మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు నెలకొంటాయి. ముఖ్య వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ అభిప్రాయాలు, నిర్ణయాలపై కుటుంబసభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆరోగ్యపరమైన చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్ల శుభవార్తలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు. కొన్ని నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు వింటారు. ధనలాభం చేకూరుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎంత శ్రమపడినా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక డీలాపడతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై నిరాశ చెందుతారు. అయితే చేపట్టిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు, నిదానం పాటించండి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వస్తులాభాలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొంత జాప్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్తితి సామాన్యంగా ఉంటుంది. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో విందువినోదాలు. భూలాభాలు. దైవదర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల పరిచయం. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కొన్ని పనులలో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. తీర్థయాత్రలు చేస్తారు. మీ నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉండవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
Comments
Please login to add a commentAdd a comment