సాక్షి,ముంబై: దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబై సోమవారం ఉదయం మరో అగ్నిప్రమాదంతో ఉలిక్కి పడింది. ముంబై సెషన్స్ కోర్టులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఆందోళనకు గురిచేసింది. కోర్టు భవనంలోని మూడో అంతస్థులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీనికిగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారి చెప్పారు.
సౌత్ ముంబై యూనివర్సిటీ ప్రాంగణానికి సమీపంలోని కోర్టు భవనంలో నేటి ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్ని మాపక విభాగానికి సమాచారం అందించారు. దాదాపు అయిదు ఫైర్ ఇంజీన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తూ తాజా సమాచారం ప్రకారం ఇంకా కోర్టు కార్య కలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా గత 20 రోజుల్లో నగరంలో ఇది ఐదో అగ్ని ప్రమాదం. డిసెంబర్ 18 న ముంబైలోని సకి నాకా-కుర్లా ప్రాంతంలో ఒక చిరుతిండి దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పన్నెండు మంది మృతి చెందారు. డిసెంబరు 29 న కమలా మిల్స్ ఆవరణలో ప్లబ్‌ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. జనవరి 4 న జరిగిన మరొక సంఘటనలో, ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనవరి 6న సినీ విస్తా స్టూడియో ప్రమాదంలో టెలివిజన్ సీరియల్ ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి(20) చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment