moosapet
-
అయ్యో.. మౌనిక!
హైదరాబాద్, సాక్షి: నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఝామ్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
సనత్‌నగర్: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్ దోపిడీకి ఎస్ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
మూసాపేటలో ‘సాక్షి’ సంక్రాంతి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
-
వీధి కుక్కలను చంపి ‘పడేశారు’!
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్‌ఖన్న తెలిపారు. పొన్నకల్ ఘటన మరువక ముందే? అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్‌లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది. -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
HYD: మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మూసాపేట మెట్రో స్టేషన్లో ఆత్మహత్య ఉదంతం చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ కింద దూకి గుర్తు తెలియని వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్లోకి ప్రవేశించినట్లు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా ప్లాట్‌ఫామ్‌కు చేరుకుని.. సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేశాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఇంజిన్‌కు ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో బాడీ పడిపోయింది. ఈ ఘటన అక్కడ సీసీ ఫుటేజ్‌లో నమోదు అయ్యింది. మృతుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. -
మూసాపేట నుంచి కేపీహెచ్‌బీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
-
సార్.. వస్తున్నారని ఆతృత.. జారిపడిన విద్యార్థి
సాక్షి, మూసాపేట: మూసాపేట బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి (ఇంగ్లిష్ మీడియం) చదువుతున్న విశ్వనాథ్ ఎడమ చేయి బుధవారం పాఠశాలలో విరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరగతి గది బయట విద్యార్థులు మాట్లాడుతుండగా ఓ విద్యార్థి సార్ వస్తున్నాడు అని చెప్పడంతో తోటి విద్యార్థులు అందరూ ఒక్కసారిగా తరగతి గదిలోకి వెళ్ళారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే విద్యార్థి బెంచి తగిలి కింద పడటంతో అతనిపై మిగతా విద్యార్థులు పడగా విశ్వనాథ్ చేయి విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. టీచర్ తరగతి గదికి వచ్చే గ్యాప్‌లో ఈ సంఘటన జరిగిందని హెచ్ఎం రాజ్ పాల్ సింగ్ తెలిపారు. సకాలంలో తరగతికి ఉపాధ్యాయులు హాజరు కాలేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
సంతోష్‌ను చంపింది సోదరుడే..
మూసాపేట: గత నెల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలుడు సంతోష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సొంత అన్నే తన తమ్ముడి గొంతుకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. సీఐ రజితారెడ్డి, ఎస్ఐ పర్వతాలు తెలిపిన కథనం ప్రకారం, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేటకి చెందిన పుట్ట విష్ణు గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి 22 ఏళ్ల క్రితం అడ్డాకుల మండలం గౌరిదేవునిపల్లికి చెందిన పద్మతో వివాహం కాగా కుటుంబ కలహాలతో దూరమయ్యారు. దీంతో విష్ణు పదేళ్ల క్రితం మహ్మదుస్సేన్‌పల్లికి చెందిన లక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పద్మకు ఒక కూతురు, పదిహేడేళ్ల కుమారుడు.. రెండో భార్య లక్ష్మీకి సంతోష్ (8) సంతానం. అయితే, మొదటి భార్య పిల్లల్లో కూతురు తల్లి దగ్గర, 17 ఏళ్ల కుమారుడు తండ్రి దగ్గర ఉంటున్నారు. తమ్మునిపై కక్ష పెంచుకుని.. రెండవ భార్య కుమారుడు సంతోష్ అన్నను కొన్ని రోజు లుగా ‘మా ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు’అంటూ ప్రశ్నించడమేగాక తరచూ తిడుతుండటంతో సంతోష్‌పై అన్న కక్ష పెంచుకున్నాడు. ఫిబ్రవరి 22న పొలం వద్ద గడ్డి కోసుకువద్దామని చెప్పి తమ్ముడిని తీసుకొని వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో సంతోష్ గొంతుకు తాడు వేసి ఊపిరాడకుండా చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పక్కనే ఓ పొలం వద్ద ఉన్న చీరను తెచ్చి అందులో బాలుడి మృతదేహాన్ని చుట్టి తీగతో కట్టి బావిలో పడేశాడు. సంతోష్ కోసం కుటుంబసభ్యులు, పోలీసులు అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. గత పది రోజులుగా గ్రామానికి చెందిన పలువురితో పాటు, అన్నను విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అన్నను జువెనైల్ హోంకు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మూసాపేటలో విషాదం.. కొడుకు కోసం తల్లి ఆరాటం
సాక్షి, హైదరాబాద్: మూసాపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొనగా, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకెళ్తే.. బతుకుదెరువు కోసం శ్రీకాకుళం నుంచి హైదర్‌బాద్‌కు వచ్చిన వెంకట్రావ్ కుటుంబం (భార్య, ఇద్దరు పిల్లలు) మూసాపేటలో నివాసం ఉంటున్నారు. రోజూలానే తల్లిదండ్రులద్దరు పనులకు వెళ్లడంతో చిన్నకుమారుడైన నవీన్ (8) మిత్రులతో కలసి సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. చదవండి: (ఐదుగురికి లైఫ్ ఇచ్చిన రెండున్నరేళ్ల చిన్నారి) ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కుమారుడిని రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను అందించినా ప్రయత్నం ఫలించలేదు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
మూసాపేటలో విషాదం.. కొడుకు కోసం తల్లి ఆరాటం
-
మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు
-
మూసాపేట మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు
సాక్షి, హైదరాబాద్ : మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికుల్నిమరోసారి భయపెడుతున్నాయి. తాజాగా మూసాపేటలోని మెట్రో స్టేషన్ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో.. ఇవి తెలుసుకోండి) -
రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్’
సాక్షి, హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఇంటి వద్దకే పండ్లను అందించే ప్రయోగం బాగుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. మూసాపేటలోని వాక్ ఫర్ వాటర్ పండ్ల ప్యాకింగ్ కేంద్రాన్ని శనివారం మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి వద్దకే పండ్ల కార్యక్రమానికి ప్రజల అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. జంటనగరాలలో ఇప్పటివరకు 71 వేల కుటుంబాలకు రైతుల నుంచి 11 వందల 25 టన్నుల పండ్ల సరఫరా జరిగినట్లు తెలిపారు. మరిన్ని నాణ్యమైన సేవల కోసం తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. (ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది: బండి సంజయ్ ) వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ 5 కిలోల బత్తాయి, మామిడి పండ్లు తీసుకుంటే ఉత్పత్తిలో 50 శాతం ఇక్కడే వినియోగమవుతుందన్నారు. రూ. 300 కు ఆరు రకాల పండ్ల కాంబో ప్యాక్ తో పాటు, రూ.300 కు 5 కిలోల పండ్లు, సేంద్రీయ, ప్రత్యేక రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. 88753 51555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందతాయని మంత్రి తెలిపారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్) -
పంచాయతీల్లో కో ఆప్షన్ మెంబర్
సాక్షి, మూసాపేట: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలో కో ఆప్షన్ సభ్యులకు చోటు కల్పించనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో నూతనంగా కో ఆప్షన్ సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. గ్రామ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కో ఆప్షన్ సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూసాపేటను నూతనంగా ఏర్పాటు చేయగా అందులో 12 గ్రామ పంచాయతీల నుంచి 15 గ్రామ పంచాయతీలుగా మూసాపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో ముగ్గురి చొప్పున 45 మందిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వారికి వార్డు సభ్యులతో సమానంగా కో ఆప్షన్ సభ్యులకు కూడా హోదా వస్తుంది. మూడు విభాగాల్లో సభ్యుల ఎన్నిక.. గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యులను మూడు విభాగాల్లో ఎన్నుకుంటారు.ఆ గ్రామంలో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,గ్రామ పంచాయతీకి ఆర్థికంగా సాయం చేసిన దాతకు కో ఆప్షన్ సభ్యుల కోటాలో అవకాశం కల్పిస్తారు. గ్రామ అభివృద్ధిలో కో ఆప్షన్ సభ్యుల సలహాలు, సూచనలు చేయవచ్చు. గ్రామాల్లో పోటా పోటీ.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్, సామాజిక వర్గం కలిసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరికొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్లు కో ఆప్షన్ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
న్యూస్ రీడర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : వీ6 చానల్ న్యూస్ రీడర్ వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మూసాపేట్‌లోని గూడ్స్‌షెడ్ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్ రెండో ఫ్లోర్ 204 ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికొస్తూనే అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బ్యాగులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ‘కేవలం నా డిప్రెషన్ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని నోట్లో రాసి ఉంది. ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్మెంట్లో నివాసముండేది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరి వేసుకొని విద్యార్థిని అత్మహత్య
-
పండుగ కోసం ఊరెళ్దామనుకుంది అంతలోనే..
-
యువతి దారుణ హత్య
-
ప్రాణంతీసిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాదం మరో యువతి ప్రాణాలు బలి తీసుకుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లేందుకు సెలవు పెట్టిన ఆమె.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. ఊరెళ్లేందుకు టికెట్లు తీసుకుని.. షాపింగ్ కూడా పూర్తి చేసింది.. ఎన్నో ఆశలతో ఇంటికి చేరుకున్న ఆమెను ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి మూసాపేట హబీబ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లావాసి బోను జానకి(24)గా, నిందితుడిని వికారాబాద్ జిల్లావాసి ఆనంద్ అలియాస్ అనంతప్ప(27)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ డీమార్ట్ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రేమించాలంటూ వేధింపులు.. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేస్తున్న రూపావతితో కలసి మూసాపేట హబీబ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన ఆనంద్ అలియాస్ అనంతప్ప(27) కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఆనంద్.. జానకితో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుగా తీసుకుని ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురాగా.. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో 15 రోజుల క్రితం డీమార్ట్ యాజమాన్యానికి, ఆనంద్ స్వగ్రామంలోని పెద్దలకు చెప్పటంతో అతడిని పిలిచి మందలించారు. ఇక నుంచి జానకితో మాట్లాడనని, మరిచిపోతానని ఆనంద్ చెప్పాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయటం ఇబ్బందిగా ఉంటుందని జానకిని కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని డీమార్ట్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా జానకికి వేధింపులు తప్పలేదు. ఆనంద్ సనత్‌నగర్‌లో విధులు ముగించుకుని.. కేపీహెచ్‌బీ డీమార్ట్ వద్దకు వచ్చి తనను ప్రేమించాలంటూ మళ్లీ వేధింపులు మొదలెట్టాడు. సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. సంక్రాంతి పండుగ కోసం బుధవారం సొంతూరు వెళ్లాలనుకున్న జానకి.. మంగళవారం నుంచి సెలవు తీసుకుని షాపింగ్ పూర్తి చేసి రూమ్‌కి చేరుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె గది దగ్గరకు వచ్చిన ఆనంద్.. గడియ తీసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కసితో జానకి గొంతు నులిమి.. రూమ్‌లోని కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. గది బయట గడియ వేసి పరారయ్యాడు. రూపావతి విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ జానకి కనిపించడంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రూపావతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానకి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్ వీడియో
హైదరాబాద్: అర్ధరాత్రి. సమయం 12:40. చిన్నారులు పూజ- చందులు చేతిలో చెయ్యివేసుకుని చిన్న గల్లీలోకి ఎంటర్ అయ్యారు. కొద్ది దూరం నడిస్తే ఇల్లొచ్చేస్తుంది. కానీ అంతలోనే ఓ వీధికుక్కల గుంపు వారికేసి గుర్రుమంది. ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం కుక్కలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దూసుకొచ్చి చుట్టుముట్టాయి. పెద్దవాళ్లుసైతం గజగజా వణికిపోయే ఆ పరిస్థితిలో చందూ సాహసం ప్రదర్శించాడు. కుక్కలను ఎదిరించి సురక్షితంగా బయటపడగలిగాడు. హైదరాబాద్‌లోని మూసాపేట్లో శనివారం రాత్రి చోటుచేసుకున ఈ సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లింటి నుంచి రెండు వీధుల అవతలుండే సొంతింటికి వెళ్లే క్రమంలో చందు, పూజలు ఇలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీధికుక్కల నుంచి రక్షణకల్పించాల్సిందిగా స్థానికులు పలుమార్లు వేడుకున్నా అధికారులు స్పందిచడంలేదు. -
అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్ వీడియో
-
జనపథం - మూసా పేట
-
నీట మునిగిన మూసాపేట..!
-
231 అడుగుల జాతీయ జెండా
కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట ప్రాంతంలోని వంశధార మోడల్ స్కూల్ విద్యార్థులు 231 అడుగుల (70 మీటర్ల) జాతీయ జెండాతో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆంజనేయ నగర్ నుంచి మూసాపేట వరకు ర్యాలీ సాగింది. శాసనసభ్యుడు మాదవరం కృష్ణారావు దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పన్నాల కావ్యహరీష్రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
మూసపేటలో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : కూకట్పల్లి సమీపంలోని మూసపేటలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతోపాటు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
మూసాపేట (హైదరాబాద్) : హైదరాబాద్ మూసాపేటలో ఏప్రిల్ 27వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గత నెల 27న ఒక యువకుడిపై గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితుడు పాలపాడ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
చిన్నారి మృతితో కలకలం
మూసాపేట: పాల డబ్బాలో కల్లు పోసి... చిన్నారితో తాగించి... అంతమొందించారనే అనుమానంతో తల్లిదండ్రులు, అమ్మమ్మలకు స్థానికులు దేహశుద్ధి చేశారు.అనంతరం వారిని శనివారం పోలీసులకు అప్పగించారు. కలకలం రేపిన ఈ సంఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వివరాలివీ.. మూసాపేట హరిజన బస్తీలో వెంకటేశ్, హేమలత, ఆమె తల్లి సుగుణ నివాసం ఉంటున్నారు. డిసెంబర్ 24న నిలోఫర్ ఆస్పత్రిలో హేమలత ఆడబ్డికు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా... శుక్రవారం రాత్రి అనారోగ్యంతో పాప చనిపోయిందని, జీహెచ్ఎంసి సిబ్బంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశామని ఈ కుటుంబ సభ్యులు స్థానికులకు చెప్పారు. అమ్మమ్మ చెత్త కుప్ప వద్ద కనిపించడంతో... పాపను చంపి, పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి దుస్తులు చెత్తకుప్పలో పడేసేందుకు వచ్చానని అమ్మమ్మ సుగుణ చెబుతున్న మాటలను వారు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానికులు చిన్నారి తల్లిదండ్రులు, అమ్మమ్మకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. దీనిపై అక్కడి వారి వాదన మరోలా ఉంది. ముగ్గురూ నిత్యం తాగి గొడవపడుతూ ఉండేవారని... చిన్నారి ఆలనాపాలనా చూసుకోలేదని ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా పాపకు తల్లి పాలు ఇవ్వకుండా... పాలడ బ్బాలో కల్లు పోసి తాగించే వారని అంటున్నారు. ఈ క్రమంలోనే కల్లు తాగించి... చిన్నారిని చంపేసి చెత్తకుప్పలో పడేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అంతేకాక ‘మా పాప మా ఇష్టం... ఇష్టం లేక చంపుకున్నాం. మీకెందుకు?’ అని సుగుణ ప్రశ్నించడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా... పాప అనారోగ్యంతోనే మృతిచెందినట్టు భావిస్తున్నామని తెలిపారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ మూసాపేటలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. మైసమ్మ చెరువుకు ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆదివారం మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
వేసున్న రైల్వేగేటు దాటితే.. జేబుకు చిల్లే!
-
ఎవడు చూసిన సాయి కుమార్
-
మూసాపేట్లో అగ్ని ప్రమాదం: ఎగిసపడుతున్న అగ్నికీలలు
నగరంలోని మూసాపేట రైల్వేట్రాక్ పక్కనే ఉన్న షెడ్లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. దాంతో స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని కీలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే షెడ్లో అగ్ని ప్రమాదం సంభవించడానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.