
హైదరాబాద్, సాక్షి: నగరంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరో నిండు జీవితాన్ని బలిగొంది. మూసాపేట వై జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలిని మౌనికగా పోలీసులు నిర్ధారించారు. స్కూటీపై వెళ్తున్న మౌనికను వేగంగా వచ్చిన ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఝామ్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment