మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆశించిన లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. స్వల్ప అనారోగ్య సూచనలు. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు గతంతో పోల్చుకుంటే కొద్దిగా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పసుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని సమస్యలు, వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు భూములు కొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబసమస్యలు కొంత వేధింపునకు గురిచేస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు చివరి క్షణంలో వాయిదా. వారం మధ్యలో «కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. విద్యార్థుల విదేశీ విద్యాయత్నాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని చికాకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. గృహ నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో కొంత నిరాశ పరుస్తుంది. అయినా అవసరాలకు లోటు రాదు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి విశేష సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు కలిసిరావు. పనుల్లో ఆటంకాలు. సన్నిహితులతో అకారణంగా విరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. కాంట్రాక్టులు చేజారవచ్చు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో ధనలాభం. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
బంధువులతో అకారణంగా విభేదాలు. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. తరచూ ప్రయాణాలు సంభవం. సోదరుల నుంచి పిలుపు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన కొత్త పనులు ఆత్మస్థైర్యంతో విజయవంతంగా పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులు, కుటుంబసభ్యులకు సంబంధించి శుభవర్తమానాలు అందుతాయి. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి, నిశ్చింతగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు
Comments
Please login to add a commentAdd a comment