‘బండెనక బండి కట్టి..’ అన్నట్లు ఒకదాని వెనుక మరొకటి బోగీలతో రైళ్లు సాగిపోతూనే ఉంటాయి. మరి వాటి పొడవెంతుంటుందో తెలుసా?.. మన దేశంలో గూడ్స్ రైళ్లు 1.2 కిలోమీటర్ల వరకూ, ప్రయాణికుల రైళ్లు 600 మీటర్ల వరకూ ఉంటాయి. కానీ పశ్చిమ ఆస్ట్రేలియాలో బీహెచ్‌పీ సంస్థ ఏకంగా 682 వ్యాగన్లతో 7.35 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును నడిపింది. 8 ఇంజన్లను వాడిన ఈ రైలు ఏకంగా లక్ష టన్నుల ఇనుప ఖనిజాన్ని తరలించింది.
దక్షిణాఫ్రికాలో 660 వ్యాగన్లతో 7.3 కి.మీ పొడవైన రైలును నడిపారు.. ఇది 16 ఇంజన్లతో 70 వేల టన్నుల సామగ్రిని మోసుకెళ్లింది. రష్యా కూడా 439 వ్యాగన్లతో 6.5 కిలోమీటర్ల పొడవైన రైలును నడిపింది. ఇక బెల్జియంలో 70 కోచ్‌లతో 1.8 కి.మీ. పొడవున్న ప్యాసింజర్ రైలును నడిపారు. సాధారణంగా ఆస్ట్రేలియాలో 90 కోచ్‌లతో 1.2 కి.మీ. పొడవైన రైళ్లను నడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment