weekly
-
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది. ఒక సాయంత్రం, అతని ఇంటికి కొద్ది దూరంలో, ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. అతనిని ఆపి, ఒక డజను అరటిపండ్లు కొనమని అడిగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక్క రోజు కనిపించక పొతే ఆపి మరీ ‘ఏంటి బొత్తిగా నల్లపూస అయ్యావు?’ అనడిగేసేది. ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది.బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్‌కి వెళ్ళి తలుపు తెరిచాడు. భుజమ్మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టాడు. అరటిపండ్లు ఉన్న బాగ్, పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకి వచ్చాడు.వీధి చివరి వరకు నడిచిన తర్వాత, ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు. పీలగా, బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది. బోసు కదలలేదు. కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది. కొన్ని సెకన్ల పాటు! ఆమె ముఖం అభావంగానే ఉంది. ఆమె చూపులు అతని చేతిలో ఉన్న బాగ్ మీద పడ్డాయి. అంతే ఆమె ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకు తెలుసు. అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు. ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి.‘ఇదిగో మీ అరటిపండ్లు’ బోసు అన్నాడు. ‘ఓ! మళ్ళీ అడగకుండానే తెచ్చావు’ అంది ఆమె. బోసు ‘ఎస్’ అంటూ అభిమానంగా నవ్వాడు. ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపడం అతనికి చాలా ఇష్టం. ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు. ఆమె తోడు కోసం కింద భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆమెకు వంట చేసుకోవడం కుదరకపోవడంతో, పనివాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళు కారాలు ఎక్కువేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది. వాటిల్లో అరటిపండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రోజూ ఆఫీసు నుండి వచ్చాక బోసు.. ఆమెతో కలసి వాకింగ్‌కి వెళ్ళేవాడు. ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది. ఆమె ఒక టీచర్. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది. ఆమెకు సుడోకు అంటే ఇష్టం.‘నేను మీ కోసం ఇంకోటి తెచ్చాను’ అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు. ‘అదేంటో?’ ఆమె ముఖం చిన్నపిల్లలా అయోమయంగా కనిపించింది.‘అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా! తెచ్చాను’ బోసు చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి, ‘థాంక్యూ.. థాంక్యూ’ సంబరపడిపోయింది.అయితే బోసుకి నిరాశగా అనిపించింది. తానేమి ఆశించాడు? ఉద్వేగంతో గెంతుతుందనా? ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా? కొన్నిసార్లు ఆఫీస్ వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్లుతుంది. అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది. నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తాడు. ఆమె ఒంటరిగా ఉంటోంది. బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు. తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు. ఏదో తెలియని పాశం ఆమె వైపు సూదంటు రాయిలా లాగుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాల తహతహలాడుతున్నాడు. అడిగేతే బావుంటుందా? తననూ మగవాళ్లందరిలో ఒకడిగా జమకట్టి.. తనతో స్నేహం మానేస్తే..! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. కాని అతని కుతూహులం నస పెడుతూనే ఉంది.. ఆమె కథ ఏమై ఉండొచ్చు? అని! అయితే ఈమధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది. అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు. తన వస్తువును తనకు కాకుండా చేస్తున్న ఫీలింగ్. ఒక రకమయిన పొసెసివ్‌నెస్ వచ్చేసింది.రెండు రోజులుగా ఆమెను కలవలేదు. ఆ రోజు ఆదివారం.. ఆఫీస్‌కి సెలవు. దానికి తోడు పెద్ద వాన. కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది. ఆమెకి బాగా జబ్బు చేసిందని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనిషి నీరసించి ఉంది. అసలే బక్కపల్చటి మనిషి.. ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసినట్టుంది. దగ్గరగా వెళ్ళి సన్నగా పుల్లలా ఉన్న చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ‘ఎలా ఉంది? నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా! నేను నీకేమీ కానా?’ అంటూ.ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయింది ఆమె. అదేం కాదననట్లు తల అడ్డంగా ఊపింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. ‘కాసేపు కింద గార్డెన్‌లోకి వెళదాం. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు’ అంది.‘సరే’ అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ సాయంకాలం.. వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు దొర్లాయి. ఆమె బలహీనమైన చేయి అతని చేతిలో ఉంది.‘నేను పెళ్ళి చేసుకోలేదు!’ ‘మీకు పెళ్ళయిందా? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు?’ కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు ఇచ్చింది.ఆశ్చర్యపోయాడు బోసు. మరి తను ఆ రోజు చూసిందేమిటి? ఆ దృశ్యాలు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఆమె ఆ పిల్లలను కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పటం లేదు? ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా, లేదా తను ఊహించుకున్నాడా? ఆమె డిమెన్షియాతో బాధపడుతోందా? అని మథనపడుతూనే ‘మరి ఆ పిల్లలు?’ అడిగాడు అప్రయత్నంగానే! ‘వాళ్ళు నావాళ్ళు కాదు’ అని చెప్పి వెంటనే ‘అంటే నా పిల్లలే, కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను’ అన్నది.బోసుకి గందరగోళంగా అనిపించింది, ‘మీరు వారిని దత్తత తీసుకున్నారా? క్లారిటీగా చెప్పండి’ బతిమాలుతున్నట్టుగా అడిగాడు.ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ, ‘ఎక్కడయినా కూర్చుందాం. నా కాళ్ళు లాగుతున్నాయి’ అన్నది. ‘ఓ! సారీ.. పదండి’ అంటూ దగ్గరే ఉన్న బెంచ్ వైపు కదిలారు. ‘నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను’ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది. ‘అయ్యో సారీ.. నాకు తట్టనే లేదు’ నొచ్చుకుంటూ అన్నాడు. ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ‘వారు నా పిల్లలే.. కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘స్కూల్ టీచర్‌గా పనిచేసే దాన్ని. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు. నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం యేర్పడలేదు. దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు. ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు. నేను పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కోరిక.కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను వారిని ఏమనలేకపోయాను. అసలు పెళ్ళి మీద నాకు దృష్టే లేదు. ఏదో చెయ్యాలనే తపన. పెళ్ళి చేసుకుంటే చేయలేను. నా ఈ ఆలోచన మా పేరెంట్స్‌కి అర్థంకాలేదు. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయాను’ ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది,‘రోజూ స్కూల్ నుండి ఇంటికొచ్చాక.. మా ఏరియా చుట్టుపక్కలంతా చుట్టొస్తుండేదాన్ని. అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడను చూశాను’ అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ‘ఏమైందప్పుడు?’ బోసు ఆత్రుతగా అడిగాడు.‘హు..?’ అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది. ‘అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు’ బోసు గుర్తుచేశాడు.‘ఆ.. అవును.. మురికివాడలో ఒక గుడిసె బయట.. ఒక మగ మనిషి, ఓ ఆడ మనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు. మిగతావాళ్ళంతా నవ్వుతూ, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి. అయిష్టంగానే వెనక్కి తిరిగాను. ఆ ఆడమనిషి ఆ పిల్లలను చెత్త కుప్ప మీదకు తోసేసింది. ఆమె మనసులోని దరిద్రమేదో ఆమె చేత ఆ పని చేయించి ఉండవచ్చు. ఏమైనా వాళ్ళు ఆమె పిల్లలు!తల్లిదండ్రులను భయంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందో బహుశా.. వాళ్ళకు తెలుసు కాబోలు’ అని చెబుతూ ఆమె ఆపేసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది. ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసును ఆశ్చర్యపరచాయి. అతను కూడా ఆందోళన చెందాడు. ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా? అతనికి వేచి ఉండే ఓపిక లేదు. కానీ వినాలనే కుతూహలం అతను వేచి ఉండేలా చేసింది. బోసు టైమ్ చూసుకున్నాడు.. దిక్కులు చూశాడు. ఆమె తిరిగి చెప్పడం ఎప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఆవె కళ్ళు తెరిచింది. హమ్మయ్య అనుకున్నాడు బోసు. ‘నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను. అదే దృశ్యం రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ ఆడమనిషి తన పిల్లలను కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేసుకున్నాను కూడా. పిల్లల్ని కొట్టొద్దని ప్రాధేయపడ్డాను. ఆమె వినలేదు. అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ‘ఇది వీళ్ళు రోజూ ఆడే నాటకమే. మీరు పట్టించుకోకండి’ అని చెప్పారు. నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే.కొన్ని రోజుల తర్వాత.. ఒకసారి నేను స్కూల్‌కి వెళుతూండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు. మనసు చివుక్కుమంది. స్కూల్‌కి ఆలస్యమవుతున్నా.. వాళ్ళను వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘నేను ఆ పిల్లల దగ్గరకు వెళ్ళడం నాకిప్పటికీ గుర్తుంది. అంత చిన్న పిల్లలని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను. అప్పుడే తెలిసింది. వాళ్ళంతా అనాథలని! దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుండి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ.. వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను’ అంటూ బోసు వైపు చూసింది.‘తర్వత ఏమైంది?’ ఉత్కంఠగా అడిగాడు బోసు. అచ్చు రాత్రిపూట.. తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్న పిల్లవాడిలా! ‘నేను వాళ్ళను నా అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాను.’బోసు ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు వంచి.. కళ్ళు మూసుకునుంది. ‘తర్వాత?’ అడిగాడు అదే ఉత్కంఠతో! కళ్ళు తెరుస్తూ ఆమె బోసు వైపు తిరిగి ‘వాళ్ళు నాతోనే ఉన్నారు’ చెప్పింది నెమ్మదిగా. బోసులో అయోమయం.. ‘వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ పిల్లలను మీరెలా తెచ్చుకున్నారు? వాళ్ళు అనుమతించారా? దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా?’ఆమె.. అతని నుండి కళ్ళు తిప్పుకుని, ముడుచుకున్న తన చేతులను చూసుకుంటూ ‘నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు. అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు’ అని చెప్పింది స్థిరంగా. ‘అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళను? చెప్పకుండా తీసుకెళ్ళడమంటే అదే కదా?’ విస్తుపోతూ బోసు. ‘ఎంతమందిని తెచ్చారు?’ తేరుకుని అడిగాడు. ‘ఒక పన్నెండు మందిని! వాళ్ళకు ఒక హోమ్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళిల్లు. కుక్, కేర్‌టేకర్‌ని పెట్టాను. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు’ చెప్పింది. ‘అయినా సరే.. అది కిడ్నాప్’ అంటూ గట్టిగా అరిచాడు బోసు. మళ్ళీ వెంటనే ‘కాదు.. కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో!’ సాలోచనగా అన్నాడు. ఆమె వణుకుతూ మెల్లగా లేచింది. బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు.‘నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు’ అంటూ అడుగులు వేసింది. ఆ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు. గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకు ఇచ్చాడు.‘థాంక్యూ మై డియర్ బాయ్’ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ‘నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడు గ్రానీ..’ అంటూ ఆమె బుగ్గలు పుణికాడు బోసు. ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోస్‌ని చూసి నవ్వింది. ఆ పెద్దామె చేయి పట్టుకుని ముందుకు నడిపించసాగింది. పెద్దావిడ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగి బోసును చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టనిపిస్తుంది. బహుశా.. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ , నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ పోయారు. అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది. తన అయిదవ ఏట నానమ్మ పోయింది. అలా నానమ్మ జ్ఞాపకమూ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతో అమ్మానాన్నలకూ దూరంగానే ఉన్నాడు. అంత బాండింగ్ లేదు.వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి. అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు. సొంతూళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు. అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయున్నారు. ఉండబట్టలేక ఫోన్లు చేస్తే.. విసుక్కుంటాడు. పొడిపొడిగా మాట్లాడి సెకన్లలో కాల్ ముగించేస్తాడు. వాళ్ళెప్పుడు రమ్మన్నా వెళ్ళకుండా సాకులు వెదుక్కుంటుంటాడు. అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల ఆ వృద్ధురాలు కనువిప్పు కలిగించింది. అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది. వాళ్ళకు అమ్మ అవడం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది.ఫోన్ మోగుతోంది. పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హెలో..’ అంది. ‘ఎవరూ?’ అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు. ‘హుష్..’ అని భర్తకు సైగ చేసింది. ‘వాడేనా?’ కుతుహులం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవునన్నట్టుగా తలూపింది. ‘ఎలా ఉన్నావు నాన్నా?’ ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫొటోను ప్రేమగా స్పృశించింది శ్యామల. – మణి వడ్లమానిఇవి చదవండి: 'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై.. -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్!
బాలల కోసం బాలలే నడిపిస్తున్న చానల్ ఇది. బ్రిటన్‌కు చెందిన ‘స్కై చానల్’లో భాగంగా ‘ఎఫ్‌వైఐ’– ఫ్రెష్ యూత్ ఇనీషియేటివ్ వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం బాలల కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులో రిపోర్టింగ్, యాంకరింగ్ వంటి పనులన్నీ బాలలే చేస్తారు. వీరు ఆరితేరిన రిపోర్టర్లు, యాంకర్లకు దీటుగా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుండటం విశేషం. ఈ బాల జర్నలిస్టులు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. వారం రోజుల్లో జరిగిన ముఖ్య పరిణామాలపై ‘వీక్లీ న్యూస్ షో’, పిల్లలతో మాటామంతి కార్యక్రమం ‘కిడ్వర్జేషన్’, ‘బిగ్ ఏంబిషన్’, ‘మ్యాన్ వర్సెస్ చైల్డ్’ కార్యక్రమంలో బాలల వంటల విశేషాలు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉక్రెయిన్, గాజా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల బాధితులైన బాలల గురించి కూడా ఈ బాల జర్నలిస్టులు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశారు. (చదవండి: హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!) -
భర్త మోసాన్ని జీర్ణించుకోలేక... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య
భార్యభర్తల గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అవి ఓ మాదిరిగా ఉన్నంత వరకు ఓకే. గానీ శృతీ మించితే ఇరువురికి ప్రమాదమే. ఐతే ఇక్కడోక జంట కూడా అట్లానే పోట్లాడుకుంటున్నారు. దీంతో సదరు మహిళ ఓపిక నశించపోయి భర్త తీరుని బహిరంగంగా అందరికి తెలియపర్చాలనుకుంది. అందుకోసం ఏం చేసిందో వింటే అమో! అని నోరెళ్లబెడతారు. ఏం జరిగిందంటే....ఆస్ట్రేలియాలోని జెన్నీఅనే మహిళ తన భర్త స్టీవ్ తనను మోసం చేస్తూ... వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని జెన్నీ అతన్ని ఎలాగైన అవమానించుకోవాలని కంకణం కట్టుకుంది. అందుకోసం అని ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ వారపత్రిక (వీక్లీ మ్యాగజీన్) 'మాకే అండ్ విట్ సండే లైఫ్' లో బహిరంగంగా భర్త గురించి ఒక ప్రకటన ఒకటి ఇచ్చింది. అందులో ప్రియమైన స్టీవ్ నువ్వు ఇప్పుడు ఆమెతో చాలా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నువ్వు ఎంత నీచమైన మోసగాడివో అందరికి తెలిసిపోతుంది అని వారపత్రికలోని ఒక ఫుల్ పేజ్‌లో అతడి గురించి బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఆమె అ్కడితో ఊరుకోకుండా ప్రకటన చివరల్లో ఇంకో షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనను నీ క్రెడిట్ కార్డును ఉపయోగించే ఇచ్చానంటూ.. తన భర్త స్టీవ్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇది చదివిన పాఠకులలో ఉత్సుకతను పెంచి ఆమె ఎవరు ఎందుకలా మోసం చేశాడంటూ ఆత్రుతతో సదరు మ్యాగజీన్ కార్యాలయానికి ప్రత్యుత్తరాలు రాశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఈ విషయమై పలు పోస్టుల రూపంలో ప్రశ్నల వెల్లువెత్తినట్లు ప్రముఖ వీక్లీ మ్యాగజీన్ నిర్వాకులు తెలిపారు. సదరు వారపత్రిక తమకు స్టీవ్ గురించి తెలియదని పాఠకులకు వివరణ ఇచ్చింది. పైగా అతను చెడ్డవాడని మాత్రం చెప్పింది. ఇకపోతే జెన్నీ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించమని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటనను ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. ఏదీఏమైన జెన్నీ బహిరంగ ప్రకటన ఒక పెద్ద తుపాను సృష్టించింది. పలువురు పాఠకులు మాత్రం జెన్నీ మీకు మంచి జరగాలి, అతనికి తగిన శాస్తి చేశారంటూ ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు. (చదవండి: చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్) -
సంతోషం ఆగదు
‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్‌రైజర్ ఫంక్షన్ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
ఇష్క్‌కి... ఏమైంది?
పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నాడు డాక్టర్ ప్రమోద్. ఎదురుగా సీఐ రవీంద్రనాథ్ కుర్చీలో వెనక్కి జారగిలబడి, కాళ్లు బార్లా చాపి కూర్చుని ఉన్నాడు. రవీంద్ర కాళ్లు ఊపుతున్నాడు. సీఐ బూట్లు ప్రమోద్‌కు తాకీతాకనట్లు తాకుతున్నాయి. తగలడానికి తగలకపోవడానికి మధ్య వెంట్రుక వాసి కంటే దూరం లేదు. తన కాళ్లు డాక్టర్‌కి తగులుతాయేమోననే స్పృహ సీఐలో ఏ కోశానా ఉన్నట్లు లేదు. తగిలితే పోయేదేముంది అనే నిర్లక్ష్యం కూడా ఉన్నట్లుంది అతడిలో. ఆ బూట్లు తనకు తగులుతాయేమోనని ప్రమోద్ మరింత కుంచించుకుపోయి కుర్చీలో ఒదుగుతున్నాడు. అతడు ఒదిగేకొద్దీ సీఐలో ఉత్సాహం రెట్టింపవుతోంది. ‘‘ఆ చెప్పు... ట్రీట్మెంట్ చేయాలని తెలీదా’’ సంబోధన లేదు, నేరుగా సూటిగా ఉందతడి ప్రశ్న. అతడి ప్రశ్నలో నువ్వు ట్రీట్మెంట్ చేయలేదు అనే ఆరోపణ కలగలిసిపోయి ఉంది. ‘... అంటే, తాను ట్రీట్మెంట్ చేయలేదనే అతడి అభిప్రాయమా’ ప్రమోద్ మెదడులో మరో ప్రశ్న ఉదయించింది. అదే మాట అనగలిగిన పరిస్థితి కాదు. ఆ సంగతి అతడికి తెలుసు. అందుకే గొంతు పెగల్లేదు. ‘అయినా... తాను ట్రీట్మెంట్ చేయలేదని అతడికై అతడే నిర్థారణకు వచ్చేశాక ఇక నేను చెప్పేదేముంటుంది. అతడు వినేదేముంటుంది. నిర్ధారణకు వచ్చిన విషయం మీద ఇక దర్యాప్తు ఎందుకు? తీసుకోవలసిన చర్యలేంటో తీసుకుంటే పోతుందిగా... ఎలాగూ చట్టం చేతుల్లోనే ఉందాయె’ ప్రమోద్ పెదవులు విడివడడం లేదు. కానీ, బుర్రలో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. ‘‘ఏం మాట్లాడకుండా కూర్చుంటే... మేము రిపోర్ట్ ఏం రాసుకోవాలి’’ గద్దించాడు సీఐ. ‘ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా’ ప్రమోద్ బుర్ర బదులిస్తూనే ఉంది కానీ మౌనం వీడడానికి మనసే అంగీకరించడం లేదు. ‘‘నీతోపాటు హాస్పిటల్లో ఇంకా ఎవరున్నారు? ఆ లేడీతో నీకు పనేంటి’’ సీఐ స్వరంలో బూతు పలుకుతోంది. ప్రమోద్ నిలువెల్లా కంపించిపోయాడు. ‘మై గాడ్! హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్ లేడీస్ ఉంటారు కదా! అది కూడా తప్పేనా’ పెనుగులాడుతోంది అతడి మనసు. ‘‘డాక్టర్వని చూస్తున్నా. నోరు మెదపకపోతే మా పద్ధతులు మాకుంటాయ్’’ మా పద్ధతులు అనే మాటను ఒత్తి పలుకుతూ మళ్లీ గదిమాడు సీఐ. ‘‘మీరే పద్థతిలో విచారణ చేసుకున్నా సరే. నేను చెప్పేది మొదటి రోజే చెప్పేశాను. ఇక చెప్పడానికేమీ లేదు’’ అప్పటికి పెదవి విప్పాడతడు. ఆ గొంతులో ఆవేదనతోపాటు నిస్సహాయత. ‘‘ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉన్నావ్. ఏం డాక్టర్వి బే నువ్వు. నీకు డిగ్రీ ఇచ్చినోడెవడు? డాక్టర్ కోర్సు చదివి వచ్చావా, పట్టా కొనుక్కుని బోర్డు పెట్టావా’’ సీఐ మాటల్లో వెటకారం తెలుస్తూనే ఉంది ప్రమోద్‌కి. ఆవేశంతో బ్లడ్ ప్రెషర్ పెరగడమూ తెలుస్తోంది. అణచుకోవడం తప్ప చేయ గలిగిందేమీ లేదనే గ్రహింపు అతడిని అదుపు తప్పనివ్వకుండా ఆపుతోంది. వైద్యం చేయడంతోపాటు సహనంగా ఉండడం, సంయమనాన్ని కోల్పోకుండా ఉండడం కూడా కోర్సులో భాగమే. అయితే ఆ సంయమనాన్ని ఇలాంటి చోట పాటించాల్సి రావడం నిజంగా దురదృష్టం. సీఐ మొబైల్ ఫోన్ రింగయింది. పేరు చూడగానే విసుగ్గా ముఖం పెట్టి కానిస్టేబుల్ని పిలిచి ఫోన్ ఇచ్చాడు రవీంద్ర. ఫోన్‌తో పక్క గదిలోకి వెళ్లాడు కానిస్టేబుల్. ‘‘సర్... అలాగే సర్’’ ‘‘...........’’ ‘‘ఆ పని మీదే ఉన్నాం సర్’’ ‘‘.................’’ ‘‘ఎంతమాట సర్... ఇంతకంటే మాకు ముఖ్యమైన పనులేముంటాయ్ సర్. దొరవారు విచారిస్తున్నారు సర్. అందుకే ఫోన్ తియ్యలేకపోయారు సర్’’ సీఐ మీద ఈగ వాలనివ్వకుండా, అవతలి వ్యక్తి పట్ల వినయవిధేయతలతో బదులిస్తున్నాడు కానిస్టేబుల్. స్టేషన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండడంతో కానిస్టేబుల్ మాటలు సీఐ రవీంద్రకి, డాక్టర్ ప్రమోద్‌కి వినిపిస్తూనే ఉన్నాయి. కానిస్టేబుల్ వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టి, సీఐ చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడో ప్రమోద్‌కు అర్థం కాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కానీ సీఐ ముఖం చెప్తోంది అది ఏదో అయిష్టమైన విషయమేనని. అసలే ప్రసన్నత లేని రవీంద్ర ముఖం మరింత అప్రసన్నంగా మారడం కనిపిస్తూనే ఉంది. ‘‘మినిస్టర్ ఇంటి నుంచి ఫోన్. మినిస్టర్ గారి కోడలు అన్నం తినడం లేదట’’ హూంకరించాడు సీఐ. ‘‘హాస్పిటల్లో మేం చేయగలిగింది చేశాం. మా దగ్గరకు వచ్చేటప్పటికే కొన ఊపిరితో ఉండడం వల్ల ట్రీట్మెంట్కి సహకరించలేదు. డెత్ సమ్మరీలో అదే రాశాను’’ అన్నాడు ప్రమోద్ అభావంగా. ∙∙ కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది రజిత. ప్రమోద్ ఏమీ మాట్లాడకుండా రజితను తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు. ఏదో అడగబోయిన రజిత కొంచెం తమాయించుకుంది. ఎప్పట్లా సోఫాలో కూర్చోకుండా నేరుగా బెడ్‌రూమ్‌లోకెళ్లి పోయాడు. అతడి వెనకే వెళ్లింది రజిత. ప్రమోద్ బాత్రూమ్లో కెళ్లడంతో రజిత తిరిగి హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంది. ఏం చేయాలో తోచక రిమోట్ తీసుకుని చానెల్స్ మారుస్తోంది. ‘‘ప్రమోదుడొచ్చాడా’’ అంటూ తన గదిలో నుంచి బయటికొచ్చింది కాత్యాయిని. ‘వచ్చాడు మోదం లేకుండా’ అనాలనిపించింది రజితకు. తనకున్నంత బాధ ఆవిడకు కూడా ఉంటుంది కదా! ఫ్రస్టేషన్లో తను మాట తూలి పెద్దామెను బాధ పెట్టడం దేనికి అని సరిపెట్టుకుంది. ‘‘వచ్చారత్తయ్యా! స్నానానికెళ్లారు’’ ముక్తసరిగా బదులిచ్చింది. ‘‘పాప ట్యూషన్ నుంచి ఇంకా రాలేదా’’ అంది కాత్యాయిని కోడలి వైపు చూస్తూ. ‘‘వస్తుందిలెండి. టైమ్ ఉంది కదా’’ అన్నది రజిత. ఇంతలో ప్రమోద్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏం జరిగిందో తనే చెప్తాడని ప్రమోద్ ముఖంలోకి చూస్తోంది రజిత. కాత్యాయిని గబగబా కిచెన్‌లోకి వెళ్లింది. ఒక కప్పులో సేమ్యా పాయసం, మరో కప్పులో దూద్పేడాతో వచ్చింది. ‘‘నీ బర్త్‌డే రోజు దేవుడికి పూజ చేసుకోకుండా, స్వీటు తినకుండా వెళ్లిపోయావురా నాన్నా! ఇన్నేళ్లలో ఏ పుట్టినరోజుకైనా నా చేత్తో చేసిన సేమ్యా పాయసం తినకుండా ఉన్నావా! అడిగి మరీ చేయించుకునే వాడివి. ఈ రోజు పొద్దున నేను పిలుస్తున్నా వినకుండా అంత పొద్దున్నే వెళ్లిపోయావు. ఇప్పుడైనా కొత్త బట్టలు వేసుకుని రా! నేను మధ్యాహ్నం బాబా మందిరానికెళ్లి నీ పేరుతో బాబాకి పేడా ప్రసాదం పెట్టాను. తిను’’ అని పక్కన కూర్చుని కొడుకు వీపు మీద చేయి వేసి నిమురుతోంది కాత్యాయిని. ‘‘వద్దమ్మా! ప్లీజ్!’’ ప్రమోద్‌కి మాట రావడం కష్టంగా ఉంది. ‘‘మీ తల్లి మనసు ఆరాటమే తప్ప, కొత్త బట్టలు వేసుకుని స్వీట్ తినే కండిషన్లో ఉన్నామా అత్తయ్యా’’ అన్నది రజిత తల్లీకొడుకును మార్చి మార్చి చూస్తూ. ‘‘ఏమైంది నాన్నా, పోలీసులు ఏమన్నారు’’ ఉండబట్టలేక అడిగింది కాత్యాయిని. ‘‘మంత్రి గారి కోడలు అన్నం తినడం లేదట’’ ప్రమోద్ మాటకు విచిత్రంగా చూశారు అత్తాకోడళ్లిద్దరూ. ‘‘ఆమెకి అంత ప్రేమ ఉన్నప్పుడు సిచ్యుయేషన్ క్రిటికల్ కాకముందే తీసుకురావాల్సింది’’ అన్నది రజిత రిమోట్ తీసుకుని టీవీని మ్యూట్‌లో పెడుతూ. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆ కోపం ఆమె మాటలో పలుకుతోంది. ‘‘ఎంత అధికారం ఉంటే మాత్రం ఇంత దురాగతమా’’ కాత్యాయిని గొంతు వణుకుతోంది. ప్రమోద్, రజిత... ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించారు. ‘‘ఒకరి జోలికెళ్లకుండా మన బతుకేదో మనం గుట్టుగా బతికే వాళ్లం. మన మీద ఈ నిందలేంటి నాన్నా!’’ కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వాపోయింది కాత్యాయిని. బయట అడుగుల చప్పుడు... ఆ అలికిడికి ముగ్గురి చెవులూ రిక్కించుకున్నాయి. ‘‘హర్షిత వచ్చినట్లుంది’’ పరిస్థితిని శాంత పరచడానికి ప్రమోద్ మాట మార్చాడు. ‘‘పపా! మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’’ లోపలికి వస్తూనే బ్యాగ్ పక్కన పడేసి, తండ్రికి షేక్ హ్యాండిచ్చి ప్రమోద్‌కు మరో పక్కన కూర్చుంది హర్షిత. కూతురు బర్త్‌డే గ్రీటింగ్స్ చెబితే థాంక్స్ చెప్పడానికి కూడా పెదవులు విడివడడం లేదు ప్రమోద్‌కి. ‘‘ఉదయం నేను నిద్రలేచేటప్పటికే వెళ్లి పోయావెందుకు? మిడ్ నైట్ ట్వల్వ్కి గ్రీటింగ్స్ చెప్తామనుకున్నాను. మమ్మీని నిద్రలేపమని చెప్పాను కూడా... నన్ను లేపలేదు. ఉదయం నేను లేచేసరికే నువ్వు వెళ్లి పోయావు’’ బుంగమూతి పెట్టి తండ్రి భుజం పట్టి గుంజుతోంది హర్షిత. ‘‘పప్పా! నీ పేరు వాట్సాప్‌లో వస్తోందట. మా ఫ్రెండ్ చెప్పింది. టీవీలో కూడా వచ్చిందట’’ అన్నది హర్షిత. ‘‘త్వరగా డ్రెస్ మార్చుకుని రా’’ కూతుర్ని గదిమింది రజిత. తల్లి మాటలు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంది హర్షిత. ‘‘పపా! యాక్చువల్లీ ఆ పెట్కేమైంది’’ ‘‘తిన్నదరక్క తిండి మానేసింది’’ ఈ సారి కటువుగా పలికింది కాత్యాయిని గొంతు. ‘‘అమ్మా! మూగజీవాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? అయినా ‘డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడంతటి వాడు’ అని చెప్పి చెప్పి నన్ను డాక్టర్ని చేశావు కదా’’ నిర్వేదంగా ఉంది ప్రమోద్ మాట. ‘‘కుక్క చనిపోయినందుకే ఇంత చేస్తున్నారు. మనిషి పోయి ఉంటే ఇంకెంత రాద్ధాంతం చేసేవాళ్లో’’ మాట బొంగురుపోతోంది రజితకి. ‘‘ప్రాణం దేనిదైనా ఒకటే... అలా తక్కువ చేసి మాట్లాడకు’’ అనునయంగా అన్నాడు ప్రమోద్. ‘‘అయినా వాళ్ల కుక్క రెండు రోజులు తిండి తినకపోతే వాళ్లకే పట్టలేదు. మూడో రోజు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నప్పుడు నీ చేతుల్లో పెట్టి ఇప్పుడా మాటలేంటిరా కన్నా. ఇందుకా నిన్ను డాక్టర్ని చేసింది. నువ్వేమో యానిమల్ లవర్‌వి. ‘నోరు లేని జంతువుల బాధను మనసుతో గ్రహించాలమ్మా’ అని ఏవేవో చెప్పి చివరికి పెట్ డాక్టర్వయ్యావు. ఇప్పుడు ఆ మంత్రి గారింటి కుక్క చావడం మన చావుకొచ్చినట్లుంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ గడప తొక్కామా’’ దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో మాట ఆగిపోయింది కాత్యాయినికి. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కొడుకు తల నిమురుతోందామె. ‘‘పపా! అదిగో ఇష్క్’’ హర్షిత గట్టిగా అరిచింది. టీవీలో చనిపోయిన కుక్క ఫొటోను చూపిస్తున్నారు. కెమెరా ఆ ఫొటోను పట్టుకున్న చేతి నుంచి... ఆ వ్యక్తి ముఖం మీదకు ఫోకస్ అయింది. కళ్ల నీళ్ల పర్యంతం అవుతోంది ఒక యువతి. ‘‘అసలే అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. ఆరో నెల గర్భిణి. ఇష్క్ పోయిన రోజు నుంచి ఇంత వరకు అన్నమే తినలేదు’’ పక్కనే ఉన్న మరో మహిళ చెబుతోంది. ‘‘ఇది పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యమేనని మీరు భావిస్తున్నారా’’ మైక్ ఆమె ముఖం మీద పెడుతూ అడుగుతోంది న్యూస్ రిపోర్టర్. ఆ మహిళ ఏదో చెప్పబోయింది. ఇంతలో మళ్లీ రిపోర్టరే... ‘‘రోజూ మీరు ఇష్క్‌కి ఏం తినిపించేవారు’’ అని అడిగింది. ఆ మహిళ తనకేమీ తెలియదన్నట్లు అయోమయపడింది. క్షణంలోనే తేరుకుని ఇష్క్ పోయిన దుఃఖంలో అన్నం మానేసిన యువతి వైపు చూసిందామె. రిపోర్టర్ వెంటనే మైక్‌ను ఆ యువతి ముఖం మీదకు మార్చింది. కెమెరా కూడా యువతి వైపు ఫోకస్ అయింది. ‘‘యాక్చువల్లీ... ఇష్క్ అస్సలు ఏమీ తినదు. పెడిగ్రీ కూడా నేను పెడితే తప్ప తినదు. బిస్కట్లు కూడా సగం కొరికి, కాళ్లతో నలిపి ఇల్లంతా పోసేది. అల్లరెక్కువ’’ పక్కనే ఉన్న మహిళ అందించిన కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ చెప్పింది యువతి. రిపోర్టర్‌కి ఉత్సాహం ఎక్కువవుతోంది. ‘‘దట్ డే... అంటే... మీ ప్యార్ చనిపోక ముందు రోజు... సారీ మీ ఇష్క్ చనిపోక ముందురోజు తనకు మీరే తినిపించారా’’ చనిపోయిన ఇష్క్ మీద తన గొంతులో ప్రేమకు ఒలికించడానికి ప్రయత్నిస్తోంది రిపోర్టర్. ‘‘నేను తినిపించలేదు’’ అన్నదా యువతి ఇంకేం ప్రశ్నలడుగుతారోననే భయం ఆమె కళ్లలో. ‘‘ఎందుకు తినిపించలేదు? అప్పటికే ఇష్క్ తినడం మానేసిందా’’ గొప్ప సమయస్ఫూర్తితో సూటిగా ప్రశ్నలడుగుతున్నాననుకుంటోంది రిపోర్టర్. ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయం ఆ యువతిలో. ఆమె కళ్లు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. కెమెరా తన మీదనే ఫోకస్ అయి ఉండడంతో ఏదో ఒకటి చెప్పక తప్పదనుకుని ‘‘ఇష్క్‌కి మా పెట్ అటెండెంట్ టైమ్‌కి టైమ్‌కి ఫుడ్ పెడుతుంటాడు. ముందురోజు అతడేం పెట్టాడో తెలియదు’’ నసిగిందామె. ‘‘మరి మీరు పెట్టకపోతే మీ ఇష్క్ ఏమీ తినదు కదా! మీరు రోజూ ఇష్క్‌కి ఫుడ్ పెట్టరా’’ రిపోర్టర్ కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. నవ్వకుండా పెదవులను బిగపట్టుకుంటోంది కానీ ఆమె కళ్లు నవ్వుతున్నాయి. ‘పోలీస్ ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువగా మైండ్‌ని స్క్ర్యూ చేస్తోంది’∙అనుకుంటూ ఆందోళనను దాచుకుంటోందా యువతి. కెమెరా అక్కడ గుమిగూడిన అందరినీ కవర్ చేస్తోంది. వాళ్లలో పెట్ అటెండెంట్ కూడా ఉన్నాడేమోనని ఆసక్తిగా చూస్తున్నారు వీక్షకులు. సాధారణ వీక్షకులతోపాటు ప్రమోద్ ఇంట్లో వాళ్లు కూడా. అతడి జాడ దొరికినట్లు లేదు. రిపోర్టర్ ఫ్రేమ్‌లోకి వచ్చింది. ‘‘చూశారుగా! మంత్రిగారింటి కుక్క’’ కుక్క అన్నందుకు వెంటనే నాలుక్కరుచుకుని, విశాలంగా ఒక నవ్వు నవ్వి ‘‘మంత్రి గారింటి పెట్ ఇష్క్ గారి ప్రాణాలు పోయాయి. ఇష్క్ గారు లేకపోతే మంత్రి గారి కోడలు అన్నం తినరు. ఆమె అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆరు నెలల గర్భిణి. ఆమె అన్నం తినకపోతే ఆమె కడుపులో ఉన్న మంత్రి గారింటి వారసుడు కూడా అన్నం మానేసినట్లే. ఇంతటి దయనీయమైన స్థితికి కారణం ఏమిటి? ఎవరు? సమయానికి వైద్యం చేయని డాక్టర్లా? ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి గారింటి పెట్కే ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల గతి ఏమిటి?’’ ఎటు నుంచి ఎటో సాగిపోతోంది టాపిక్. హటాత్తుగా సీన్ కట్ అయి న్యూస్ ప్రెజెంటర్ తెర మీదకొచ్చి మరో వార్తను అందుకుంది. ∙∙ ఉదయం ఏడు గంటలకే టీవీ ముందు కనిపించింది కాత్యాయిని. ‘‘ఏంటమ్మా! ఈ డిబేట్లు నీకు నచ్చవు కదా! ఎందుకు చూస్తున్నావ్’’ అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ప్రమోద్. అతడి కళ్లు ఎర్రగా ఉన్నాయి. కాత్యాయిని మాట్లాడలేదు. టీవీ సౌండ్ పెంచింది. డాక్టర్ ప్రమోద్ నిర్లక్ష్యం వల్లనే మంత్రి గారింటి పెట్ చనిపోయిందా? లేక మరేదైనా కారణంతో చనిపోయిందా? అని సాగుతోంది డిబేట్. టీవీలో కనిపిస్తున్న ఐదుగురిలో ఒక్కరికి కూడా ప్రమోద్ తెలియదు. అయినా అతడి గురించి తమకు ఎంతో తెలిసినట్లు ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో పెట్ అంటే అస్సలు లక్ష్యం ఉండడం లేదంటూ ఓ యానిమల్ యాక్టివిస్టు ఆవేశంగా మాట్లాడుతోంది. ‘‘ఒక మూగ జీవం ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తి డాక్టర్ అయినా సరే ఉరి తీయాల్సిందే. అంతటి కఠినమైన శిక్షలు ఉంటే తప్ప నోరు లేని ప్రాణుల ప్రాణాలను కాపాడడం సాధ్యం కాదు. ఒక చిన్న ప్రాణం, తన బాధేంటో చెప్పుకోలేక చనిపోయింది’’ దాదాపుగా కన్నీళ్లు పెట్టుకుంటోందా యాక్టివిస్టు. ఆశ్చర్యంగా... టీవీ స్క్రీన్ మీద ప్రమోద్ ఫొటో ప్రత్యక్షమైంది. అది కూడా ఓ రెండేళ్ల కిందట ప్రమోద్, రజిత, హర్షిత సమ్మర్ వెకేషన్లో టూర్‌కెళ్లినప్పుడు తీసుకున్న ఫొటో. అందులో హర్షిత జూలో ఒక కుందేలును తాకుతూ తీసుకున్న ఫొటో. ఒక్క క్షణం అదిరిపడ్డాడు ప్రమోద్. ఇది మీడియాకు ఎలా చేరింది. తనకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. రజిత కూడా పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయదు. ఎలా సాధ్యమైంది... రజిత తన ఫ్రెండ్స్ ఎవరికైనా వాట్సాప్ చేసి ఉంటుందా? ఆలోచిస్తుంటే బుర్ర తిరిగిపోతోందతడికి. ∙∙ మంత్రి గారి పెట్ మరణం వార్త పాతదైపోయింది మీడియాకి. ప్రమోద్‌కి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ రావడం లేదిప్పుడు. మీడియాలో వచ్చిన కవరేజ్ తెలిసి మంత్రి గారే ఇంట్లో వాళ్లను గట్టిగా చివాట్లేశారని, డాక్టర్ మీద కేసు కోర్టుకు వెళ్లకుండా ఆపేశారని అనధికార వార్తలు షికారు చేశాయి కొన్నాళ్లు. ప్రమోద్ ఎప్పటిలాగే హాస్పిటల్కెళ్తున్నాడు. ఓ రోజు ఉదయం... ‘‘పాపకు స్కూల్ వ్యాన్ రాలేదు. మీరు దించుతారా’’ హర్షిత లంచ్ బాక్స్ సర్దుతూ అడిగింది రజిత. ‘‘అలాగే’’ అని బైక్ తీశాడు ప్రమోద్. ∙∙ రాత్రి భోజనాలైన తర్వాత బెడ్రూమ్లో రజితతో ఒకే ఒక్క మాట చెప్పాడు ప్రమోద్. ‘‘రజితా! నువ్వు చెప్పినట్లే మనం ఫారిన్కెళ్దాం. అక్కడ ఉద్యోగాల కోసం రేపటి నుంచే ట్రై చేస్తాను. అమ్మ నన్ను చూడకుండా ఉండలేదు. మనతో వస్తానంటే తీసుకెళ్దాం. ఇక్కడే ఉంటానంటే అమ్మ కోసం ఏదో ఒక అరేంజ్మెంట్ చేయాలి. ఏం చేయాలనేది మళ్లీ ఆలోచిస్తాను’’ అని అటు తిరిగి పడుకున్నాడు. రజితకు ఏమీ అర్థం కాలేదు. కానీ గుచ్చి గుచ్చి ప్రశ్నించే పరిస్థితి కాదని మాత్రం అర్థమైంది. ఇష్క్ గొడవ జరిగినప్పుడు ఇక్కడ వద్దు, వేరే దేశం వెళ్లిపోదామని ఎంత చెప్పినా వినలేదు. పారిపోవడం నాకిష్టం లేదు. నా తప్పు లేకపోయినా సరే ముఖం చాటేస్తే ఏదో తప్పు చేశాడనే అనుకుంటారు. ఇక్కడే ఉండితీరుతానని మొండిగా వాదించాడు. ఇప్పుడేమో తర్కవితర్కాలేవీ లేకుండా నిర్ణయం చెప్పి ఊరుకున్నాడు. కారణం ఏమై ఉంటుంది... ఆలోచనలతో రజితకు నిద్రపట్టడం లేదు. అటు తిరిగి పడుకున్న ప్రమోద్‌కు కూడా నిద్రపట్టడం లేదు. మెదడు చెప్పిన మాటలను మనసు అడ్డుకుంటోంది. తానీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది రజితకు ఎప్పటికీ చెప్పడు. ఈ రోజు స్కూల్లో విన్న మాటలను కూడా చెప్పడు. రజితకు చెప్తే అమ్మకు చెప్పేస్తుంది. ఆ మాటలు వింటే అమ్మ తట్టుకోలేదు. అమ్మకు గుండాగిపోతుంది. అందుకే తన నోరు పెగలదెప్పటికీ. ఎవరికీ చెప్పకూడదనుకున్నా సరే... ఆ మాటలు చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. పాపను దించి బైక్ రివర్స్ చేసుకుంటున్నప్పుడు తమ పిల్లల్ని దించడానికి వచ్చిన ఇద్దరు పేరెంట్స్ మాటలలి. ‘‘అదిగో అతడే ప్రమోద్. అదే... మంత్రి గారి పెట్‌ను చంపేసిన డాక్టర్. కేసు కూడా పెట్టారు. పోలీసులను బతిమాలుకుని, మంత్రి కాళ్లు పట్టుకుని ఎలాగో బయటపడ్డాడు. ఎవర్ని ఎవరికి తార్చి బయటపడ్డాడో. సొసైటీలో స్టయిల్‌గా తిరుగుతున్నాడు’’. దిండును చెవుల మీదకు లాక్కున్నాడు ప్రమోద్. మాటలు వినిపిస్తున్నది బయటి నుంచి కాదు. అతడి లోపల్నించి. లోపల్నుంచి వినిపించే మాటలను ఆపే దిండు ఉండదు. చికాగ్గా లేచి కూర్చున్నాడు. రజిత, పాప నిద్రపోతున్నారు. ‘ఇంత వరకు జీవించిన గౌరవప్రదమైన జీవితం ఒక్కరోజులో తుడిచిపెట్టుకుపోయింది. ఇష్క్ ప్రాణాలతోపాటు తన క్యారెక్టర్ కూడా గాల్లో కలిసిపోయింది. చివరకు మంత్రిగారింటి పెట్‌ను చంపిన డాక్టర్‌గా గుర్తిస్తోంది సమాజం’ అనుకుంటూ రెండు చేతుల్లో తలను పట్టుకున్నాడు ప్రమోద్. -వాకా మంజులారెడ్డి -
టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. దేనికీ లోటుండని పరిస్థిని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అన్నివిధాలా సానుకూలమైన కాలం. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములతో కలసి విహారయాత్రలకు వెళతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్య జాగ్రత్తల పట్ల విసుగు చెందుతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. లక్కీ కలర్: గోధుమ రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనలను అధిగమించే ప్రయత్నం చేయండి. త్వరలోనే మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. నియంత్రణ పాటించడం మంచిది. కపటం నింపుకొని కబుర్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. పొగడ్తలతో ముంచెత్తే వారే మీ వెనుక గోతులు తీసే ప్రమాదం ఉంది. ఆలోచనలను పంచుకునేందుకు తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు. లక్కీ కలర్: నశ్యం రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వెచ్చించిన సమయం సత్ఫలితాలనిస్తుంది. నిరంతర అధ్యయనం ద్వారా సాధించిన విషయ పరిజ్ఞానమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. అధికారుల ప్రోత్సాహంతో కోరుకున్న విజయాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఇందులో భాగంగా ప్రచారానికి ముమ్మరంగా ఖర్చు చేస్తారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రణాళికలేవీ వేసుకోనవసరం లేదు. అదృష్టం దానంతట అదే కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. లేనిపోని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ప్రియతములతో మాట్లాడేటప్పుడు సామాజిక, రాజకీయ చర్చలకు దిగవద్దు. అనవసర వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న అపరిచితులకు సాయం చేస్తారు. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆలయాలను దర్శించుకుంటారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: బూడిద రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి తగిన అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు ఉండవచ్చు. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలయ్యే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకమైన మీ ఆలోచనలకు తగిన గుర్తింపు, ప్రచారం లభిస్తాయి. మేధాశక్తికి పదును పెట్టుకుంటారు. మీ సలహాల కారణంగా మీరు పనిచేసే సంస్థకు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నేరేడు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు. లక్కీ కలర్: నారింజ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మనసుకు నచ్చిన రీతిలో ప్రాధాన్యతలను నిర్ధారించుకుంటారు. వాటిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతానికి చెందిన జ్ఞాపకాలు కొంత కుంగుబాటుకు దారితీస్తాయి. ప్రశాంతతను కోరుకుంటారు. ధ్యానం, యోగ వంటి ఆధ్యాత్మిక మార్గాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ సాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లక్కీ కలర్: లేత నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. లక్కీ కలర్: మబ్బు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: నారింజ రంగు ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు (11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు 2019 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. ముఖ్య వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ అభిప్రాయాలు, నిర్ణయాలపై కుటుంబసభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆరోగ్యపరమైన చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్ల శుభవార్తలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అనుకున్న వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు. కొన్ని నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు వింటారు. ధనలాభం చేకూరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఎంత శ్రమపడినా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక డీలాపడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై నిరాశ చెందుతారు. అయితే చేపట్టిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు, నిదానం పాటించండి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వస్తులాభాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొంత జాప్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్తితి సామాన్యంగా ఉంటుంది. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో విందువినోదాలు. భూలాభాలు. దైవదర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల పరిచయం. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కొన్ని పనులలో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉండవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
అన్నింటా అగ్రగామి ఎల్ఐసీ
కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీమాకంపెనీల్లో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని ఆ సంస్థ బ్రాంచ్–1 ఎస్బీఎం కె.స్వరూప్‌కుమార్ అన్నారు. గురువారం బ్రాంచ్–1 కార్యాలయంలో బీమా వారోత్సవాలను బీఎస్ఎన్ఎల్ జీఎం నర్సయ్య ప్రారంభించారు. ఎస్బీఎం స్వరూప్‌కుమార్ మాట్లాడుతూ పాలసీదారుల సంక్షేమంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే గురుతర బాధ్యతను ఎల్ఐసీ పోషిస్తుందన్నారు. బీమా సంస్థ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారం రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాంచ్–1 అధికారులు, సిబ్బంది, ఐసీఈయూ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, బుచ్చయ్య, ఏజెంట్లు, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు. -
సెలవుకు సెలవేనా?
ట్రాఫిక్ విభాగంలో మొదలు పెడతామన్న అధికారులు మూడు నెలలైనా ఆ ఊసేలేదు సిబ్బంది కొరతతో వెనకడుగు పోలీసు సిబ్బందిలో నైరాశ్యం సాక్షి, సిటీబ్యూరో: వారాంతపు సెలవు... దశాబ్దాలుగా పోలీసుల కల ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండ జిల్లా పోలీసులు ప్రయోగాత్మకంగా ఈ కలను సాధ్యం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని... ట్రాఫిక్ విభాగంలో ముందుగా మొదలు పెడతామని అధికారులు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా దాని ఊసే లేదు. సిబ్బంది కొరతతో నగరంలో ఇది అమలు కావడం లేదు. కొత్త వారిని నియమిస్తే గానీ ఇది సాధ్యం కాదని సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15 నుంచి వీక్లీ ఆఫ్ అమలు చేస్తారనే ప్రచారంతో సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఆ గడువు దాటిపోయినా అందుకు సంబంధించి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంటోంది. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే... జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్, సివిల్, ఏఆర్ విభాగాల్లో వారాంతపు సెలవు అమలు కావాలంటే సుమారు 7,603 మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి.ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్‌లో హోంగార్డులతో కలిపి 3,057 మంది పని చేస్తుండగా, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 8,698 మంది ఉన్నారు. సైబరాబాద్‌లో 990 మంది ట్రాఫిక్‌లో పని చేస్తుండగా, సివిల్, ఏఆర్‌లో 5,700 మంది విధులు నిర్వహిస్తున్నారు. నగర కమిషనరేట్‌కు ప్రస్తుతం ట్రాఫిక్, సివిల్, ఏఆర్ లకు కలిపి 4,603 మంది కావాల్సి ఉంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్, సివిల్, ఏఆర్‌లకు కలిపి సుమారు 3 వేల మంది సిబ్బంది కావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. నగరంలో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది... ఉండాల్సింది ఉన్నది ఖాళీలు 1795 1167 628 భర్తీ కావలసిన పోస్టులు: 26 మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 582 మంది కానిస్టేబుళ్లు ట్రాఫిక్‌లో హోంగార్డులే ఎక్కువ నగర ట్రాఫిక్ విభాగంలో పోలీసు సిబ్బంది కంటే అధికంగా హోం గార్డులు పని చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలిసి మొత్తం 1167 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా హోంగార్డులు 1890 మంది పని చేస్తున్నారు. నగర ట్రాఫిక్ విభాగానికి మరో 900 మంది సిబ్బంది వస్తేగానీ వారాంతపు సెలవు సాధ్యం కాదు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ రాకపోవడంతో అరకొరగా ఉన్న సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. ట్రాఫిక్ సిబ్బంది పని వేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వ రకు సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఈ రోజు మొదటి షిప్టులో డ్యూటీ చేస్తే అదే కానిస్టేబుల్ మరుసటి రోజు రెండో షిఫ్టు చేయాల్సి ఉంటుంది. ఇక సిటీ సివిల్, ఏఆర్ పోలీసు విభాగంలో 12,401 పోస్టులకు గాను 8,698 మంది మాత్రమే ఉన్నారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులతో సహా ప్రస్తుతం 990 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంత మంది ఉండాలి అనే లెక్కలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మరో వెయ్యి మంది వరకు ఉంటేనే వీక్లీఆఫ్‌లతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలవుతుంది. సివిల్, ఏఆర్‌లో కలిపి ప్రస్తుతం సుమారు 5,700 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా హోంగార్డులు 2వేల మంది వరకు ఉంటారు. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే మరో 2వేల మంది సిబ్బందిని నియమించాలి. నెలకు 360 గంటలు విధుల్లో... ఒక కానిస్టేబుల్ 24 గంటలు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు విశ్రాంతిలో ఉంటాడు. అంటే నెలలో అతడు 360 గంటల పాటు విధులు నిర్వహించినట్లు అవుతుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నెలలో సుమారు 208 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన పోలీసులు ఇతర విభాగాల ఉద్యోగుల కంటే 152 గంటలు అధికంగా పని చేస్తున్నారు. తక్కువ పనిగంటలు పనిచేస్తున్న వారికి వీక్లీ ఆఫ్‌లు ఉన్నాయి. అదే ఎక్కువ గంటలు పని చేస్తున్న పోలీసులకు మాత్రం ఇంకా వీక్లీఆఫ్‌లు మొదలు కాకపోవడం గమనార్హం. -
సంతోషం సమాధి
=విషాదం నింపిన కొత్త సంవత్సరం వేడుకలు =కాటేసిన అలల రక్కసి =ముగ్గురి మృతి, ఒకరి గల్లంతు =మృతుల్లో ఇద్దరు ఆటోడ్రైవర్లు =కుప్పకూలిన కుటుంబ సభ్యులు =నెల్లూరు జిల్లాలో రెండు ఘటనలు తోటపల్లిగూడూరు, వాకాడు, న్యూస్‌లైన్: మదనపల్లెకు చెందిన లిఖిత్కుమార్రెడ్డి(17), సతీష్‌రెడ్డి (18) నెల్లూరులోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కళాశాల నిర్వాహకుల అనుమతితో లిఖిత్కుమార్రెడ్డి, సతీష్‌రెడ్డి, దినేష్, శివచైతన్య, జశ్వంత్, అనిల్ మంగళవారం కళాశాల నుంచి బయటకు వచ్చారు. ఆ రోజంతా నెల్లూరులో సరదాగా గడిపారు. బుధవా రం తోటపల్లిగూడూరులోని కోడూరు బీచ్‌కు వచ్చా రు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి లిఖిత్కుమార్రెడ్డిని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని నారాయణ వైద్యశాలకు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లిఖిత్కుమార్రెడ్డి తల్లిదండ్రులు వెంటనే మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకెళ్లిపోయారు. సతీష్‌రెడ్డి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తూపిలిపాళెంలో ఇద్దరి మృతి రేణిగుంట, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు విహారయాత్రగా నెల్లూరు జిల్లాలోని తూపిలిపాళెం బీచ్‌కు బుధవారం వెళ్లారు. వీరిలో రేణిగుంట ప్రాంతానికి చెందిన నూరుల్లా బాబు(28) అలలో కొట్టుకుపోతుండగా పక్కనే స్నానం చేస్తున్న శ్రీకాళహస్తి బీపీ అగ్రహారానికి చెందిన మునిశేఖర్(25) కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనూ మునిగిపోయాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మునిశేఖర్ అవివాహితుడు. నూరుల్లాబాబుకు ఏడాది క్రితమే పెళ్లయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీ సులు బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య ఆరు నెలల గర్భిణి రేణిగుంట బుగ్గవీధికి చెందిన ఖాదర్‌బాషా, నసీమాల ఏకైక కుమారుడు నూరుల్లాబాబు. ఇతని భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. నూరుల్లాబాబు ఓ ప్రయివేటు ఏజెన్సీలో ఆటో డ్రయివర్‌గా పనిచేస్తున్నాడు. రేణిగుంట, శ్రీకాళహస్తికి చెందిన 12 మంది మిత్రులతో కలసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు నెల్లూరు జిల్లాలోని తూపిలిపాళెం బీచ్‌కు వెళ్లాడు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు గుండెలు బాదుకుని రోదించారు. ఆధారం కోల్పోయిన కుటుంబం శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన వెంకటరామయ్య, వల్లెమ్మల ఏకైక కుమారుడు మునిశేఖర్. వెంకటరామయ్య ఇటీవల మృతి చెందాడు. వృద్ధాప్యం కారణంగా కూలికి వెళ్లలేని స్థితిలో వల్లెమ్మ రెండేళ్లుగా ఇంటి పట్టునే ఉంటోంది. మునిశేఖర్ చెల్లెలు లక్ష్మికి వివాహమైంది. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న మునిశేఖర్ ఆదాయమే కుటుంబానికి ఆధారం. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు స్నేహితులతో వెళ్లిన అతను ఇక లేడన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త బట్టల్లో చూసుకోకపోతిమే నిమ్మనపల్లె మండలం బోడిమల్లయ్యగారిపల్లెకు చెందిన వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కూరపర్తి సదాశివారెడ్డి, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు లిఖిత్కుమార్రెడ్డి. నెల్లూరులో చదువుతున్న ఇతను బుధవారం నాడు కోడూరు బీచ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలియడంతో బోడిమల్లయ్యగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘కొత్తబట్టలు పంపిస్తే చేరినాయని ఫోన్ చేసి ఎంతో సంతోషంగా మాట్లాడావే.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశావే.. ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవడం గ్రామస్తులను కంటతడి పెట్టిం చింది. కొత్త బట్టల్లో ఎలా ఉన్నావో చూసే అదృష్టమూ మాకు దక్కలేదే.. మేమేం పాపం చేశాం నాయనా అంటూ తల్లిదండ్రులు రోదించారు. వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. కుప్పకూలిన కుటుంబ సభ్యులు కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన బైసాని సతీష్‌రెడ్డి బీచ్‌లో గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుప్పకూలారు. సమాచారం అందగానే సతీష్‌రెడ్డి తండ్రి గోపాల్‌రెడ్డి, బంధుమిత్రులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. గోపాల్‌రెడ్డికి సతీష్‌రెడ్డి ఒక్కడే కుమారుడు. చదువులో రాణిస్తున్నాడు. ఇంతలోనే కుటుంబ సభ్యులకు దుర్వార్త చేరింది.