‘పిల్లిని చూసుకోవడానికి ఆయా కావలెను’ అనే ప్రకటన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ నగరం తూర్పు శివారు ప్రాంతంలో ఒక భారీ భవంతిలో ఉంటున్న సంపన్న దంపతులు ఒక పిల్లిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. భార్యా భర్తలిద్దరూ పనుల్లో తలమునకలుగా ఉండేవారే కావడంతో ఇద్దరూ ఇంట్లో లేనప్పుడు పిల్లి బాగోగులు చూసుకోవడం వారికి ఇబ్బందిగా ఉంటోంది.
అందువల్ల తమ పిల్లికి ఆయాగా ఉండేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ ఉద్యోగంలో చేరేవారికి తాము ఉంటున్న భవంతిలోనే సకల సౌకర్యాలతో కూడిన విశాలమైన గది, ఉచిత భోజనంతో పాటు తగిన జీతం కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిడ్నీ నగరంలో ఇళ్ల అద్దెలు కళ్లుచెదిరే రీతిలో ఉంటాయి. సామాన్యమైన ఉద్యోగాలు చేసుకునేవారు అద్దెలు భరించలేక హాస్టళ్లలో ఉంటూ నెట్టుకొస్తుంటారు. చక్కని వసతితో కూడిన ఉద్యోగం కావడంతో పిల్లికి ఆయాగా ఉండటానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయి.
చదవండి: పొగ తాగడం మానేసిన 20 నిమిషాల్లోనే ఎన్నెన్నో లాభాలు.. ఒక్కసారి ట్రై చేయండి
Comments
Please login to add a commentAdd a comment