extra money
-
ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!
ATM was dispensing extra cash: మహారాష్ట్రాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మెషీన్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం వంద రూపాయల(రూ.100) నోట్లను మిత్రమే ఉంచుతారు.. ఐతే ఒక అతను రూ.500లు డ్రా చేద్దామని వెళ్తే ఏకంగా రూ.500ల నోట్లు ఐదు వచ్చాయి. అంటే అతను రూ.500లు డ్రా చేస్తే ఏటీఏం మెషీన్ ప్రకారం వంద రూపాయల(రూ.100) నోట్లు ఐదు రావడానికి బదులు ఐదు ఐదువందల రూపాయల(రూ.500) నోటులే వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు అతను మళ్లీ ఇంకోసారి ఇలానే డబ్బలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌కి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఖపర్ఖేడా పట్టణంలో ఒక ప్రైవేట్ ఏటీఎం మెషీన్లో చోటు చేసుకుంది. ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో జనాలు ఆ ఏటీఎం మిషీన్ వద్దకు క్యూ కట్టారు. ఐతే సదరు బ్యాక్ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏటీఎం మిషీన్ని మూసేంతవరకు ఈ తంతు జరిగింది. ఏటీఎంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ ఏటీఎంని రూ.100/-ల డినామానేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్దేశిస్తే...బదులుగా అనుకోకుండా పొరపాటున రూ.500/- డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్‌కి ఎదురైన చేదు అనుభవం) -
వైద్యుడి అత్యాశ.. ఆపరేషన్ మధ్యలోనే..
పశ్చిమ గోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వైద్యులు డబ్బుమీద అత్యాశతో వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు. కిడ్నీ రోగికి ఆపరేషన్ చేస్తూ.. అదనంగా డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడో వైద్యుడు. ఈ సంఘటన మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన జుత్తిగ పార్థసారథి(55) అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. నిన్న ఆపరేషన్ చేస్తూ ఉండగా మహేష్ అనే వైద్యుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని రోగి బంధువులు ఆరోపించారు. కిడ్నీలో రాళ్ళ వ్యాధితో గత రెండు రోజుల క్రితం పార్థసారథిని మదర్ వన్నినిలో అతని బంధువులు చేర్పించారు. అయితే ఇక్కడి సిబ్బంది స్కానింగ్, ఇతర పరీక్షల నిమిత్తం ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం నిన్న మదర్ వన్నినికి తీసుకొచ్చారు. అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా వైద్యుడు మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు. మత్తు ఇచ్చి సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానన్నాడని పేషేంట్ బంధువులు ఆరోపించారు. తాము సొమ్ములిచ్చుకోలేమనడంతో ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారంటూ వారు వాపోయారు. ఈ విషయం ముందే చెప్పాలి గానీ ఆపరేషన్ మధ్యలో చెప్పడమేంటని డాక్టర్‌ను వారు నిలదీశారు. కొద్దిసేపటి తర్వాత వైద్యుడు మహేష్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. దీంతో పేషేంట్ బంధువులు అక్కడి సిబ్బందిని నిలదీసి ఆందోళన నిర్వహించారు. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బందికి, పేషేంట్ బంధువులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సొమ్ములకోసం ఆపరేషన్‌ను మధ్యలో వదిలివెళ్లిన డాక్టర్ మహేహ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని వారు కోరారు. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట మోసం
అల్లిపురం(విశాఖ దక్షిణ): మీరు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సం పాదించండి... విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు... అంటూ ప్రకటనలతో ఆకట్టుకుని ఒక సంస్థ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం జైలురోడ్డులో కోల్‌కత్తాకు చెందిన ఎస్ఎస్ కమ్యూనికేషన్ పేరిట ఒక కార్యాలయం ప్రారంభించారు. వారు నిరుద్యోగ యువత, గృహిణులు, చిరుద్యోగుల నుం చి పార్ట్ టైం వర్కు చేసి అదనపు ఆదాయం సంపాదించండి అంటూ రూ.6వేల నుంచి రూ.40వేల వర కు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ చేసిన నగదు మళ్లీ కావాల్సినప్పుడు వెనక్కు తీసుకోవచ్చని... అంతవరకు నెలకు రూ.9వేల నుంచి రూ.36వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపించారు. రోజ్‌వాటర్ తయారీ, ఎల్ఈడీ ప్యానెల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బు తయారీ, ఎల్ఈడీ బల్బుల తయారీ ప్యాకింగ్‌కు ముడి సరకు అందిస్తామన్నారు. దీంతో వంద మందికి పైగా సభ్యులు ఆ సంస్థలో ఈ నెల 7, 8వ తేదీల్లో డబ్బులు చెల్లించారు. అందుకు సంస్థ తరఫున రసీదులు కూడా ఇచ్చారు. మంగళవారం ఉదయం సంబంధిత కార్యాలయానికి ముడి సరుకు తీసుకొనేందుకు వెళ్లగా మూసి ఉంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు అనకాపల్లిలో ఉన్నాడని బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
10 దాటితే..20 ఇవ్వాల్సిందే
ఆటోవాలాల దోపిడీ బైపాస్ రైడర్లతో ప్రయాణికులకు ఇక్కట్లు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉన్న ఆత్మకూరుకు చేరుకునేందుకు రాత్రి 10 గంటలు దాటితే రూ.20 చెల్లించాల్సిందేనని, ఆటోవాలాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆత్మకూరుకు రావడానికి నెల్లూరు నుంచి రాత్రి 8 గంటల తర్వాత బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరై అనంతపురం, కర్నూలు, కడప, పొద్దుటూరు, బళ్లారి తదితర బైపాస్ రైడర్ల బస్సు సర్వీసుల్లో ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. లేకుంటే చెన్నై–ఆత్మకూరు బస్సు కోసం రాత్రి 10.30 గంటల వరకు నెల్లూరులో ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విధి లేక అధిక చార్జీ అయినా చెల్లించి బైపాస్ బస్సు సర్వీసుల్లో ఆత్మకూరుకు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నారు. 2 కిలోమీటర్లకు రూ.20 నెల్లూరు నుంచి నెల్లూరుపాళెం వరకు మాములుగా చార్జీ రూ.35లు ఉండగా ఈ బస్సుల్లో రూ.65 వసూలు చేస్తున్నారు. అయితే ఈ బస్సులు నెల్లూరుపాళెంసెంటర్ నుంచి పట్టణంలోకి రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరానికి రూ.20 వసూలు చేయడం దారుణమని ప్రయాణికులు వాపోతున్నారు. ఆటో ఎక్కి దిగితే రూ.20 ఇవ్వాల్సిందేనని ఆటోవాలాలు పట్టుబడుతున్నారు. మంగళవారం రాత్రి ఆటోచార్జీ విషయమై ప్రయాణికులకు ఓ ఆటోవాలాకు తీవ్ర వాదోపవాదాలు జరిగినా చివరకు ఆటోవాలా డిమాండ్ మేరకు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. గత కొన్నేళ్లుగా దూర ప్రాంత బస్సులను ఆత్మకూరు పట్టణంలోకి కనీసం ఆర్టీసీ డిపో వరకైనా నడపాలని ప్రజలు కోరుతున్నా నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోవాలాలను కట్టడి చేయాల్సిన ఆర్టీఏ, పోలీసు తదితర శాఖల అధికారుల నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రయాణికుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిమ్మనక ఆటోవాలాలు అడిగిన మేరకు ఇవ్వక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. బైపాస్రైడర్ల, ఆటోవాలాల దోపిడీని ఎవరు అరికడతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.