టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి  17 ఆగస్టు, 2019 వరకు) | Weekly Tarot For 11 August To 17 August 2019 | Sakshi
Sakshi News home page

 టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి  17 ఆగస్టు, 2019 వరకు)

Published Sun, Aug 11 2019 11:14 AM | Last Updated on Sun, Aug 11 2019 11:15 AM

Weekly Tarot For 11 August To 17 August 2019 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. దేనికీ లోటుండని పరిస్థిని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అన్నివిధాలా సానుకూలమైన కాలం. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములతో కలసి విహారయాత్రలకు వెళతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్య జాగ్రత్తల పట్ల విసుగు చెందుతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనలను అధిగమించే ప్రయత్నం చేయండి. త్వరలోనే మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. నియంత్రణ పాటించడం మంచిది. కపటం నింపుకొని కబుర్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. పొగడ్తలతో ముంచెత్తే వారే మీ వెనుక గోతులు తీసే ప్రమాదం ఉంది. ఆలోచనలను పంచుకునేందుకు తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: నీలం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు.
లక్కీ కలర్‌: నశ్యం రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. 
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వెచ్చించిన సమయం సత్ఫలితాలనిస్తుంది. నిరంతర అధ్యయనం ద్వారా సాధించిన విషయ పరిజ్ఞానమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. అధికారుల ప్రోత్సాహంతో కోరుకున్న విజయాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఇందులో భాగంగా ప్రచారానికి ముమ్మరంగా ఖర్చు చేస్తారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
లక్కీ కలర్‌: గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ప్రణాళికలేవీ వేసుకోనవసరం లేదు. అదృష్టం దానంతట అదే కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. లేనిపోని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ప్రియతములతో మాట్లాడేటప్పుడు సామాజిక, రాజకీయ చర్చలకు దిగవద్దు. అనవసర వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న అపరిచితులకు సాయం చేస్తారు. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆలయాలను దర్శించుకుంటారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి తగిన అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు ఉండవచ్చు. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలయ్యే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకమైన మీ ఆలోచనలకు తగిన గుర్తింపు, ప్రచారం లభిస్తాయి. మేధాశక్తికి పదును పెట్టుకుంటారు. మీ సలహాల కారణంగా మీరు పనిచేసే సంస్థకు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు.
లక్కీ కలర్‌: నారింజ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మనసుకు నచ్చిన రీతిలో ప్రాధాన్యతలను నిర్ధారించుకుంటారు. వాటిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతానికి చెందిన జ్ఞాపకాలు కొంత కుంగుబాటుకు దారితీస్తాయి. ప్రశాంతతను కోరుకుంటారు. ధ్యానం, యోగ వంటి ఆధ్యాత్మిక మార్గాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ సాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
లక్కీ కలర్‌: లేత నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
భవిష్యత్‌ అవసరాల కోసం ఆర్థిక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. 
లక్కీ కలర్‌: మబ్బు రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: నారింజ రంగు

ఇన్సియా
టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement