వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు) | Weekly Horoscope For 22nd September To 28th September 2019 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

Published Sun, Sep 22 2019 8:48 AM | Last Updated on Sun, Sep 22 2019 8:48 AM

Weekly Horoscope For 22nd September To 28th September 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో  చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. వారం మధ్యలో ధనవ్యయం. సోదరులతో కలహాలు. పసుపు, గులాబీరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠిచండి. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. తరచూ ప్రయాణాలు సంభవం. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గృహం, వాహనాల కొనుగోలులో ప్రతిష్ఠంభన. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొంత అసంతృప్తి. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్య పనులలో అవాంతరాలు తొలగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. భూవివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వాహనయోగం.  వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులు, సోదరుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఏ బాధ్యత అప్పగించినా  సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఇంట ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో  దూరప్రయాణాలు. బ«ంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నిరుద్యోగులకు ఒక ప్రకటన మరింత ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు యత్నకార్యసిద్ధి. ప్రారంభంలో కొద్దిపాటి వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. నూతన∙వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం చివరిలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు  నిదానంగా పూర్తి  కాగలవు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి  గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు కొన్ని  సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిళ్లు. అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement