టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు) | Weekly Tarot For 25th August To 31st August 2019 | Sakshi
Sakshi News home page

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

Published Sun, Aug 25 2019 10:01 AM | Last Updated on Sun, Aug 25 2019 10:02 AM

Weekly Tarot For 25th August To 31st August 2019 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పరిస్థితుల్లో సానుకూలతలు కొంత లోపించినా ఆశావహ దృక్పథంతోనే ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధి, అంకితభావాలే మీ విజయాలకు బాటలు వేస్తాయి. వ్యాపార వర్గాలకు ఇది అనువైన కాలం. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు తేలికగానే సమకూరుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. 
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితంలోని క్లిష్టమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చిన సావాసాలను బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. నిజమైన మిత్రులెవరో, మిత్రుల్లా నటించే శత్రువులెవరో స్పష్టంగా తేలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇదీ ఒకందుకు మంచిదే! మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ పరిస్థితులు ఎంతగానో దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు మీపై తెరవెనుక కుట్రలు సాగించే అవకాశాలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
మొండిబాకీలు వసూలవుతాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి  ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు ఉన్నాయి. పాత వస్తువులను వదిలించుకుంటారు. ఇల్లు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అన్ని రంగాల్లోనూ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు, పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కొందరికి కోరుకున్న చోటికి బదిలీలు జరగవచ్చు. చిన్న చిన్న సరదాలను అమితంగా ఆస్వాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విదేశాల నుంచి విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసొస్తాయి. సాహితీ కళారంగాల్లోని వారికి సత్కారాలు, గౌరవ పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. ఆత్మబంధువులాంటి వ్యక్తి ఒకరు తారసపడతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సభా వేదికలపై అద్భుతంగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సాటివారి ప్రయోజనాలను పోరాడి మరీ సాధిస్తారు. నాయకత్వ పటిమను చాటుకోవడానికి తగిన అవకాశాలు కలసి వస్తాయి. ప్రముఖులతో చర్చల్లో పాల్గొంటారు. రాజకీయరంగంలోని వారికి కీలకమైన పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. తీరిక చిక్కని పరిస్థితుల్లో వ్యాయామానికి దూరం కావడం వల్ల ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సమసిపోతాయి.
లక్కీ కలర్‌: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అదృష్టం తలుపు తడుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలను కోరుకున్న రీతిలో విస్తరిస్తారు. ప్రచారం కోసం చేసిన ఖర్చు రెట్టింపు ఫలితాలనిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. వస్త్రాలంకరణపైన, సౌందర్యంపైన శ్రద్ధ పెంచుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. విదేశాల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగుతారు. యోగ ధ్యానాలకు మరింత సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి లావాదేవీల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. అవసరాల్లో మీ నుంచి సాయం పొందిన వారే మీకు మొండిచెయ్యి చూపుతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కుటుంబ సభ్యులతో కలసి వినోదయాత్రలకు వెళతారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రలోభాలకు లోనవకుండా, అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడమే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నిజాయతీని నమ్ముకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ప్రలోభాల ఉచ్చులో చిక్కుకుంటే మీకే ప్రమాదం. వాగ్వాదాలకు రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండటం మేలు. సంయమనం కోల్పోతే వివాదాలు చుట్టుముట్టే సూచనలున్నాయి.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లోని వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. కొత్త భాగస్వాముల సహకారంతో వ్యాపారాలు గణనీయంగా పుంజుకుంటాయి. పాత వాహనాన్ని వదుల్చుకుని, కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొందరికి వారసత్వపు ఆస్తులు కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. పురాతన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
జీవితం మరింత సంతోషభరితంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు జనాదరణ రెట్టింపవుతుంది. వ్యాపారాల విస్తరణకు కావలసిన నిధులు సునాయాసంగా సమకూరుతాయి. పరస్పర భిన్నధ్రువాల్లాంటి ఇద్దరు కీలక వ్యక్తుల భేటీకి మీరు చోదకశక్తిగా పనిచేస్తారు. సమాజంపై ప్రభావం చూపగల ప్రముఖులను కలుసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది.
లక్కీ కలర్‌: నీలం

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఎరక్కపోయి తుఫానులో చిక్కుకున్నట్లుగా ఆందోళన చెందుతారు. కార్యాచరణకు కొంత విరామం ప్రకటించడం మంచిది. పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. పనికిమాలిన సావాసాల నుంచి ఎంత త్వరగా బయటపడి అంత త్వరగా పుంజుకోగలుగుతారు. సమస్యల్లో చిక్కుకున్న మిత్రులకు ఆసరాగా నిలుస్తారు. గురువులను కలుసుకుంటారు. గుప్తదానాలు చేస్తారు.
లక్కీ కలర్‌: గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విజయపథంలో దూసుకుపోతారు. సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. జీవితంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. పుస్తక పఠనానికి మరింతగా సమయాన్ని కేటాయిస్తారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ
- ఇన్సియా, టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement