
ATM was dispensing extra cash: మహారాష్ట్రాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మెషీన్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం వంద రూపాయల(రూ.100) నోట్లను మిత్రమే ఉంచుతారు.. ఐతే ఒక అతను రూ.500లు డ్రా చేద్దామని వెళ్తే ఏకంగా రూ.500ల నోట్లు ఐదు వచ్చాయి. అంటే అతను రూ.500లు డ్రా చేస్తే ఏటీఏం మెషీన్ ప్రకారం వంద రూపాయల(రూ.100) నోట్లు ఐదు రావడానికి బదులు ఐదు ఐదువందల రూపాయల(రూ.500) నోటులే వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
అంతేకాదు అతను మళ్లీ ఇంకోసారి ఇలానే డబ్బలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌కి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఖపర్‌ఖేడా పట్టణంలో ఒక ప్రైవేట్ ఏటీఎం మెషీన్‌లో చోటు చేసుకుంది. ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో జనాలు ఆ ఏటీఎం మిషీన్ వద్దకు క్యూ కట్టారు. ఐతే సదరు బ్యాక్ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏటీఎం మిషీన్‌ని మూసేంతవరకు ఈ తంతు జరిగింది.
ఏటీఎంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ ఏటీఎంని రూ.100/-ల డినామానేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్దేశిస్తే...బదులుగా అనుకోకుండా పొరపాటున రూ.500/- డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
(చదవండి: టిఫిన్ ప్లేట్‌లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం)
Comments
Please login to add a commentAdd a comment