– బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు
సనత్‌నగర్: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్ దోపిడీకి ఎస్‌ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్ సమీపంలోని ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు.
ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలకు అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment