టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు) | Weekly Tarotscope For 21st July To 27 July 2019 | Sakshi
Sakshi News home page

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

Published Sun, Jul 21 2019 10:05 AM | Last Updated on Sun, Jul 21 2019 10:05 AM

Weekly Tarotscope For 21st July To 27 July 2019 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. చిరకాల పరిచయం ఉన్న వ్యక్తుల ప్రవర్తనలోని మార్పులు విస్తుగొలుపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అనవసరంగా ఈర్ష్యపడే  ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పక పోవచ్చు. వాగ్వాదాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బీటలువారే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
సాహసోపేతమైన నిర్ణయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒక కొత్త అవకాశం కలసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. కొత్త భాగస్వాముల అండతో వ్యాపార విస్తరణ మరింత వేగవంతమవుతుంది. పొదుపు చేయడానికి అనుకూలమైన కాలమే అయినా, స్వల్పకాలిక పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాయామంపై దృష్టి సారించడమూ మంచిదే. ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల అనుబంధం పెళ్లికి దారితీయడానికి అడ్డంకులు తొలగిపోతాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా మీ నియంత్రణలోకి తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఉచిత సలహాలిచ్చే ఇతరుల జోక్యాన్ని నివారించండి. ఆర్థికపరంగా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. మరింత ఉన్నతస్థాయికి చేరుకోవడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల పట్ల మీ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పని నుంచి విరామం కోరుకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అకుంఠిత దీక్షతో సాగించిన పనులు ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో కలసి విహారయాత్రలకు వెళతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీని దీటుగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. కీళ్లనొప్పులు ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు తప్పకపోవచ్చు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రియతములను బుజ్జగించి దారికి తెచ్చుకోవడం అగ్నిపరీక్షగా మారుతుంది.
లక్కీ కలర్‌: ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వరుస విజయాలతో దూసుకుపోతారు. వ్యాపారాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. అసాధారణమైన మీ అభివృద్ధి పట్ల ఇతరులు ఈర్ష్య చెందుతారు. ఓపికతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా సాధిస్తారు. ఇదివరకటి సాహసోపేతమైన నిర్ణయం ఒకటి చక్కని ఫలితాలనిస్తుంది. వెన్నునొప్పి ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కష్టకాలంలో మీకు దూరమైన వారు తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఒక ప్రేమ ప్రతిపాదన ఆశ్చర్యపరుస్తుంది.
లక్కీ కలర్‌: వెండి రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఎవరేమనుకున్నా మీదైన శైలిలోనే ముందుకు సాగుతారు.జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక స్థాయికి ఎదుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. సాహితీ కళారంగాల్లోని వారికి అనూహ్య సత్కారాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. కొందరు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తలనొప్పి, ఒంటినొప్పులు, నిద్రలేమి ఇబ్బందిపెట్టవచ్చు. సుదూర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నాచు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది. కళాకారులకు చక్కని అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఇతరుల పట్ల మీ వైఖరిలో మార్పు వస్తుంది. ఇతరులు మీ పట్ల చేసిన చిన్న చిన్న పొరపాట్లను తేలికగా క్షమిస్తారు. మీ వైఖరిలో వచ్చిన మార్పు ఆశించిన లక్ష్యం దిశగా మార్గాన్ని సుగమం చేస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకుంటారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అందరినీ కలుపుకొనిపోయే తత్వం వల్ల మంచి నాయకులుగా రాణిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధంలో తలెత్తిన చిక్కులను తొలగించుకుంటారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది.
లక్కీ కలర్‌: బంగారు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను ఎదుర్కొంటారు. పనికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొత్త భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలను ఊహించని రీతిలో విస్తరిస్తారు. పొదుపు పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. అయితే, స్పెక్యులేషన్‌ లావాదేవీలకు, లాటరీ జూదాలకు దూరంగా ఉండటం మంచిది. వారసత్వ ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార పానీయాల పట్ల జాగ్రత్తలు తప్పని పరిస్థితులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం మరికొంత కాలం నిరీక్షణ తప్పదు. అలాగని ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓరిమి వహించండి. త్వరలోనే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి లోనవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడం వల్ల అసహనానికి లోనవుతారు. భావోద్వేగాల్లో నిలకడ లోపిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి మంచి ఆర్థిక లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
లక్కీ కలర్‌: పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అపరిచిత పరిసరాల్లో గడపడం విసుగెత్తిస్తుంది. మీవైన పరిసరాల్లోకి, మీవైన పరిస్థితుల్లోకి తిరిగి చేరుకోవడానికి తపిస్తారు. మీ ఊహలకు, మీ పరిజ్ఞానానికి పొంతన లోపించే సూచనలు ఉన్నాయి. మానసికంగా లేనిపోని ఆందోళనలు వెంటాడుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలు దక్కుతాయి. మానసిక ప్రశాంతత కోసం దూర ప్రయాణాలకు సిద్ధపడతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: ఎరుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో లక్ష్యాలను సాధిస్తారు. నిబద్ధతకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇదివరకటి పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనుబంధం తెగిపోతుందేమోనని కలత చెందుతారు.
లక్కీ కలర్‌: గులాబి
- ఇన్సియా, టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement