awards ceremony
-
Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు
జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని రక్షణ విభాగంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా, పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి.95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు. వీరిలో నక్సలైట్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 03 మంది సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్‌లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్‌కు, 36 కరెక్షనల్ సర్వీస్‌కు లభించాయి.రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మందికి, జమ్ముకశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి అందజేయనున్నారు. అస్సాం రైఫిల్స్ నుండి ఒక సైనికునికి, బీఎస్ఎఫ్ నుండి ఐదుగురు, సీఆర్పీఎఫ్ నుండి 19 మంది, ఎస్ఎస్బీ నుండి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది అగ్నిమాపక సిబ్బందికి, జమ్ముకశ్మీర్ అగ్నిమాపక విభాగానికి చెందిన ఒక అగ్నిమాపక అధికారికి అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలివే.. -
రిటైల్ జ్యువెలర్కు రెండు అవార్డులు
హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ రెండు అవార్డులు దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘రిటైల్ జ్యువెలర్ మ్యాగజైన్ ఎండీ–సీఈవో పురస్కారాలు 2025’లో భాగంగా బెస్ట్ స్ట్రాటజిక్–ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2025, నేషనల్ రిటైల్ చెయిన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డులు సొంతం చేసుకుంది. ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యూ ఈ పురస్కారాలు అందుకున్నారు. జ్యువె లరీ పరిశ్రమలో సాధించిన విజయాలు, అందించిన తోడ్పాటుకు ఈ అవా ర్డులు ప్రతిరూపమని జోయాలుక్కాస్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
రీల్ అవార్డ్స్ 2024లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
-
PM Narendra Modi: ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి: భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనా(మోడల్)గా మారడం ఖాయమని, ఇది ‘మోదీ గ్యారంటీ’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసికి చేరుకున్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ‘సంసద్ సంస్కృత్ ప్రతియోగితా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వం, అభివృద్ధికి కాశీ నగరం ఒక మోడల్‌గా కనిపిస్తోందని, సంస్కృతి, సంప్రదాయం చుట్టూ ఆధునిక అభివృద్ధిని ప్రపంచం వీక్షిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మన దేశం అభివృద్ధికి మోడల్‌గా మారుతుందని చెప్పారు. భారతీయ సుసంపన్న ప్రాచీన వారసత్వం గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. కాశీ సంసద్ జ్ఞాన్ ప్రతియోగితా, కాశీ సంసద్ ఫొటోగ్రఫీ ప్రతియోగితా, కాశీ సంసద్ సంస్కృత్ ప్రతియోగితా అవార్డులను నరేంద్ర మోదీ విజేతలకు అందజేశారు. అనంతరం రూ.13,000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాను గత పదేళ్లుగా ఇక్కడి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, వారణాసి తనను బనారసిగా మార్చిందని అన్నారు. వారణాసి యువతను కొందరు కాంగ్రెస్ నేతలు నషేరీ(మత్తులో మునిగిపోయినవారు) అని దూషిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాం«దీపై మోదీ మండిపడ్డారు. నిజంగా స్పృహలో ఉన్నవారు అలా మాట్లాడరని చెప్పారు. గత 20 ఏళ్ల పాటు తనను తిట్టారని, ఇప్పుడు యువతపై ఆక్రోశం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య, కాశీని అభివృద్ధి చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు వారు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వారణాసి రోడ్లపై నడుస్తూ తనిఖీ చేశారు. ప్రజలను విపక్షాలు కులాల పేరిట రెచ్చగొడుతున్నాయ్ విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. విపక్షాలు కులాల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గొడవలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్నత పదవులు చేపడితే విపక్ష నాయకులు సహించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తాము పోటీకి దింపితే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వలేదని, ఆమెను ఓడించేందుకు ప్రయతి్నంచాయని గుర్తుచేశారు. దళితులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకొచి్చన పథకాలను విపక్షాలు వ్యతిరేకించాయని చెప్పారు. వారణాసిలో శుక్రవారం సంత్ రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో మోదీ మాట్లాడారు. ప్రతి శకంలో యోగులు ప్రజలకు దారి చూపారని, తప్పుడు మార్గంలో నడవకుండా అప్రమత్తం చేశారని చెప్పారు. కులం పేరిట ఎవరైనా వివక్ష చూపితే అది మానవత్వంపై చేసిన దాడి అవుతుందని పేర్కొన్నారు. -
Grammy Awards 2024: భారత్‌కు ‘గ్రామీ’ సంబరం
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఆదివారం రాత్రి ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. న్యూఢిల్లీ: ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారు. ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఆదివారం పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహాదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీలు వరించాయి. జాకీర్ హుస్సేన్కుమొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. గ్రామీ విజేతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. ‘మిడ్నైట్స్’ ఆల్బమ్కుఅమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవార్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి! మిలీ సైరస్కు రికార్డు ఆఫ్ ద ఇయర్ (ఫ్లవర్స్), బిల్లీ ఐలి‹Ùకు సాంగ్ ఆఫ్ ద ఇయర్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్?) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్ గ్రామీని సొంతం చేసుకున్నారు. -
జోయాలుక్కాస్‌కు అవార్డులు
‘ద రిటైల్ జ్యువెలర్ గ్రూప్’ ముంబైలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీ నటులు సన్యా మల్హోత్రా, జోయా అఫ్రాజ్ల చేతుల మీద ‘బెస్ట్ డిజిటల్/సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ ది ఇయర్, నేషనల్ రిటైల్ చైన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకుంటున్న జోయాలుక్కాస్ సంస్థ సీఎండీ జాయ్ అలుక్కాస్. -
ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
AP: తెలుగు, సంస్కృత అకాడమీ ఉగాది పురస్కారాలు వీరికే..
తాడేపల్లి: తెలుగు, సంస్కృత అకాడమీ 2023 ఏడాదికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. వివిధ కేటగిరీల కింద మొత్తం ఏడుగురిని అవార్డులకు ఎంపిక చేసింది. ఏయే రంగంలో ఎవరికి అవార్డులు వచ్చాయంటే.. ► విద్యా శాస్త్రసాంకేతిక రంగం : పి.గోపీకృష్ణ ► వైద్య రంగం: డా.ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే ► లలిత కళలు : శ్రీమతి పసుమర్తి పావని ► జానపద, నాటక రంగం : కురటి సత్యం నాయుడు ► వ్యవసాయ రంగం : వి.గోపీచంద్ ► సేవా రంగం : మాదిరెడ్డి కొండారెడ్డి ► ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) : ఆర్.సుభాష్ బాబు ఈనెల 25న నాగార్జున వర్సిటీలో అవార్డులు ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి తానేటి వనిత, మేరుగు నాగార్జున, పేర్ని నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
FIFA Football Awards : కన్నులపండువగా ఫిఫా అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం
-
ఐటీఆర్‌ల ప్రాసెసింగ్ వేగవంతం చేయండి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిఫండ్ల (ఐటీఆర్) ప్రాసెసింగ్‌ను, రిఫండ్ల జారీని వేగవంతం చేయడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఐటీ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. సీబీడీటీ అధికారులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె సంక్లిష్టమైన, ప్రత్యేకమైన కేసులేవైనా ఉంటే న్యాయస్థానానికి పంపే వి« దానాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. అవసరమైతే సీబీడీటీ (కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బో ర్డు) ఏడాదిలో ఒక వారం రోజుల పాటు కేసుల పరిష్కరణకు కేటాయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం అప్ : ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ నికర 23 శాతం పెరిగి 7.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) డైరెక్టర్ నితిన్ గుప్తా ఈ వివరాలను ఐటీ అధికారుల అవార్డు ప్రదాన కార్యక్రమంలో తెలియజేశారు. 2021–22లో ఆదాయపు, కార్పొరేట్ పన్ను వసూళ్లు భారీగా రూ.14.09 లక్షల కోట్లుగా నమోదయినట్లు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు దాదాపు తొలగిపోయినట్లు తెలిపారు. జూలై 31వ తేదీ నాటికి 5.83 కోట్ల పన్ను రిటర్న్స్ ఈ పోర్టల్ ద్వారా దాఖలయినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 72 లక్షల రిటర్న్స్ దాఖలయినట్లు కూడా వెల్లడించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతన జీవుల ఐటీఆర్ దాఖలు తుదిగడువు జూలై 31వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఐటీ రిఫండ్స్ ఇప్పటి వరకూ రూ.1.41 లక్షల కోట్లు జరిగినట్లు వెల్లడించిన గుప్తా, గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ విలువ 83 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. -
ఏపీ: 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు. గాంధీ స్ఫూర్తితో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం -
సంతోషం ఆగదు
‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్‌రైజర్ ఫంక్షన్ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
కన్నతల్లి, జన్మభూమిని మర్చిపోకూడదు
‘రామినేని’ పురస్కారాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య హైదరాబాద్: కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషలను ఎన్నటికీ మరిచిపోకూడదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చునని చెప్పారు. ఇలాంటి పురస్కారాల కార్యక్రమాలు కొత్త తరానికి ఉత్సాహం, ప్రేరణ కలిగిస్తాయన్నారు. మన దేశంలో పాముకు పాలు, చీమకు చక్కెర, చెట్టుకు బొట్టు పెట్టే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. మన దేశంలో స్త్రీమూర్తిని లక్ష్మీదేవి, గంగా, యమున, సరస్వతి అంటూ ఉచ్ఛరిస్తామన్నారు. మోదీని మేకింగ్ డెవలపింగ్ ఇండియాగా అభివర్ణించారు. సంస్కృతి అంటే జీవన విధానం అని, మతం అంటే పూజా విధానం అని, అది వ్యక్తిగతమన్నారు. అనంతరం రక్షణ రంగం శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్‌రెడ్డి, సినీనటి శారద, డాక్టర్ ఎం.గోపీచంద్, ప్రజాగాయకుడు గద్దర్‌కు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ మురళీమోహన్, ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్‌రావు, ఫౌండేషన్ సభ్యుడు పీవీ రామచంద్రమూర్తి, డాక్టర్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు -
రామ్ చరణ్, అఖిల్, జీవా... తొలిసారిగా స్టేజ్ డ్యాన్స్!
అవార్డు వేడుకలంటే ఆటా పాటా కామన్. హీరో, హీరోయిన్లు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తుంటే, హుషారుగా వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. ఈ సందడితో పాటు సినిమా పరిశ్రమకు సేవలందించి, చరిత్రలో నిలిచిపోయిన పెద్దలను గౌరవించుకుంటే అప్పుడు ఆ వేడుకకు నిండుదనం వస్తుంది. ఈ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఐఫా-ఉత్సవమ్’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా ఈ విధంగానే జరగనుంది. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహానటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు, శతాధికచిత్రాల నిర్మాత డా. డి. రామానాయుడు, దర్శక దిగ్గజం కె.బాలచందర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌లకు ఈ వేదికపై నివాళులర్పించనున్నారు. ఇంకా దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న వారిని సత్కరించనున్నారు. ఇక.. ఈ అవార్డు వేడుకలో సందడి గురించి చెప్పాలంటే... మొదటిసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న రామ్‌చరణ్ డ్యాన్సుల విషయంలో తన తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్‌చరణ్. స్టయిలిష్‌గా డ్యాన్సులు చేసే చరణ్ ఇప్పటివరకూ ఆహూతుల ముందు ఏ వేదిక మీదా కాలు కదపలేదు. తొలిసారి ‘ఐఫా’ వేదికపై ఆయన డ్యాన్స్ చేయనుండడం విశేషం. ఈ అవార్డు వేడుకలకు చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్చొచ్చు. వేదికపై రెచ్చిపోవడానికి గచ్చిబౌలి స్టేడియంలో రామ్‌చరణ్ చాలా హుషారుగా రిహార్సల్స్ చేస్తున్నారు. అదిరిపోయేలా అఖిల్.. ‘మనం’లో కొన్ని సెకన్లు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కితాబులందుకున్నారు అఖిల్. అలాగే మొదటి సినిమా ‘అఖిల్’తోనే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కున్నారు. ఈ చిచ్చరపిడుగు లైవ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ‘ఐఫా’ వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేయడానికి అఖిల్ కసరత్తులు చేస్తున్నారు. వారెవ్వా అనిపించాలనుకుంటున్న జీవా.. తమిళ హీరో జీవా కూడా ఇప్పటివరకూ ఏ అవార్డు వేడుకలోనూ డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు ‘ఐఫా’లో రెచ్చిపోవడానికి రెడీ అయ్యారు. మొదటిసారి స్టేజీపై డ్యాన్స్ చేయనున్నారు కాబట్టి, ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా ఉంది జీవా వ్యవహారం. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి, అందరూ వారెవ్వా అనే విధంగా డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రముఖుల సమక్షంలో... పసందుగా... దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగానికి చెందిన తారల అవార్డు వేడుక ఇది. ఈ వేడుకలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరుల నటులతో పాటు అందాల తారలు కాజల్ అగర్వాల్, మమతా మోహన్‌దాస్, కావ్యా మాధవన్ వంటివారి సమక్షంలో ఈ వేడుక పసందుగా జరగనుంది. ఆ కలను ‘ఐఫా’ నెరవేర్చింది - తమన్నా సినిమాల్లోకి రాకముందు నేను ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామనుకున్నా. అనుకోకుండా సినిమాలకు అవకాశం రావడంతో అది నెరవేరలేదు. ఇప్పుడీ ‘ఐఫా’ కారణంగా అది నెరవేరింది. ఈ అవార్డుల వేదికపై నేను చేయనున్న డ్యాన్సులకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. సోమవారం నా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నా స్టెప్స్‌ని కాపీ... పేస్ట్ చేయమన్నారు - దేవిశ్రీ ప్రసాద్ నాకు ఒక పట్టాన ఏదీ నచ్చదు. ట్యూన్ చేయడం అయినా, పాట పాడడం అయినా, చివరికి డ్యాన్స్ చేయడం అయినా. అందుకే ఈ వేదికపై నాతో కలిసి డ్యాన్స్ చేసేవాళ్లకు కొన్ని స్టెప్స్ చూపించాను. షియామక్ దావర్కి అవి నచ్చడంతో ‘అందరూ కాపీ పేస్ట్ చేయండి’ అన్నారు. -
అదిరేటి స్టెప్పు మేమేస్తే..
హైదరాబాద్‌సిటీ (కాచిగూడ): ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు తమదైన శైలితో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుకునే రోజుల్లో రెడ్డి కళాశాలలో చదువుకోవాలనే ఆశ ఉండేదని, కాని అది అప్పుడే నేరవేరలేదని, ఇప్పుడు కళాశాలలో అడుగు పెట్టేసరికి నా కల ఈ విధంగా నేరవేరిందని సంతోషాన్ని వ్యక్త పరిచారు. రెడ్డి కళాశాలకు అవసరమైన సహాయ సహాయసహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, అవసరమైతే సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ పునర్నినిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంతెత్తుకు ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికి మర్చిపోవద్దని సూచించారు. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సురేఖారెడ్డి, సెక్రటరీ ప్రోఫెసర్ తిప్పారెడ్డి, డెరైక్టర్ డాక్టర్ డి.రామకృష్ణారెడ్డి, డీన్ ప్రోఫెసర్ ముత్యంరెడ్డి, మంజులత జైన్ తదితరులు పాల్గొన్నారు.