
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
మూసాపేట (హైదరాబాద్) : హైదరాబాద్ మూసాపేటలో ఏప్రిల్ 27వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గత నెల 27న ఒక యువకుడిపై గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో నిందితుడు పాలపాడ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.