
బెంగళూరు(కర్ణాటక) : ఓ బార్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ లోని కైలాష్ బార్ లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment