Taro bani
-
టారో వారఫలాలు (సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) త్యాగాలు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నా ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న పంతాలు పట్టింపులు మనస్తాపం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. విధి నిర్వహణ పట్ల పూర్తి స్పష్టతతో ఉంటారు. సకాలంలో లక్ష్యాలను సాధిస్తారు. పట్టుదలతో, అంకితభావంతో అసాధ్యమనుకున్న పనులను కూడా సునాయాసంగా పూర్తిచేసి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రియతములకు తగినంత సమయం కేటాయించలేక, వారిని సముదాయించలేక సతమతమవుతారు. లక్కీ కలర్: ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అంతరాత్మ ప్రబోధాన్ని నమ్ముకుంటారు. కుటుంబంలో ఏర్పడిన ఒక సమస్యను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రత్యర్థుల ఆటలను కట్టిస్తారు. చిరకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఒక ఆకస్మిక సంఘటనతో భావోద్వేగాలకు లోనవుతారు. పని ఒత్తిడి పెరిగి వేళకు భోజనం చేయలేకపోతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనంగా కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకోకుండా ఉండటమే క్షేమం. పూర్తి చేయాల్సిన పనులు ఒత్తిడికి, ఆందోళనకు గురిచేసినా, సకాలానికి పనులు పూర్తి చేస్తారు. ఇబ్బందిపెడుతూ వచ్చిన అధికారులకు స్థానచలనం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతముల మధ్య తలెత్తిన పొరపొచ్చాలు ఎడబాటుకు దారితీసే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) సంక్లిష్టమైన కాలం. అప్రమత్తంగా ఉంటేనే చిక్కుల్లో పడకుండా ఉంటారు. మిత్రుల ముసుగులోని ప్రత్యర్థులను పసిగట్టి, వారికి దూరంగా ఉంటేనే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతారు. అలాంటి వారే మిమ్మల్ని అతిగా పొగుడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికుల మధ్య తగవులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. మిత్రుల్లో ఒకరిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) విసుగెత్తించే రోజువారీ కార్యక్రమాలకు విరామం ప్రకటించి, విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి. ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మీరు వెల్లడించే అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. వాక్చాతుర్యంతో బహిరంగ వేదికలపైనా రాణిస్తారు. కుటుంబంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. పిల్లల పురోగతి సంతృప్తినిస్తుంది. కండరాల నొప్పులు, తలనొప్పి ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంక్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా అలజడికి, అభద్రతాభావానికి లోనవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం అనివార్యమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశలు వదులుకోవద్దు. తప్పకుండా ఫలిస్తాయి. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై, అలంకరణలపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: గోధుమ రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: నేరేడు రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పరిస్థితుల్లో సానుకూలతలు కొంత లోపించినా ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధి, అంకితభావాలే మీ విజయాలకు బాటలు వేస్తాయి. వ్యాపార వర్గాలకు ఇది అనువైన కాలం. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు తేలికగానే సమకూరుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితంలోని క్లిష్టమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చిన సావాసాలను బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నిజమైన మిత్రులెవరో, మిత్రుల్లా నటించే శత్రువులెవరో స్పష్టంగా తేలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇదీ ఒకందుకు మంచిదే! మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ పరిస్థితులు ఎంతగానో దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు మీపై తెరవెనుక కుట్రలు సాగించే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మొండిబాకీలు వసూలవుతాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. పాత వస్తువులను వదిలించుకుంటారు. ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అన్ని రంగాల్లోనూ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు, పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలు జరగవచ్చు. చిన్న చిన్న సరదాలను అమితంగా ఆస్వాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసొస్తాయి. సాహితీ కళారంగాల్లోని వారికి సత్కారాలు, గౌరవ పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సభా వేదికలపై అద్భుతంగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సాటివారి ప్రయోజనాలను పోరాడి మరీ సాధిస్తారు. నాయకత్వ పటిమను చాటుకోవడానికి తగిన అవకాశాలు కలసి వస్తాయి. ప్రముఖులతో చర్చల్లో పాల్గొంటారు. రాజకీయరంగంలోని వారికి కీలకమైన పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. తీరిక చిక్కని పరిస్థితుల్లో వ్యాయామానికి దూరం కావడం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సమసిపోతాయి. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అదృష్టం తలుపు తడుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలను కోరుకున్న రీతిలో విస్తరిస్తారు. ప్రచారం కోసం చేసిన ఖర్చు రెట్టింపు ఫలితాలనిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. వస్త్రాలంకరణపైన, సౌందర్యంపైన శ్రద్ధ పెంచుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. విదేశాల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతారు. యోగ ధ్యానాలకు మరింత సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి లావాదేవీల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. అవసరాల్లో మీ నుంచి సాయం పొందిన వారే మీకు మొండిచెయ్యి చూపుతారు. లక్కీ కలర్: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కుటుంబ సభ్యులతో కలసి వినోదయాత్రలకు వెళతారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రలోభాలకు లోనవకుండా, అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడమే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నిజాయతీని నమ్ముకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ప్రలోభాల ఉచ్చులో చిక్కుకుంటే మీకే ప్రమాదం. వాగ్వాదాలకు రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండటం మేలు. సంయమనం కోల్పోతే వివాదాలు చుట్టుముట్టే సూచనలున్నాయి. లక్కీ కలర్: గోధుమ రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లోని వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వాముల సహకారంతో వ్యాపారాలు గణనీయంగా పుంజుకుంటాయి. పాత వాహనాన్ని వదుల్చుకుని, కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొందరికి వారసత్వపు ఆస్తులు కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. పురాతన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితం మరింత సంతోషభరితంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు జనాదరణ రెట్టింపవుతుంది. వ్యాపారాల విస్తరణకు కావలసిన నిధులు సునాయాసంగా సమకూరుతాయి. పరస్పర భిన్నధ్రువాల్లాంటి ఇద్దరు కీలక వ్యక్తుల భేటీకి మీరు చోదకశక్తిగా పనిచేస్తారు. సమాజంపై ప్రభావం చూపగల ప్రముఖులను కలుసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఎరక్కపోయి తుఫానులో చిక్కుకున్నట్లుగా ఆందోళన చెందుతారు. కార్యాచరణకు కొంత విరామం ప్రకటించడం మంచిది. పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. పనికిమాలిన సావాసాల నుంచి ఎంత త్వరగా బయటపడి అంత త్వరగా పుంజుకోగలుగుతారు. సమస్యల్లో చిక్కుకున్న మిత్రులకు ఆసరాగా నిలుస్తారు. గురువులను కలుసుకుంటారు. గుప్తదానాలు చేస్తారు. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విజయపథంలో దూసుకుపోతారు. సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. పుస్తక పఠనానికి మరింతగా సమయాన్ని కేటాయిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో వారఫలాలు (ఆగస్టు 18 నుంచి 24 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సమస్యలు ఎదురైనంత మాత్రాన అనవసరంగా ఆందోళన చెందకండి. సమస్యల మూలకారణాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు, వాటిని అధిగమించడం తేలికవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న అవరోధాలు ఎదురైనా, అప్రమత్తంగా ఉంటే వాటిని అవలీలగా అధిగమించడం సాధ్యమవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.. త్వరలోనే భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహిత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు. లక్కీ కలర్: లేతగులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నిజాయతీనే నమ్ముకుంటారు. ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నా పట్టించుకోకుండా, మీదైన శైలిలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. భవిష్యత్తును మార్చగల అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కొందరి ప్రవర్తన పట్ల విసిగిపోయి, సహనం కోల్పోతారు. స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రకటనలు, ప్రచారం ద్వారా వ్యాపారాభివృద్ధిని సాధిస్తారు. పాత బాకీలను తీర్చేస్తారు. చాలాకాలంగా సాగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) ఇటు ఇంట్లోను, అటు పని ప్రదేశంలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొంత గందరగోళానికి లోనవుతారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. విడివడిన బంధాలు మళ్లీ ఒక్కటవుతాయి. సృజనాత్మక రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో బాగా ఉపయోగపడగల కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పురాతన పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతానికి చెందిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడతారు. మానసికంగా కొంత కుదుటపడి, వర్తమానంలో జీవించడానికి అలవాటు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. వ్యాపార లాభాలు పుంజుకుంటాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. వైద్య సహాయం అనివార్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలను తలపెడతారు. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సవాళ్లతో కూడుకున్న అవకాశాలు లభిస్తాయి. సవాళ్లకు భయపడకుండా అవకాశాలను అందుకుంటే, సమీప భవిష్యత్తులోనే అద్భుతమైన లాభాలు ఉంటాయి. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. సాహస క్రీడల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి జ్యోతిషులు, ఆధ్యాత్మిక గురువుల సలహాలు తీసుకుంటారు. ప్రియతములకు విలాస వస్తువులను కానుకగా ఇస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు జటిలంగా మారే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చాలాకాలంగా కోరుకున్న మార్పు ఈవారంలో సంభవించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొందరికి స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. భవిష్యత్తు గురించి అతిగా తాపత్రయపడతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వైద్యచికిత్స తప్పకపోవచ్చు. భవిష్యత్తు గురించిన ఆలోచనలను పక్కన పెట్టి వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం మంచిది. స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతారు. లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికపరంగా పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సకాలంలో భారీమొత్తాల్లో రుణాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొంతకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన ఉన్నతాధికారి ఒకరికి స్థానచలనం కలగడం ఊరటనిస్తుంది. పిల్లల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సంప్రదాయాలను పిల్లలు ధిక్కరించడంతో మనస్తాపం చెందుతారు. మానసిక సాంత్వన కోసం ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయిస్తారు. లక్కీ కలర్: ముదురు గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) లేనిపోని పట్టుదలలకు పోకుండా పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహచరులతో వాదులాటలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, పాత బాకీలు వసూలు కాకపోవడం చిరాకు తెప్పిస్తుంది. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మిత్రుల్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కీళ్లనొప్పులు బాధించవచ్చు. ఇంటి అలంకరణల్లో మార్పులు చేస్తారు. పాత వాహనాన్ని వదుల్చుకుని కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని చిక్కుప్రశ్నలా భావించడం వల్ల సమస్యలను జటిలం చేసుకుంటారు. జీవితాన్ని అనుక్షణం ఆస్వాదించడం మొదలుపెడితే, ఏ సమస్యలూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టవు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దతకు విసుగు చెందుతారు. అవలీలగా మీరు చేసే పనులే అద్భుతమైన ఫలితాలనిస్తాయి. సాహిత్య కళారంగాల్లోని వారి కృషికి గుర్తింపు, సత్కారాలు ఉంటాయి. వ్యాపారాలకు జనాదరణ పెరుగుతుంది. రాజకీయ రంగంలోని వారికి ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల అనుబంధం పెళ్లికి దారితీస్తుంది. లక్కీ కలర్: ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. మిత్రులతో ఉత్సాహభరితంగా కాలక్షేపం చేస్తారు. అవసరంలో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. కుటుంబసభ్యులతో కలసి అరుదైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: పసుపు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో వారఫలాలు( 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. దేనికీ లోటుండని పరిస్థిని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అన్నివిధాలా సానుకూలమైన కాలం. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములతో కలసి విహారయాత్రలకు వెళతారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రోజువారీ వ్యాయామం, ఆరోగ్య జాగ్రత్తల పట్ల విసుగు చెందుతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. లక్కీ కలర్: గోధుమ రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆందోళనలను అధిగమించే ప్రయత్నం చేయండి. త్వరలోనే మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. నియంత్రణ పాటించడం మంచిది. కపటం నింపుకొని కబుర్లాడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. పొగడ్తలతో ముంచెత్తే వారే మీ వెనుక గోతులు తీసే ప్రమాదం ఉంది. ఆలోచనలను పంచుకునేందుకు తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వారి నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు. లక్కీ కలర్: నశ్యం రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వెచ్చించిన సమయం సత్ఫలితాలనిస్తుంది. నిరంతర అధ్యయనం ద్వారా సాధించిన విషయ పరిజ్ఞానమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. అధికారుల ప్రోత్సాహంతో కోరుకున్న విజయాలను సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఇందులో భాగంగా ప్రచారానికి ముమ్మరంగా ఖర్చు చేస్తారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రణాళికలేవీ వేసుకోనవసరం లేదు. అదృష్టం దానంతట అదే కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. లేనిపోని వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ప్రియతములతో మాట్లాడేటప్పుడు సామాజిక, రాజకీయ చర్చలకు దిగవద్దు. అనవసర వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న అపరిచితులకు సాయం చేస్తారు. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆలయాలను దర్శించుకుంటారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: బూడిద రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సరైన అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థికంగా మరింత పుంజుకోవడానికి తగిన అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు ఉండవచ్చు. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలయ్యే సూచనలు ఉన్నాయి. సృజనాత్మకమైన మీ ఆలోచనలకు తగిన గుర్తింపు, ప్రచారం లభిస్తాయి. మేధాశక్తికి పదును పెట్టుకుంటారు. మీ సలహాల కారణంగా మీరు పనిచేసే సంస్థకు లాభాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నేరేడు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు. లక్కీ కలర్: నారింజ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మనసుకు నచ్చిన రీతిలో ప్రాధాన్యతలను నిర్ధారించుకుంటారు. వాటిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతానికి చెందిన జ్ఞాపకాలు కొంత కుంగుబాటుకు దారితీస్తాయి. ప్రశాంతతను కోరుకుంటారు. ధ్యానం, యోగ వంటి ఆధ్యాత్మిక మార్గాలపై దృష్టి సారిస్తారు. కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషణ సాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి అవరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. లక్కీ కలర్: లేత నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భవిష్యత్ అవసరాల కోసం ఆర్థిక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. లక్కీ కలర్: మబ్బు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: నారింజ రంగు ఇన్సియా టారో అనలిస్ట్ -
టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) విదేశాల నుంచి శుభవార్తలను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో చిరకాలంగా ఆశిస్తున్న పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అనవసరంగా శ్రమించకుండా, తెలివిగా లక్ష్యాలను సాధిస్తారు. మిమ్మల్నే నమ్ముకున్న బృందానికి న్యాయం జరిగేలా చూస్తారు. సగంలోనే విడిచిపెట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం వినూత్న పథకాలను అమలు చేస్తారు. అసూయాపరులు కొందరు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. దూర ప్రాంతాల్లోని మిత్రులను ఆదుకుంటారు. లక్కీ కలర్: నలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస అవకాశాలు వస్తాయి. దేనిని ఎంపిక చేసుకోవాలో అర్థంకాని గందరగోళంలో పడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉన్నతాధికారులతో వాగ్వాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పోరాట పథాన్నే నమ్ముకుంటారు. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 – జూన్ 20) రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పనులు చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. చాలా కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బందిపెట్టవచ్చు. ప్రియతములతో అనుబంధం జటిలంగా మారే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇంట్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీవనశైలిని మార్చుకుంటారు. అనవసరమైన భయాలతో ఆందోళన చెందవద్దు. అవన్నీ వేకువకు ముందు చీకటిలాంటివి. త్వరలోనే మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే ఆశాకిరణాలు ప్రసరిస్తాయి. ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచడానికి తగిన నిధులను సమకూర్చుకుంటారు. రుణాలు తీసుకోవాలనే ఆలోచనను వాయిదా వేసుకోవడమే మంచిది. ఆశ్చర్యకరంగా ప్రత్యర్థులనుకున్న వారే మీకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆత్మీయుల్లో ఒకరు దూరమవుతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) వృత్తి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పని పట్ల అభిరుచి, అంకితభావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. స్వయంకృషితోనే సమస్యల నుంచి బయటపడతారు. క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయాల్సిన మిత్రులు కూడా ముఖం చాటేస్తారు. జీవితం నేర్పిన పాఠాలతో మనుషులను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమానుబంధాలపై ఇంతవరకు దృష్టి సారించకపోయినా, అనుకోకుండా ప్రేమలో పడతారు. ప్రేమానుభూతిని అనుక్షణం ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: ముదురు గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అదృష్టం తలుపు తడుతుంది. ఒక గొప్ప అవకాశం అయాచితంగానే లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనార్జన వ్యామోహాన్ని రేకెత్తించే పన్నాగాలతో కొందరు మిమ్మల్ని బురిడీ కొట్టించే యత్నాలు చేస్తారు. తెలివిగా వాటిని తిప్పికొట్టకుంటే భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. వ్యసనాల నుంచి బయటపడటానికి యోగ, ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: తుప్పు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పనితీరులో దూకుడు పెంచుతారు. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయ పరంపర కొనసాగిస్తారు. విమర్శలు సంధించే ప్రత్యర్థులకు మాటలతో కాకుండా మీ విజయాలతోనే సమాధానం చెబుతారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, అంకిత భావాలతో పాటు మీ అంతస్సౌందర్యమే మిమ్మల్ని ఉన్నతులుగా నిలిపినట్లు గ్రహిస్తారు. నిజాయతీపరులను ప్రోత్సహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కొంత చికాకు కలిగిస్తాయి. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కలలను సాకారం చేసుకోవడానికి కృషి కొనసాగిస్తారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన సమస్యలు సమసిపోతాయి. పరిస్థితులు పూర్తిగా సానుకూలంగా మారుతాయి. ఒక మహిళా భాగస్వామి ఆలోచనల కారణంగా వ్యాపార లాభాలు రెట్టింపవుతాయి. సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తారు. శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఖరీదైన విలాస వస్తువులను ప్రియతములకు కానుకగా ఇస్తారు. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సాదాసీదాగా సాగిపోతున్న జీవితం అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఒడిదుడుకులు ఎదురైనా, సాఫీగానే లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేపనిగా కొందరు మీపై సాగించే దుష్ప్రచారం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకంజ వేయవద్దు. భవిష్యత్తులో అవే సత్ఫలితాలనిస్తాయి. పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి తగిన సలహాలు, సూచనల కోసం జ్యోతిషులను సంప్రదిస్తారు. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: నీలం మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీదైన రంగంలో మీరు తారలా మెరిసిపోతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అనూహ్యమైన పదోన్నతులు, వేతన వృద్ధి సూచనలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలను చేపడతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చాలాకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. అనుకోని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) సానుకూల దృక్పథంతో విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి యోగా, వ్యాయామం, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయిస్తారు. స్థిరాస్తులలో పెట్టుబడుల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బహిరంగ వేదికలపై వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: నాచురంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సుస్థిరతను సాధిస్తారు. జీవితాన్ని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను చాతుర్యంతో పరిష్కరించుకుంటారు. ఇతరులకు నచ్చచెప్పి వారి ద్వారా మీకు కావలసిన రీతిలో పనులు జరిపించుకోవడంలో సఫలమవుతారు. చాలాకాలంగా మనసులో మెదులుతున్న ఆలోచనను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలను తలపెడతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడీ దొరికే అవకాశాలు ఉన్నాయి. గురువులకు కానుకలు ఇస్తారు. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సారథ్య బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. లక్ష్య సాధన దిశగా మీ బృందాన్ని ముందుకు నడుపుతారు. అయితే, మితిమీరిన పనిభారం వారాంతంలో కొంత ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. తిరిగి పుంజుకోవడానికి విశ్రాంతి అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఆర్థిక విజయాలు సాధిస్తారు. స్వల్పకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. సన్నిహితులతో తగాదాలు సంబంధాలను దెబ్బతీసే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము కానీయరు. వృత్తి ఉద్యోగాల్లో సంచలనాత్మక విజయాలను సొంతం చేసుకుంటారు. భారీ లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. రాజకీయ రంగంలోని వారికి ఈర్షా్యళువులైన ప్రత్యర్థుల నుంచి విమర్శలు, దుష్ప్రచారాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సృష్టించడానికి కొందరు కుయుక్తులు పన్నవచ్చు. అప్రమత్తంగా లేకుంటే అనుబంధాలు దెబ్బతినే సూచనలున్నాయి. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) జీవనసరళిలో పెద్ద మార్పులే ఉంటాయి. వేకువ ముందు చీకటిలాంటి గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ఆశాకిరణాలు ప్రసరించి అదృష్టం మీ కళ్ల ముందే సాక్షాత్కరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యసాధనలో కార్యదక్షతను నిరూపించుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సంకల్పమే సగం బలం అని తెలుసుకుంటారు. సడలని సంకల్పబలంతోనే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలసి సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉజ్వలమైన భవితవ్యానికి నాంది మొదలవుతుంది. ప్రజలకు చేరువగా ఉండే రంగాల్లోని వారికి అభిమానులు రెట్టింపవుతారు. అదే సమయంలో మీపై వదంతులకూ విపరీతమైన ప్రచారం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వెనుకంజ వేయకుండా ఎలాంటి సవాళ్లనైనా వెంటనే స్వీకరిస్తారు. కొత్తగా పరిచయమైన ఒక వ్యక్తితో శరవేగంగా పెనవేసుకున్న అనుబంధం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కుటుంబ కలహాలను సామరస్యంగా పరిష్కరిస్తారు. అనుభవంలోను, వయసులోను మీ కంటే పెద్దవాళ్లు సైతం మీ సలహాలు కోరుకుంటారు. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికారంతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. వ్యసనాల నుంచి బయటపడటానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. దాయాదులతో ఆస్తి తగాదాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. మీకు దక్కాల్సిన హక్కుల కోసం పట్టుబట్టకుంటే నష్టం తప్పకపోవచ్చు. మొహమాటం విడిచిపెట్టి ఆచరణాత్మక పరిష్కారాల కోసం ప్రయత్నించడం మంచిది. సాంస్కృతిక కళా రంగాల్లోని వారికి ప్రభుత్వ సత్కారాలు, పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: తుప్పు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మార్పులను స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా లేకపోయినా, మార్పులు అనివార్యమవుతాయి. కాలంతో పాటే మారక తప్పదని సర్దిచెప్పుకుంటారు. అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చాకచక్యంగా గడువులోగా లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం క్షీణించడం పట్ల కలత చెందుతారు. ఆస్తుల కొనుగోలు, పెట్టుబడుల నిర్ణయాలను ఈ వారంలో వాయిదా వేసుకోవడం క్షేమం. ఆలయాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీ నుంచి ఆర్థిక సాయం కోరుకునేవారు మిమ్మల్ని మొహమాటంలో పడేయడానికి చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. సన్నిహితులతో చిన్న చిన్న తగాదాలే చినికి చినికి గాలివానలా మారే సూచనలు ఉన్నాయి. వీలైనంత వాగ్వాదాలకు దూరంగా ఉన్నట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతారు. సద్గురువుల ఆశీస్సులు లభిస్తాయి. లక్కీ కలర్: ఎరుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో అసాధారణమైన మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిపుష్టిని పెంచే లాభసాటి అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు సూచనలు ఉన్నాయి. మొండిబాకీలు వసూలవుతాయి. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు దక్కుతాయి. స్థిరాస్తులను గాని, వాహనాన్ని గాని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ప్రేమికులకు పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: నేరేడు రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) అందచందాలపై అతిగా దృష్టిపెడతారు. అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు. నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. పొగడ్తల మైకంలో మునిగి తేలుతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరించడానికి తటపటాయించకండి. సవాళ్లను స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడినా అద్భుతమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులను వాయిదా వేసుకుని మరీ విహారయాత్రల్లో గడుపుతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) విజయ పరంపరను కొనసాగిస్తారు. కఠోర పరిశ్రమకు తగిన ప్రతిఫలం, గౌరవం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు దక్కకుండా చిరకాలం సాగించిన కృషికి సత్ఫలితాలు మొదలవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి జనాదరణ పెరుగుతుంది. పని నుంచి విరామం తీసుకుని విహారయాత్రలకు వెళతారు. జీర్ణకోశ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు అవసరం. అనుకోని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్విగ్నభరితమైన విజయాలను ఆస్వాదిస్తారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో స్థాయికి మించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్థిరాస్తుల్లోని పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలను అందుకుంటారు. విలక్షణమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల నుంచి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతనీలం - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. చిరకాల పరిచయం ఉన్న వ్యక్తుల ప్రవర్తనలోని మార్పులు విస్తుగొలుపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అనవసరంగా ఈర్ష్యపడే ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పక పోవచ్చు. వాగ్వాదాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బీటలువారే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) సాహసోపేతమైన నిర్ణయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒక కొత్త అవకాశం కలసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. కొత్త భాగస్వాముల అండతో వ్యాపార విస్తరణ మరింత వేగవంతమవుతుంది. పొదుపు చేయడానికి అనుకూలమైన కాలమే అయినా, స్వల్పకాలిక పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాయామంపై దృష్టి సారించడమూ మంచిదే. ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల అనుబంధం పెళ్లికి దారితీయడానికి అడ్డంకులు తొలగిపోతాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఉచిత సలహాలిచ్చే ఇతరుల జోక్యాన్ని నివారించండి. ఆర్థికపరంగా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. మరింత ఉన్నతస్థాయికి చేరుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల పట్ల మీ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పని నుంచి విరామం కోరుకుంటారు. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అకుంఠిత దీక్షతో సాగించిన పనులు ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో కలసి విహారయాత్రలకు వెళతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీని దీటుగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. కీళ్లనొప్పులు ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు తప్పకపోవచ్చు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములను బుజ్జగించి దారికి తెచ్చుకోవడం అగ్నిపరీక్షగా మారుతుంది. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వరుస విజయాలతో దూసుకుపోతారు. వ్యాపారాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. అసాధారణమైన మీ అభివృద్ధి పట్ల ఇతరులు ఈర్ష్య చెందుతారు. ఓపికతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా సాధిస్తారు. ఇదివరకటి సాహసోపేతమైన నిర్ణయం ఒకటి చక్కని ఫలితాలనిస్తుంది. వెన్నునొప్పి ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్టకాలంలో మీకు దూరమైన వారు తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఒక ప్రేమ ప్రతిపాదన ఆశ్చర్యపరుస్తుంది. లక్కీ కలర్: వెండి రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఎవరేమనుకున్నా మీదైన శైలిలోనే ముందుకు సాగుతారు.జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక స్థాయికి ఎదుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. సాహితీ కళారంగాల్లోని వారికి అనూహ్య సత్కారాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. కొందరు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తలనొప్పి, ఒంటినొప్పులు, నిద్రలేమి ఇబ్బందిపెట్టవచ్చు. సుదూర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నాచు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఇతరుల పట్ల మీ వైఖరిలో మార్పు వస్తుంది. ఇతరులు మీ పట్ల చేసిన చిన్న చిన్న పొరపాట్లను తేలికగా క్షమిస్తారు. మీ వైఖరిలో వచ్చిన మార్పు ఆశించిన లక్ష్యం దిశగా మార్గాన్ని సుగమం చేస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుంటారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అందరినీ కలుపుకొనిపోయే తత్వం వల్ల మంచి నాయకులుగా రాణిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధంలో తలెత్తిన చిక్కులను తొలగించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది. లక్కీ కలర్: బంగారు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను ఎదుర్కొంటారు. పనికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొత్త భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలను ఊహించని రీతిలో విస్తరిస్తారు. పొదుపు పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. అయితే, స్పెక్యులేషన్ లావాదేవీలకు, లాటరీ జూదాలకు దూరంగా ఉండటం మంచిది. వారసత్వ ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార పానీయాల పట్ల జాగ్రత్తలు తప్పని పరిస్థితులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం మరికొంత కాలం నిరీక్షణ తప్పదు. అలాగని ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓరిమి వహించండి. త్వరలోనే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి లోనవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడం వల్ల అసహనానికి లోనవుతారు. భావోద్వేగాల్లో నిలకడ లోపిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి మంచి ఆర్థిక లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అపరిచిత పరిసరాల్లో గడపడం విసుగెత్తిస్తుంది. మీవైన పరిసరాల్లోకి, మీవైన పరిస్థితుల్లోకి తిరిగి చేరుకోవడానికి తపిస్తారు. మీ ఊహలకు, మీ పరిజ్ఞానానికి పొంతన లోపించే సూచనలు ఉన్నాయి. మానసికంగా లేనిపోని ఆందోళనలు వెంటాడుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలు దక్కుతాయి. మానసిక ప్రశాంతత కోసం దూర ప్రయాణాలకు సిద్ధపడతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో లక్ష్యాలను సాధిస్తారు. నిబద్ధతకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇదివరకటి పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనుబంధం తెగిపోతుందేమోనని కలత చెందుతారు. లక్కీ కలర్: గులాబి - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పాత ధోరణుల నుంచి బయటపడతారు. జీవనయానాన్ని స్వేచ్ఛ దిశగా మళ్లిస్తారు. అంతః ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థంకాని గందరగోళం కొంత ఇబ్బంది పెడుతుంది. అయినా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. సన్నిహితంగా మరింత సమయం గడపాలంటే ప్రేమికుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు అవసరమవుతాయి. లక్కీ కలర్: నేరేడు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) విడిపోయిన బంధాల గురించి అతిగా ఆలోచించకండి. వాటినలా వెళ్లనివ్వండి. జీవితంలో మార్పులను ఆస్వాదించండి. మంచి చెడుల కలయికగా ఉండే పరిణామాలను స్థితప్రజ్ఞతో స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇంటా బయటా తీరిక దొరకని పరిస్థితులు ఉంటాయి. నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి మీ బృందాన్ని ప్రోత్సహించి ముందుకు నడపాల్సి ఉంటుంది. పని ఒత్తిడి, ప్రేమానుబంధాలకు మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: తుప్పు రంగు మిథునం (మే 21 – జూన్ 20) అనుకున్న పనులు అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతాయి. త్వరలోనే ఘన విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు ఉంటాయి. అనవసరమైన పనులపై అతిగా తాపత్రయ పడుతున్న విషయాన్ని గ్రహిస్తారు. పనితీరును ప్రణాళికాబద్ధంగా మార్చుకుంటారు. స్వల్ప కాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. పాత మిత్రుల్లో ఒకరు కలుసుకుంటారు. ప్రేమ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అన్ని రంగాల్లోనూ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. సాధించదలచుకున్న లక్ష్యం నుంచి దృష్టి చెదరనివ్వకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతమైన పదవులకు చేరుకుంటారు. కఠోర శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలనే కాకుండా, ప్రత్యేక గుర్తింపును కూడా సాధిస్తారు. ఆత్మబంధువు ఒకరిని కలుసుకుంటారు. ఎదుగుదలకు దోహదపడే ఉన్నత విద్యాభ్యాసాన్ని, పరిశోధనలను కొనసాగిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉంటున్నవారికి పెళ్లిళ్లయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్విగ్నభరితమైన కాలం కొనసాగుతోంది. సాహసోపేతమైన నిర్ణయాలతో దూకుడు చూపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అసాధారణమైన పురోగతిని సాధిస్తారు. నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. నమ్మకంగా చిత్తశుద్ధితో మీతో కలసి పనిచేసిన బృందానికి తగిన న్యాయం జరిగేలా చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురైన అవరోధాలను అధిగమించి, సానుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రత్యర్థుల దుష్ప్రచారం కొంత మనస్తాపం కలిగించినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతారు. కోరుకున్న వ్యక్తితో బంధం ముడిపడుతుంది. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో ఉంటున్న వారు చేసే స్వయం ఉపాధి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్తగా చేపట్టే వ్యాపారం మీ భావి అభివృద్ధికి బాటలు వేస్తుంది. అధ్యయనానికి, పరిశోధనకు మరింత సమయం కేటాయిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ రంగంలోని వారు ప్రజల్లోకి వెళ్లి ప్రజలనాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సుస్థిరత కోసం సాగించే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుతమైన ఒక వ్యక్తితో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. పని నుంచి కొంత విరామం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) పాత ఇంటిని పడగొట్టి కొత్త నిర్మాణం చేపడతారు. దీనివల్ల పనిభారం మరింతగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీని ఎదుర్కొంటారు. ఇదివరకు కొందరు మీ పట్ల చేసిన పొరపాట్లను క్షమిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కళాకారులకు అభిమానుల ఆదరణ పెరుగుతుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలను సంయమనంతో పరిష్కరించుకోవాల్సి వస్తుంది. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది
డిసెంబర్ 12 నుంచి 18 వరకు టారో బాణి మీరు తలపెట్టిన ఓ సాహసోపేతమైన పనికి మీ బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఇది మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రేమ/ ధ్యానం/ జీవితం లేదా పెయింటింగ్/ మ్యూజిక్/ డ్యాన్స్/ కవితలు... ఇలా ఎందులోనైనా సరే, మీరు సంపూర్ణంగా లీనమైతే తప్ప అందులోని ఆనందాన్ని అనుభవించలేరని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్ జీవితం ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగాలని ఆలోచించడం మాని, సాహసాలకు చోటివ్వండి, కొత్త జీవితానికి శుభారంభం పలకండి. ప్రేమ-ధ్యానం, కుటుంబ బంధం- ఒంటరితనం కూడా బొమ్మాబొరుసుల్లాంటివే. ఒంటరిత నంలోని ఆనందాన్ని అనుభవించగలిగినప్పుడే ప్రేమమాధుర్యాన్ని ఆనందించగలమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: పీచ్ కలర్ యోగ, ధ్యానం, పరివర్తన చెందడమనేవి చదవడానికి బాగానే ఉంటాయి. అయితే అలా చదివి వదిలేస్తే ప్రయోజనం ఏమిటి? ఆచరించినప్పుడే కదా అలవడేది! జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. గేర్ మారిస్తేనే కదా వాహనం ముందుకు నడిచేది! బాగా ధ్యానం చేయండి. అందులోని ఆనందాన్ని అనుభవించండి. కలిసొచ్చే రంగు: వయొలెట్ జీవితం ఎప్పుడూ నల్లేరుపై బండినడకలా సాగాలని, ఏ సమస్యలూ లేకుండా ఉండాలని మీ కోరిక. అలా జరిగితే ఇక అది జీవితం అవుతుందా? శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలుంటాయి.. ఆలోచిస్తే, మనసు మాట వింటే! మనమసలు ప్రకృతిలో భాగంగా ఉన్నప్పుడు, ప్రకృతిని ప్రేమించినప్పుడు ఏ సమస్యలూ ఉండవు. కలిసొచ్చే రంగు గ్రీన్ కొత్తజీవితం కావాలని కోరుకునేలా చేస్తుంది ఈ వారమంతా! అయితే గొంగళిపురుగుతో సహా అనేక దశలు దాటిన తర్వాతనే శీతాకోకచిలుకగా రూపాంతరం చెందిందని గుర్తుతెచ్చుకోండి. మార్పు అనివార్యం. రకరకాల పరిస్థితులను, గడ్డుసమస్యలను అధిగమించాలి. బుర్రకు పదును పెడితే సరి! కలిసొచ్చే రంగు: మావ్ (రక్తవర్ణం) ఎదగాలనే కోరిక ఎప్పుడూ అణగారనిది. అయితే కాలానికి, కోరికలకు పగ్గాలుండవని గుర్తుంచుకోండి. మార్పు కావాలని కోరుకున్నారు కదా, వస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలంటే విత్తనం మర్రివృక్షంలా ఎదిగినట్లుండాలి. అలాగే మార్పు నీ అంతరాళాల నుంచే రావాలి. కలిసొచ్చే రంగు: లేత ఊదారంగు జీవిత ప్రయాణం మామూలు ప్రయాణాల వంటిది కాదు. ఏదో ఒక సత్యాన్ని బోధిస్తూనే సాగిపోతుంది. మనం అనుకున్నది జరగదు, జరగనివ్వదు. తన ప్రవాహంలో మనల్ని కూడా కలుపుకెళుతుంది. అలాగే సత్యాన్వేషణ చేసే ముందు నీ మనసును ఖాళీగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: గ్రే మీరు కోరుకుంటున్నట్లుగా మనశ్శాంతి లభిస్తుంది. మీ మనస్సు, శరీరం శక్తిని, బలాన్ని పుంజుకుంటాయి. నోరారా తాగితేనే దప్పిక తీరినట్టే, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు దానిమీద పూర్తిగా దృష్టి పెట్టినప్పుడే కదా మనలో చైతన్యం నిండేది. మౌనంగా ఉండి నీలోకి నీవు ప్రయాణించాల్సిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గోల్డెన్. జాతకంలో శనిదశ ఉన్నప్పుడు అంటే దేవుడు మనకు కష్టాలను ఇచ్చినప్పుడే, వాటిని తట్టుకోగలిగే శక్తిని, గుండెనిబ్బరాన్ని కూడా ప్రసాదిస్తాడు. కష్టాలను కూడా ఇష్టంగా స్వీకరించడాన్ని అలవరచుకోండి. రేయింబవళ్లు ఒకదాని తర్వాత ఒకటి వ చ్చినట్టే, కష్టం తర్వాత సుఖం ఉంటుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రెయిన్బో లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు ఒంట్లోని శక్తినంతటినీ, మన ఏకాగ్రతనంతటినీ కేంద్రీకరించాలని గ్రహించండి. నేను తప్ప నా చుట్టుపక్కల వారంతా ఆనందంగా ఉన్నారు... అని అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ఆనందం నీకు కలగాలంటే ఏం చేయాలో తెలుసుకో ముందు. కలిసొచ్చే రంగు: ఫిరోజా రాయి రంగు (పగడం రంగు) మీ బలహీనతలను వదిలించుకుని, మీ తెలివితేటలకు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టేందుకు ఇది తగిన సమయం. పాతజ్ఞాపకాలు, అనుభవాలను గుణపాఠంగా తీసుకోండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి. కార్యాలను అవలీలగా సాధించగలుగుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ సానుకూల వాతావరణాన్ని సాధించేందుకు ప్రయత్నించండి. ధ్యానంలో మరింత లోతుకు చేరేందుకు కృషి చేయండి. శరీరం, ఆత్మ ఒకటైనప్పుడే అలా లోతుకు చేరతారని తెలుసుకోండి. అక్కర్లేని మాటలు ఎంత చేటో, మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా అంతే అనర్థమని గుర్తించండి. కలిసొచ్చే రంగు: ఎల్లో సౌర వాణి ఇంటా బయటా ఆద రణ అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లోనూ, మీ వృత్తిలోనూ కూడా మీ మాటకి పెద్ద విలువ ఈ వారంలో ఉండకపోవచ్చు. ఇతరులు మీ గురించి చెప్పిన మాటలుగానీ, మీ ప్రవర్తనలో మార్పుగానీ ఈ పరిస్థితికి కారనం కావచ్చేమో ఆలోచించుకోండి. ఏమైనా మీ కోపం పట్టుదలా ఒక స్థాయికి మించకూడదని గ్రహించాలి. శుభాశుభాల మిశ్రమంగా గడుస్తుందీ వారం. వృత్తి లేదా ఉద్యోగం చేసేవారికి ఏమాత్రపు అనుకూలతా ఈ మాసంలో దాదాపు ఉండకపోవచ్చు. మీ ప్రతికదలికనూ- అసూయా దృష్టితో ద్వేషబుద్ధితో మీ పై అధికారులకి చాడీలుగా చెప్పే వారి సంఖ్య కొద్దిగా పెరిగినా ఆశ్చర్యపడనక్కరలేదు. అలాంటి వారెవతరు అని ఆలోచించకండా, మీ జాగ్రత్తలో మీరుండండి. ఆదాయం అంతంతమాత్రంగా ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం ఓ పండుగా పబ్బం అనేది కూడా లేకుండా ఉంటుంది. మీరు ఓ సంస్థలోగాని పని చేస్తున్నవారైతే సంస్థ యాజమాన్యం మీద తిరుగుబాటు చేయాలనే ధోరణిని మీకు నూరిపోసి మిమ్మల్ని రెచ్చగొట్టే వారిని ఏమాత్రం విశ్వసించక , ఆ మాటల్ని మొగ్గలోనే తుంచేయండి లేదా పని ఉందని తొలగిపొండి. ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించిన ఓ సమస్య మీకు మనశ్శల్యంగా బాధిస్తూ ఉన్నా తట్టుకోగల గట్టి గుండెధైర్యం మీది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీ ఇంటి విషయాలు వీధిలోనికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడండి. ఆరోగ్యంలో లోపమున్నా వైద్యుని అవసరం దాకా రాద్దు. మనశ్శాంతి ఉన్నట్లు అందరికీ కన్పించడం మీ ప్రత్యేకత. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎంతగా దూసుకుపోవాలని ఓ ప్రణాళికని వేసుకుని వెళ్తున్నా అది సామాన్య ప్రయోజనాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప ఊహించినంత ఎత్తుగా ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకి మాత్రం ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు రాబోయే ఉన్నతిని అంచనా వేసేలా చేస్తుంది. ఇప్పుడు మాత్రం కాదు. కుటుంబంలో ఐకమత్యం అంటే అందరిదీ ఒకే మతిగా ఉంటారు ఈ వారంలో. ఇది కుటుంబానికి శ్రేయస్సుని కల్గించే అంశం. వేసిన ప్రతిరాయీ చెట్టుకున్న ఫలానికి తగలనట్టుగా మీ అన్ని ప్రయత్నాలూ ఫలించవు. ఒకటి మాత్రం నెలచివరలో ఫలించే అవకాశం ఉంది. ముత్యాలు, రత్నాలు, బంగారం వంటి విలువైన వాటిని కొనే అవకాశం ఉంది. మీరు ఏం చేయదలిచినా దానికి ప్రతిబంధకాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ అడ్డంకుల కారణంగా మీ ఊహ కార్యరూపాన్ని దాల్చదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మానసిక వ్యధని కల్గిస్తుంది. మీరు కూడా మానసికంగా బాగా అలిసిపోతారు. మీ ఉన్నతిని గురించి మీరాలోచించుకోవడం శ్రేయస్కర. మీ శక్తికి మించి మీ కుటుంబం మొత్తాన్ని ఎత్తనక్కర్లేదు. ఏ పని చేయబోయినా ప్రస్తుతమున్న గ్రహదశ కారణంగా వాయిదాపడుతుంది. కష్టనష్టాలు ఎదురు కావుకానీ మానసిక వ్యధ పడే అవకాశం మాత్రం ఉంది. ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన ఇబ్బంది లేదా సంతానానికి సంబంధించిన పొరపచ్చాలతో సతమతమయ్యే పరిస్థితి ఉండవచ్చు. ఏమైనా గుండెనిబ్బరంతో ఉండండి. విజయం మీదేనని గ్రహించండి. పనులు నిదానంగా సాగుతాయి. కొత్త ప్రదేశాలకి వెళ్లే అవకాశం ఉంది. మాటకి మాటని చెప్పితీరే మీ ధోరణిని ఎదుటివారన్న మాటని ఎప్పుడు మళ్లీ వాళ్లకి అప్పజెప్పాలా అనే ఆలోచనని మార్చుకుంటే మరింతగా రాణిస్తారు. ఈ తీరు వల్ల మీ మీద అందరికీ ఓ ప్రత్యేక దృష్టి ఏర్పడుతోందని గ్రహించండి. మీకు మీరు ముఖ్యం. ఇలా మీ ఆలోచనని మార్చుకోండి. ఇన్నాళ్లూ మీ తండ్రి, తాతముత్తాతలకీ మీ కుటుంబ సభ్యులందరికీ భోజనాన్ని పెట్టిన పొలాన్ని అలా అమ్మి తెచ్చుకున్న ధనాన్ని తాత్కాలికమైన చరాస్తులైన వాహనాలమీదా ఇతర వస్తువుల మీదా పెట్టేయడం కంటే, దాన్ని తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇక మీదట ఏ పరిస్థితులలోనూ ఇంతకు ముందు కొనుక్కున్న భూమిని అమ్మవద్దు. ఈ వారం వ్యాపారం లాభసాటిగా లేకున్నా నష్టాలు మాత్రం ఉండవు. రావలసిన బకాయిలుగాని, నెలసరి జీతంగాని సకాలంలో రాకపోవచ్చు. వచ్చిన ఆదాయం కూడా పెద్దగా నిలవకపోవచ్చు. అనవసర వ్యయం మీరు చేయకపోవచ్చేమోగాని, అవసరంగా చేయవలసిన వ్యయమే బరువనిపించవచ్చు. ఏమైనా ఆర్థికంగా కత్తిమీద సామే ఈ వారంరోజులూ మీకు. ఒక గడ్డు సమస్యకి బంధువుల సమక్షంలో ఓ ఒప్పందం జరిగిన కారణంగా మీరు ధైర్యంగా ఉంటారు. అయితే మీ విరోధులు మీకు శారీరకంగానూ ఆర్థికంగానూ ఇబ్బందిని కలగజేయబోతారు కాబట్టి, ఈ విషయంలో ఏమాత్రపు సడలింపునీ అంగీకరించవద్దు. అలాగే చేసుకున్న ఒప్పందానికి చిరుమార్పుల్ని కూడా ఒప్పుకోవద్దు. జరిగిన నిర్ణయానికి కట్టుబడి ఉండండి.