బెంగళూరులో పేలుడు.. ముగ్గురు దుర్మరణం | Bengaluru Godown Blast: Three People Dead | Sakshi
Sakshi News home page

Godown Blast: బెంగళూరులో పేలుడు.. ముగ్గురు దుర్మరణం

Published Thu, Sep 23 2021 1:54 PM | Last Updated on Thu, Sep 23 2021 2:41 PM

Bengaluru Godown Blast: Three People Dead - Sakshi

బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్రం బెంగళూరులోని పేలుడు చోటుచేసుకుంది. చామరాజపేటలోని ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ గోడౌన్‌లో జరిగిన భారీ పేలుడులో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మంటలను ఆర్పడానికి ఆగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఈ పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం తెలియరాలేదని డీసీపీ (దక్షిణ) హరీష్ పాండే పేర్కొన్నారు. కంపెనీ పేలుడు పదార్థాన్ని రవాణా చేసినట్లు తెలుస్తోందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement