మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. ప్రముఖ వ్యక్తులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కోర్టు కేసు ఒకటి పరిష్కారమై ఊరట లభిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమయ్యే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మొదట్లో కొన్ని వివాదాలతో సతమతమవుతారు. అయితే క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూరపు బం«ధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం రాగలదు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. కొన్ని కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. గృహ నిర్మాణాల్లో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో సమర్థత చాటుకుని ఉత్సాహంగా సాగుతారు. కళారంగం వారికి మరింత కలసివచ్చే సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. తరచు తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఇంట్లో సందడిగా గడుస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక విషయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనయోగం. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఎటువంటి సమస్య ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బంది కలిగించినా క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన పనులు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు అవాంతరాల వల్ల ముందుకు సాగవు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలలో తొందరపడరాదు. ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రతిష్ఠంభన. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వీరికి ఇంతకాలం ఎదురైన కష్టాలు తొలగినట్లే. ఆర్థికంగా మరింత బలపడతారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఊరట చెందుతారు. గృహ, వాహనయోగాలు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమర్థతను అందరూ గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు
Comments
Please login to add a commentAdd a comment