
ప్రతీకాత్మక చిత్రం
శివాజీనగర(బెంగళూరు): నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న బార్‌పై సీసీసీ పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 64 మంది మహిళలను కాపాడారు. నగరంలోని ఉప్పార పేటలో బార్‌లో డీజే పెట్టి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ( చదవండి: టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి? )
మరో ఘటనలో..
క్రికెట్ బెట్టింగ్.. వ్యక్తి అరెస్ట్
బనశంకరి: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి రూ. లక్షకు పైగా నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వినోబానగర్‌లో నవాజ్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment