సంతోషం ఆగదు | 18 years completed on santhosham-magazine | Sakshi
Sakshi News home page

సంతోషం ఆగదు

Published Sun, Aug 2 2020 5:21 AM | Last Updated on Sun, Aug 2 2020 7:44 AM

18 years completed on santhosham-magazine - Sakshi

‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో  18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి  అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్‌ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్‌ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్‌ ఫంక్షన్‌ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్‌రైజర్‌ ఫంక్షన్‌ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్‌ కాస్త ఆలస్యం అవుతుంది.

అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్‌లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement