టత వచ్చే పరిస్థితి నెలకొంది. చదవండి: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
ఆరు రోజులుగా ఎయిమ్స్ సర్వర్ హ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడకల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. ఆరు రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషిచేస్తోంది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం స్తంభించిన సర్వర్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది రోగుల ఆరోగ్య, బిల్లుల చెల్లింపుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. డేటా అంతా అమ్మకానికి వస్తే అప్రతిష్ట తప్పదని పోలీసు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల ఆరోగ్య సమాచారం సైతం సర్వర్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే హ్యాకర్లు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్‌కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్‌కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్‌చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్‌ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
కొత్త సర్వర్‌పై రిజిస్ట్రేషన్లు మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్వర్ల ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లను చేయడం సోమవారం నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణకు కలిపి హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించారు. గత రెండు రోజులుగా చేస్తున్న విభజన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరిలో ఉన్న పై–డేటా సెంటర్‌కి డేటాబేస్‌ను మార్చారు. ఇక్కడ సర్వర్ల సామర్థ్యాన్ని గతంకన్నా పెంచి డేటాబేస్‌ను సిద్ధం చేశారు. ఈ సర్వర్లపైనే సోమవారం టెస్టింగ్ కింద రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వరకు టెస్టింగ్‌లో భాగంగానే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. మార్చిన సర్వర్‌లో వస్తున్న సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వర్ స్పీడ్ ఎలా ఉంది, ఎప్పుడు తగ్గుతుంది, వేలిముద్రల స్కానింగ్, వెబ్‌ల్యాండ్, స్టోరేజీ తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అండ్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం నుంచి మార్చిన సర్వర్ వ్యవస్థ ద్వారా పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి సర్వర్‌తో ఇక్కట్లు సెంట్రల్ సర్వర్ వ్యవస్థ తెలంగాణతో కలిసి ఉండడం వల్ల ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సర్వర్ల సామర్థ్యం సరిపోక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతాలున్నాయి. దీంతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ సర్వర్ వ్యవస్థను విభజించి మన రాష్ట్రంలో కొత్త డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, రోజూ జరిగే రిజిస్ట్రేషన్లు, అవసరమైన స్టోరేజీ తదితర వాటికి అనుగుణంగా సర్వర్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల ఇకపై సర్వర్ సమస్యలు ఉండవని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. -
AP: సర్వర్ సమస్యలు క్లియర్
గుణదల (విజయవాడ తూర్పు): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ ఏర్పడుతున్న సర్వర్ కష్టాలకు చెక్ పెట్టేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ సంబంధిత సర్వర్‌ను నిలిపేసి డేటా బేస్‌ను మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం నుంచి వేగవంతంగా సేవలందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడిగా సర్వర్ సేవలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సర్వర్ విధానం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సర్వర్లు ఇప్పటివరకు ఒకే కేంద్రంగా పని చేస్తున్నాయి. ఈ కారణంగా వందలాది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన సేవలు అందించడంలో సామర్థ్యం సరిపోవడం లేదు. సాంకేతిక సమస్యలు ఏర్పడి కక్షిదారులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వర్ డేటాబేస్ విభజన చేస్తున్నారు. తొలగనున్న రిజిస్ట్రేషన్ కష్టాలు సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ఏకంగా 20 రోజుల పాటు ఈసీలు, సీసీలు రాక ప్రజలు అవస్థలు పడ్డారు. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగక అమ్మకందార్లు, కొనుగోలు దార్లు సంకట స్థితిలో పడ్డారు. ఈ ప్రభావం బ్యాంక్‌లపై పడటంతో లోన్లు రాక రుణ గ్రహీతలు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సర్వర్ సామర్థ్యం పెంచటం వల్ల ఈ కష్టాలన్నీ తీరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్వర్ సామర్థ్యం పెంచేందుకు కృషి హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్ సిస్టమ్‌ను మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి సర్వర్ అప్డేట్ చేస్తాం. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. సర్వర్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు భవిష్యత్‌లో నెట్వర్క్ విధానాన్ని అభివృద్ధి చేస్తాం. – నలమల రేవంత్, కార్డ్ సూపరింటెండెంట్ (విజయవాడ) మంగళగిరిలో ‘పై’ డేటా సెంటర్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘పై’డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సిస్ఫై సంస్థ నిర్వహణలో పై డేటా సెంటర్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉండే ఈ సంస్థ ద్వారా ఏపీకి సంబంధించిన డేటాబేస్‌ను మార్చారు. రాష్ట్రంలో ఉండే 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇకపై మంగళగిరి నుంచే సర్వర్ ఆపరేషన్స్ జరుగుతాయి. హైదరాబాద్ నుంచి మంగళగిరికి డేటాబేస్‌ను మార్చే ప్రక్రియలో సర్వర్ సామర్థ్యం పెరిగి సమస్యలు తొలగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. -
భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్!
బీజింగ్: దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పుగా ఉన్నాయనే కారణంతో 59 చైనా యాప్స్‌ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ఉపయోగపడే టిక్‌టాక్ ఒకటి. చాలా మంది ఈ టిక్‌టాక్ ద్వారా వీడియోలు తీసి పాపులారిటి సంపాదించుకున్నారు. టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ మాట్లాడుతూ, చైనా ఎప్పుడు భారతీయులు డేటా గురించి అడగలేదని, దీనికి సంబంధించి కంపెనీకి ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు. ( చైనా.. యాప్స్.. ఓ సర్వే) అయితే భారతీయులకు సంబంధించిన డేటా అంతా సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో ఉందని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ లిమిటెడ్ తెలిపింది. అలాగే ఈ సంస్థ భారతదేశంలోనూ డేటా సెంటర్లను నిర్మించాలనుకుంటుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ లేఖ ద్వారా ఇండియా కు తెలిపారు. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) -
సూపర్‌ఫాస్ట్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త హంగులు సమకూర్చుకుంటోంది. ఎప్పుడూ సర్వర్ల మొరాయింపు సమస్యతో రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో కలిగే అంతరాయాన్ని పూర్తిగా నివారించడంతో పాటు అత్యంత వేగంగా కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా అదనపు సాంకేతిక సామగ్రిని ఏర్పాటు చేసుకుంటోంది.తద్వారా ఒక్కో రిజిస్ట్రేషన్ లావాదేవీకి కనీసం పావుగంట మేర సమయం కూడా ఆదా అవుతుందని అంచనా వేస్తోంది. దాదాపు 7వేల టెరాబైట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకుంటున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సర్వర్లతో ఉన్న లింకును కూడా తొలగించుకుని పూర్తిగా స్వతంత్రం కానుంది. ఇక శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల సేవలు సోమవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. గచ్చిబౌలిలో సెంట్రల్ సర్వర్ రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతోనే రిజిస్ట్రేషన్ల శాఖ తన లావాదేవీలను మరింత వేగవంతం చేసుకుంటోంది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్లో 7వేల టెరాబైట్ల సామర్థ్యం గల సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వర్‌తో పాటు స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా నాలుగింతలు పెంచేశారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల అప్లోడ్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్ లాంటి ప్రక్రియల కోసం ఒక్కో లావాదేవీకి కనీసం గంట సమయం తీసుకునేది. కానీ, ఇప్పుడు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఈ లావాదేవీలను ముప్పావుగంటలో పూర్తి చేయగలమని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ‘గతంలో అనేక సమస్యలు వస్తుండేవి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సగంలో ఆగిపోయేది. ఒక గంట తర్వాత మళ్లీ వచ్చి ఓ పది నిమిషాల్లో కట్ అయ్యేది. దీంతో గంటలో పూర్తి కావాల్సిన ప్రక్రియకు 3,4 గంటలు పట్టేది. ఒక్కోసారి రోజుల తరబడి సర్వర్లు పనిచేసేవి కావు. ఇప్పుడు ఈ సమస్య ఉండదు’ అని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం భవిష్యత్తు రిజిస్ట్రేషన్ లావాదేవీలపై భరోసా కలిగిస్తోంది. వీడియోకు కొంత సమయం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసి దానిని సీడీ రూపం లో కొనుగోలుదారుకు ఇచ్చే ప్రక్రియ ఆలస్యం కానుంది. డిసెంబర్1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సర్వర్ల మార్పు ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండటంతో ఆలస్యం కానుంది. ఈ నెలలోనే రికార్డింగ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే నెలలో రెయిల్‌టెల్ ద్వారా సమకూరుస్తున్న మల్టీపర్పస్ లింకింగ్ నెట్వర్క్ కూడా రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్ కార్యాలయా ల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 90 కార్యాలయాల్లో ఈ ఏర్పాటు పూర్తి కాగా, మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా పూర్తయితే సాంకేతికంగా తెలంగా ణ రిజిస్ట్రేషన్ల శాఖ బలోపేతం కానుంది. సోమవారం నుంచి యథాతథం ‘సర్వర్లు, స్టోరేజీ మార్పులో భాగంగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు నిలిపివేశాం. శని, ఆదివారాలు ఎలాగూ సెలవే కనుక సోమవారం నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా యథా తథంగా ప్రారంభమవుతాయి.’ –రిజిస్ట్రేషన్ల శాఖ ఏఐజీ వేముల శ్రీనివాసులు -
నిర్లక్ష్యపుముద్ర
♦ అందని సిగ్నల్స్ ♦ మొరాయిస్తున్న సర్వర్లు ♦ మందకొడిగా పింఛన్ల పంపిణీ ♦ వెర్షన్ మారినా తప్పని వెతలు ♦ లబ్ధిదారులకు అవస్థలు భీమడోలు : రోజుకో కొత్త పరికరం.. సహకరించని అప్డేట్ వెర్షన్లు.. సర్వర్ మొరాయింపు.. అందని సిగ్నల్స్, పడని వేలి ముద్రలు ఇవి పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ఎదురవుతోన్న సమస్యలు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నా లక్ష్యం మేరకు ప్రక్రియ పూర్తికావడంలేదు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈనెల ఏడో తేదీ నాటికే పింఛన్ల సొమ్ము పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాలు నెరవేరేలాలేవు. సిగ్నల్స్ అందక సర్వర్ మొరాయించడంతో మండుటెండలోనే లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 3,72,816 మంది సామాజిక పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 3,16,482 మందికి అంటే 84.75 శాతం ప్రక్రియ బుధవారం సాయంత్రానికి పూర్తయింది. భీమడోలు మండలానికి 16 ట్యాబ్‌లు ఇచ్చినా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మండకొడిగా సాగుతోంది. ఈ మండలంలో 6,578 లబ్ధిదారులు ఉండగా 5,281కి పింఛను సొమ్ము అందించారు. అంటే ఇప్పటికి 80.28 శాతం పూర్తయింది. జిల్లాలోని 57 మండలాల్లో కొవ్వూరు అర్బన్ పింఛన్ల పంపిణీలో ఈ నెల మొదటి స్థానంలో ఉండగా, భీమడోలు మండలం 46వ స్థానంలో ఉంది. కొవ్వూరు అర్బన్ పరిధిలో 2,799 మందికి 2,685 మందికి పింఛన్లు అందించారు. అంటే 95.93 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయింది. త్రీజీ ట్యాబుల్లో కొత్త వెర్షన్‌తో ఇబ్బందులు ప్రస్తుతం మార్కెట్లో 4జీ ట్యాబ్‌లు హల్చల్ చేస్తున్నా అధికారులు మాత్రం త్రీజీ ట్యాబ్‌లను అందించి చేతుల దులుపుకోవడంతో పింఛన్ల పంపిణీలో సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. రెండున్నరేళ్ల క్రితం పంపిణీ చేసిన బీఓ ట్యాబ్‌ల్లో 3.2 నుంచి పలు వెర్షన్లు మార్పు చేసి గత నెల వరకు అందించారు. ఈ నెల కొత్త ట్యాబ్‌ల్లో నూతన వెర్షన్‌ను పొందుపర్చారు. ఇదే సమస్యగా మారింది. 3జీ ట్యాబుల్లో 4.2 వెర్షన్ అప్డేట్ చేయడంతో సహకరించడంలేదు. బయోమాట్రిక్ మెషీన్లలో వేలిముద్రలు పడడంలేదు. దీంతో లబ్ధిదారులు రెండు మూడు రోజులు ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. పనిచేసే చోట మూడు గంటలకే మెషీన్ చార్జింగ్ అయిపోతుంది. గతంలో వలే మెషీన్ పనిచేస్తుండగా చార్జీంగ్ పెట్టే పరిస్థితి ఇప్పుడులేదు. దీంతో చార్జింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత చార్జింగ్ పెట్టాల్సి వస్తోంది. -
ఇవ్వాలని ‘పింఛనే’ లేదా !
వారం రోజులుగా అందని పింఛనుదారులకు అందని సొమ్ము మొరాయిస్తున్న సర్వర్లు పడిగాపులు పడుతున్న లబ్ధిదారులు రాష్ట్రంలో మన జిల్లాది 12వ స్థానం ఆలమూరు :జిల్లాలో పింఛన్ల ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్లు సకాలంలో లబ్ధిదారులకు అందడం లేదు. అధికార పార్టీ పాలకులు పింఛన్ పంపిణీలో గుప్పిస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరకపోవడం లబ్ధిదారుల పాలిట శాపంగా పరిణమించింది. పింఛన్‌ను అందుకోవడానికి వచ్చిన సగటు జీవికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వర్లు మొరాయించడం, అధికారపార్టీ నాయకులు లేరనే సాకుతో పింఛన్లు నిలిపివేయడం వంటిì æకారణాలు శాపంగా మారాయి. పింఛన్ల పంపిణీకి వినియోగిస్తున్న బయోమెట్రిక్ యంత్రాలు కూడా కొరత ఏర్పడడంతో అధికారులు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 5,10,035 వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. మంగళవారం సాయంత్రానికి కేవలం 3,81, 511 మాత్రమే పంపిణీ చేశారు.74.80 శాతం జిల్లాలో పంపిణీ చేసి రాష్ట్రంలోని 12వ స్థానంలో నిలిచింది. 94.99 శాతం కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 89.26 శాతంతో అనంతపురం (ద్వితీయ), నెల్లూరు (88.72) శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా ఐదో తేదీ నాటికే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా ఇటీవల ఏడో తేదీకి పొడిగించారు. అయినా పంపిణీ చురుగ్గా సాగకపోవడం వల్ల మరో రెండు రోజులు పొడిగించాల్సి వచ్చింది. మంగళవారం జిల్లాలో పింఛన్ ప్రక్రియ దాదాపు జరగలేదనే చెప్పాలి. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అనేక మంది పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడినా, సర్వర్లు సహకరించలేదు. పంచాయతీ కార్యదర్శులు మూడు గంటలకు రావాలని పింఛనుదారులు సూచించారు. మధ్యాహ్నం కూడా సర్వర్ల పరిస్థితిలో మార్పు లేకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. రోజంతా పింఛన్ల కోసం పడిగాపుల పడ్డ వారంతా ఉసూరు మంటూ వెనుదిరిగారు. జిల్లాలోని తాళ్లరేవు మండలం మంగళవారం సాయంత్రానికి కేవలం 12.02 శాతం మాత్రమే పంపిణీ చేసి ఆఖరిస్థానంలో నిలిచింది. ఇంకా 50 శాతం కూడా పింఛన్లు పంపిణీ చేయలేని మండలాలు ఆరు ఉన్నాయి. వాటిలో రాజోలు (48.87), వై.రామవరం (46.95), ఐ.పోలవరం (44.06), అయినవిల్లి (42.28), ముమ్మిడివరం అర్భన్ (41,51) ఉన్నాయి. ఇకనైనా అధికారులు సత్వరమే దృష్టి సారించి పింఛన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మొరాయించిన సర్వర్
- బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవాలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం సర్వస్ సమస్య ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లాలోని అన్ని బ్యాంకులు అనంతపురం జోన్ బీఎస్ఎన్ఎల్ సర్వర్ పరిధిలో ఉన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో బ్యాంకుల్లో లావాదేవీలు జరగలేదు. కరెన్సీ కొరతతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. సర్వర్ సమస్యతో గురువారం ఇబ్బందులు తప్పలేదు. కొద్దోగొపోప నగదు తీసుకునేందుకు వచ్చిన అన్ని వర్గాల ప్రజలు సర్వర్ పనిచేయక వెనుదిగిరి వెళ్లారు. -
ప్రచార ఆర్భాటంగా స్వైపింగ్
► దరఖాస్తు చేసి 15 రోజులైనా అందని మిషన్లు ► ఉన్న మిషన్లకు సర్వర్ బిజీ ► ఇబ్బంది పడుతున్న జనం, వ్యాపారులు పెద్ద నోట్లు రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు చేయాలంటూ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రజలకు, అటు వ్యాపారులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. తిరుపతి గాంధీరోడ్డు : నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు వెంటనే నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని పాలకులు, అధికారులు ఆదేశించారు. వ్యాపారులు అంగీకరించడమేగాక వారి పరిధిలోని బ్యాంకర్ల వద్ద స్వైపింగ్ (ఈ–పాస్) మిషన్ల కోసం రెండు వారాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. నేటికి ఒక్క మిషన్ కూడా రాలేదు. పెద్దషాపులు, షాపింగ్ మాల్స్‌లో తప్పా మిగతా దుకాణాల్లో ఏర్పాటు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి అ«ధికారులు, బ్యాంకర్లు తమ పరిధిలోని వ్యాపారుల వివరాలు సేకరించారు. మండల పరిధిలో ఎందరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.. అందులో ఎందరు ఏటీఎం కార్డులు వినియోగిస్తున్నారు.. ఆయా మండలాల పరిధిలో ఎన్ని బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ప్రతి వందమందికీ ఒక ప్రతినిధిని నియమించి, ఈ–పాస్ యంత్రాన్ని అందజేసి, వారి ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా అవసరమైన సర్వే నిర్వహించి ఆ వివరాలను జిల్లా అధికారులకు పంపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ దిశగా ఇప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం 30వేల స్వైపింగ్ మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు ఎవరికీ రాకపోవడంలో వ్యాపారులు డీలా పడుతున్నారు. నెల రోజుల్లో ఎక్కడ చూసినా ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు చేతికి అందక ప్రజలు విలవిలలాడుతున్నారు. చిన్నపాటి లావాదేవీలు వదిలి, పెద్ద లావాదేవీలకు మాత్రమే స్వైపింగ్ మిషన్లు వీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ బిజీ.. కొన్ని దుకాణాల్లో ఎప్పటి నుంచో స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి. గతంలో వీటికి పెద్దగా ఆదరణ కనిపించలేదు. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి వీటికి ఆదరణ పెరిగింది. అయితే ఉన్న కొద్దిపాటి మిషన్లకే సర్వర్ బిజీ అని వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో మిషన్లు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అవగాహన ఏదీ? ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై సరైన అవగాహన లేదు. పిల్లలు దుకాణాలకెళ్లి తినుబండారాలు, పెన్ను, పెన్సిల్ వంటి వాటికీ యంత్రాలు వినియోగించాలంటే ఇబ్బందులు తప్పవు. అల్పాదాయ వర్గాలకు కొంతవరకు నగదు రహితం నుంచి ఉపశమనం కల్పించాలి. – అవినాష్‌రెడ్డి, పూల వ్యాపారి దరఖాస్తు చేసి రెండు వారాలైంది నగదు రహిత లావాదేవీలు ప్రారంభించేందుకు స్వైపింగ్ మిషన్ కోసం రెండు వారాల క్రితం బ్యాంకులో దరఖాస్తు చేశా. ఇప్పటివరకు మంజూరు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం. వేగంగా యంత్రాలు అందిస్తే లావాదేవీలు ప్రారంభించేందుకు వీలవుతుంది. – అబ్దాహీర్, ప్రొవిజన్ స్టోర్ ఇలాగే ఉంటే కష్టం పరిస్థితులు ఇలాగే ఉంటే షాపుల్లోని కుర్రాళ్లకు జీతం ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. స్వైపింగ్ మిషన్లు లేక బేరాలు పోతున్నాయి. పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి నోట్లు రద్దు చేయడమే తెలుసుకాని దాని పరిష్కారంలో తీవ్ర లోపాలున్నాయి. –కృష్ణమూర్తి, హార్డ్‌వేర్ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు, అ«ధికారులు నగదు రహిత లావాదేవీల ప్రచారం పై చూపుతున్న ఆసక్తి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో చూప డం లేదు. బ్యాంకులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చిల్లర ఇవ్వకుండా రూ.2వేల నోట్లను మాత్రమే ఇస్తున్నాయి. దుకాణాల్లో పెద్దనోట్లకు చిల్లర ఇవ్వలేక అవస్థలు పడుతున్నాం. –సుధీర్‌రెడ్డి, హార్డ్‌వేర్ షాప్ -
అడుగడుగునా అడ్డంకులు
కర్నూలు(అగ్రికల్చర్): సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన సర్వేకే సమస్యలు మొదలయ్యాయి. సిగ్నల్ అందకపోవడం, సర్వర్ పనిచేయకపోవడంతో ప్రజాసాధికారిక సర్వే పరిస్థితి ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వతేదీన ప్రజాసాధికార సర్వే మొదలైంది. ప్రతి రోజూ ఒక్కో ఎన్యూమరేటర్ కనీసం 14 ఇళ్లు సర్వే పూర్తి చేయాలి. ఈ లెక్కన ఇప్పటి వరకు 1.50 లక్షల గహాలను కవర్ చేసి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఆ సంఖ్య 2098కి కూడా దాటలేదని సమాచారం. ఈ పరిస్థితికి సాంకేతిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2380 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఎన్యూమరేటర్లు, వారి సహాయకులు, సూపర్వైజర్లు దాదాపు సర్వేలో 4 వేల మంది భాగస్వాములవుతున్నారు. ఇందులో అన్ని శాఖల సిబ్బంది ఉండడం, వీరు పూర్తిగా సర్వేకే పరిమితం కావడంతో రోజువారీ కార్యాలయ పనులు నిలిచిపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు సర్వే సాగక, ఇటు ఆఫీసు కార్యకలాపాలు నడవక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. రోజుకో వర్షన్ మారుస్తుండడం, ఇంతవరకు ట్యాబ్‌ల్లో ఎన్యూమరేటర్లు వేలి ముద్ర వేసినా ఓపెన్ కాకపోవడం తదితర సమస్యల వల్ల సర్వే ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. దీనికితోడు పల్లెల్లో నెటవర్క్, సర్వర్‌డౌన్ సమస్యలు సాధారణమైపోయాయి. వర్షన్ మార్చినా.. జిల్లా వ్యాప్తంగా 10 లక్షలకుపైగా కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. శుక్రవారం 2.4.1 కొత్త వర్షన్ ఇచ్చారు. దీంతో సాంకేతిక సమస్యలు ఉండవని, సర్వే సాఫీగా సాగుతుందని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ కొత్త వర్షన్‌తో కూడా అదే పరిస్థితి. తాజాగా శనివారం ఇచ్చిన 2.4.2 వర్షన్ కూడా సర్వేకు ఉపకరించలేదు. అసలు సమస్య ఇది.. సర్వేకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి వేలి ముద్ర అథెంటికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎర్రర్ అంటూ సర్వర్ డౌన్ అవుతోంది. రోజుకో వర్షన్ ఇస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వేలిముద్రకు ఎరెక్షన్ కంపెనీ బయోమొట్రిక్‌లు ఇచ్చారు. వీటిని జిల్లా స్థాయిలో కొన్నారు. ఇవి పనిచేయకపోవడంతో మంత్ర బయోమొట్రిక్‌లు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికితోడు నెట్వర్క్ సమస్యలు కూడా వేధిస్తున్నాయి. సర్వే మొదలై ఆరు రోజులు పూర్తయినా నాలుగు వేల మంది నిమగ్నమైనా పెద్దగా పురోగతి లేకపోవడం గమనార్హం. అ«ధికార వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,792 ఇళ్లలో 4,868 మంది, అర్బన్ ప్రాంతాల్లో 306 గహాలను సర్వే చేయగలిగారు. ఆఫ్‌లైన్ టు ఆన్లైనే పరిష్కారం: మౌలాబాషా, వీఆర్ఓ, బ్రాహ్మణకొట్కూరు రెవెన్యూలో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉన్నా పక్కనపెట్టి ప్రజాసాధికార సర్వేకు వెళ్తుతున్నాం. ఇంటి లొకేషన్ వివరాల నమోదులో ఇబ్బందులు లేవు కానీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి అథెంటికేషన్ తీసుకోవడం దగ్గర సర్వర్ డౌన్ అవుతోంది. ఇప్పటి వరకు నందికొట్కూరు మండలంలో ఒక్క ఇల్లు కూడా సర్వే పూర్తి కాలేదు. ఆఫ్‌లైన్‌లో సర్వే చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే సమస్యకు పరిష్కారం. శుక్రవారం 2–4.2 వర్షన్ ఇచ్చినా ఉపయోగం లేదు. 3జీ,4జి సిమ్‌లు ఇచ్చినా నెట్వర్క్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగ గాయపడిన హోంగార్డు చికిత్స పొందుతు కొద్దిసేపటి క్రితం మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సీడబ్ల్యూసీ గొడౌన్లో విధులు పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తున్న సర్వర్(35) అనే హోంగార్డును వారం రోజుల కిందట ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. -
సర్వర్ డౌన్.. పింఛన్లకు బ్రేక్
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : పింఛన్లు పొందడంలో పండుటాకుల కష్టాలు తారాస్థాయికి చేరాయి. గజగజ వణికే చలిని లెక్క చేయకుండా సాయంత్రం వరకు పడిగాపులు కాచినా పింఛన్లు అందడం లేదు. నడవలేక పోస్టాఫీసులకు వెళ్లలేని స్థితిలో ఉన్న వారు సైతం తప్పని పరిస్థితుల్లో ఆటోల్లో తిరుగుతున్నారు. ఆటో ఖర్చులు మోపడవుతున్నా మిషనులో వేలిముద్రలు పడటం లేదు. మంగళవారం సర్వర్ డౌన్ అయిపోవడంతో గంటకు ఓ పెన్షన్ కూడా అందలేదు. ఒకసారి ఆఫ్ అయిన మిషన్లు తిరిగి ఓపెన్ కాలేదు. ఇలాంటి పరిస్థితి మంగళవారం జిల్లా అంతటా నెలకొంది. 30వ తేదీకి పంపిణీని ముగిస్తారంటూ ఆందోళన పడుతూ వచ్చిన వృద్ధులకు ఇదో ఆశనిపాతంగా మారింది. ఏం చేయాలి, ఎవరి సాయం అర్థించాలో తెలియక పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. జిల్లాలో 3,02,101 మంది పింఛన్ల పంపిణీ బాధ్యతను అధికారులు పోస్టాఫీసులకు అప్పగించారు. అయితే అధికారులు సోమవారం సాయంత్రానికి కేవలం 2,34,670 పింఛన్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. మిగతా 67,432 పింఛన్లను 30వ తేదీ పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్న సమయంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సర్వర్ మొరాయించడంతో కొన్నిచోట్ల మిషన్లు కూడా ఓపెన్ కాలేదు. నగరంలోని మెడికల్ కళాశాలలో ఉన్న పంపిణీ కేంద్రం వద్ద సుమారు 800 మంది లబ్ధిదారులు పడిగాపులు కాశారు. అధికారులు సరైన విధానం పాటించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. ఎస్ఏపీ క్యాంప్ పోస్టాఫీసు వద్ద సుమారు 700 మంది వృద్ధుల్లో మధ్యాహ్నం ఒక్కరికి కూడా పింఛన్ లభించకపోవడంతో ఏపీఎస్పీ క్యాంప్ ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు.దీంతో గంట సేపు బస్సులు, ఇతర వాహనాలు ఆ మార్గంలో వెళ్లలేకపోయాయి. అలాగే బుధవారపేటకు చెందిన వృద్ధులు స్థానిక కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాకు సీపీఎం నాయకులు కూడా సంఘీభావంగా నిలిచారు. పంపిణీ మరో రోజు పొడిగిస్తాం మొదట ఈనెల 30వ తేదీతో పంపిణీ ముగించాలనుకున్నాం. అయితే చివరి రోజున ఆన్లైన్లో సాంకేతిక కారణాల వల్ల సర్వర్ సరిగ్గా పనిచేయలేదు. అందువల్ల పింఛన్ల పంపిణీని మరుసటి రోజు అంటే బుధవారం కూడా పంపిణీ చేస్తాం. పంపిణీ కాని పింఛన్లు ఎక్కడికీ పోవు. వాటిని తదుపరి నెలలో కలిపి చెల్లిస్తాం. - కె.వి.సుబ్బారావు, పోస్టల్ సూపరింటెండెంట్ -
దొంగ అనే నెపంతో.. సర్వర్‌పై దాడి!
-
తెనాలి కేంద్రంగా 6 వేల కోట్ల కుంభకోణం
హైదరాబాద్: తెనాలి కేంద్రంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ మల్టీ కమాడిటీస్ ఎక్స్సెంజ్(ఎంసీఎక్స్) ద్వారా ఆరువేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు తెలుస్తోంది. ఎంసీఎక్స్ డూప్లికేట్ సర్వర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తెనాలి కేంద్రంగా నిర్వహిస్తున్న జీరో దందా ద్వారా ఆరువేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు సమాచారం. ఈ అక్రమ దందా 63 సెంటర్లలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నెదర్లాండ్ కేంద్రంగా ఆపరేషన్ కు తెర తీసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మాజీ ఉద్యోగులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్వర్ ఏర్పాటు చేసి అక్రమ ఖాతాకు 6 వేల కోట్లు తరలించినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ నకిలీ దందాపై పోలీసులు విచారణ ప్రారంభించారు.