భర్త మోసాన్ని జీర్ణించుకోలేక... ఓ రేంజ్‌లో రివైంజ్‌ తీర్చుకున్న భార్య | Woman Decided Shame His Call Cheater Partner Give Full Page Advert | Sakshi
Sakshi News home page

మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్‌లో రివైంజ్‌ తీర్చుకున్న భార్య

Published Sat, Aug 13 2022 3:01 PM | Last Updated on Sat, Aug 13 2022 3:01 PM

Woman Decided Shame His Call Cheater Partner Give Full Page  Advert - Sakshi

భార్యభర్తల గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అవి ఓ మాదిరిగా ఉన్నంత వరకు ఓకే. గానీ శృతీ మించితే ఇరువురికి ప్రమాదమే. ఐతే ఇక్కడోక జంట కూడా అట్లానే పోట్లాడుకుంటున్నారు. దీంతో సదరు మహిళ ఓపిక నశించపోయి భర్త తీరుని బహిరంగంగా అందరికి తెలియపర్చాలనుకుంది. అందుకోసం ఏం చేసిందో వింటే అమో! అని నోరెళ్లబెడతారు.

ఏం జరిగిందంటే....ఆస్ట్రేలియాలోని జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్‌ తనను మోసం చేస్తూ... వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతన్ని ఎలాగైన అవమానించుకోవాలని కంకణం కట్టుకుంది. అందుకోసం అని ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వారపత్రిక (వీక్లీ మ్యాగజీన్‌) 'మాకే అండ్‌ విట్‌ సండే లైఫ్‌' లో బహిరంగంగా భర్త గురించి ఒక ప్రకటన ఒకటి ఇచ్చింది. అందులో ప్రియమైన స్టీవ్‌ నువ్వు ఇప్పుడు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో అందరికి తెలిసిపోతుంది అని వారపత్రికలోని ఒక ఫుల్‌ పేజ్‌లో అతడి గురించి బహిరంగ ప్రకటన ఇచ్చింది.

ఆమె అ‍్కడితో ఊరుకోకుండా ప్రకటన చివరల్లో ఇంకో షాక్‌ ఇచ్చింది.  ఈ ప్రకటనను నీ  క్రెడిట్‌ కార్డును ఉపయోగించే ఇచ్చానంటూ.. తన భర్త స్టీవ్‌కి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఇది చదివిన పాఠకులలో ఉత్సుకతను పెంచి ఆమె ఎవరు ఎందుకలా మోసం చేశాడంటూ ఆత్రుతతో సదరు మ్యాగజీన్‌ కార్యాలయానికి ప్రత్యుత్తరాలు రాశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఈ విషయమై పలు పోస్టుల రూపంలో ప్రశ్నల వెల్లువెత్తినట్లు ప్రముఖ​ వీక్లీ మ్యాగజీన్‌ నిర్వాకులు తెలిపారు.

సదరు వారపత్రిక తమకు స్టీవ్‌ గురించి తెలియదని పాఠకులకు వివరణ ఇ‍చ్చింది. పైగా అతను చెడ్డవాడని మాత్రం చెప్పింది. ఇకపోతే జెన్నీ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను ఆమె క్రెడిట్‌ కార్డుతో డబ్బులు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. ఏదీఏమైన జెన్నీ బహిరంగ ప్రకటన ఒక పెద్ద తుపాను సృష్టించింది. పలువురు పాఠకులు మాత్రం జెన్నీ మీకు మంచి జరగాలి, అతనికి తగిన శాస్తి చేశారంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు.

(చదవండి: చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement