
బెల్జియంలోని బ్రూగ్స్‌లో ఓ బీర్‌వాల్ అని చాలా ఫేమస్ బార్ ఉంది. అక్కడ రోజుకు దాదాపు 1600 గ్లాసుల బీరు అమ్ముడు పోతుందట. అంత ఫేమస్ అది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది బీరు గురించి కాదు. ఆ బీరు పోసిచ్చే గ్లాసుల గురించి..! ఎందుకంటే ఆ షాప్ వాళ్లే ప్రత్యేకంగా తయారు చేయించుకున్న గ్లాసుల్లో వారు బీరు సర్వ్ చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడే ఆ షాప్ యాజమాన్యానికి ఓ చిక్కు వచ్చి పడింది.
ఆ ప్రత్యేకమైన గ్లాసులే వారికి తల నొప్పిగా మారాయి. ఎందుకంటే అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అక్కడికొచ్చిన కస్టమర్లు వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారట. బార్ గోడలపై గ్లాసులను దయచేసి తీసుకెళ్లకండి అని పెద్ద పెద్ద అక్షరాలతో నాలుగు భాషల్లో చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా వాటిని దొంగిలిస్తున్నారట. ఇక చేసేదేం లేక బారు ఎంట్రన్స్‌లలో గ్లాస్ స్కానర్లను పెట్టి మరీ వారి గ్లాసులను కాపాడుకోవాల్సి వస్తోందట. బార్‌లోపలికి వచ్చి వెళ్లే వారందరినీ స్కాన్ చేసి గ్లాసులుంటే వారికి సున్నితంగా చెప్పి వారి గ్లాసులు వారు తీసుకుంటున్నారట.