session court
-
భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: తన జల్సాలకు అడ్డుపడుతున్న భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డి.లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పారు. 2016 నవంబర్ 23న కొత్తపేట (టూ టౌన్) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన అప్పట్లో నగర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన జమలమ్మకు జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ఏడుకొండలు(32)కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు జమలమ్మ చెడు వ్యసనాలకు బానిసైంది. వీటిపై ప్రశ్నిస్తున్న భర్త ఏడుకొండలును అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయాన్ని తన చెల్లెలు లక్ష్మికి వివరించింది. అదే గ్రామంలో హత్య చేస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో కాపురాన్ని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.నైనవరం గ్రామానికి మార్చింది. అంబాపురంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించిన రోజునే చెల్లెలు లక్ష్మి, న్యూఆర్‌ఆర్ పేటకు చెందిన ఒడియార్ గణేష్, జక్కంపూడికి చెందిన బాలసాని తిరుపతి సాయంతో జమలమ్మ తన భర్త ఏడుకొండలు మెడకు తాడు చుట్టి చంపేసిందని పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి వస్తున్న దుర్వాసను పసిగట్టిన ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జమలమ్మకు కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. మిగిలిన నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. (చదవండి: పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!) -
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
గర్భస్రావమయ్యేలా దాడి.. భర్త, బంధువులకు జైలుశిక్ష
మైసూరు: గర్భిణిపై దాడి చేసి గర్భపాతానికి కారణమైన ఐదుమందికి మైసూరు ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్షను విధించింది. నంజనగూడు తాలూకాలోని హొసకోటె గ్రామానికి చెందిన భర్త మహేశ్, అత్త చిక్క కుసుమ, బంధువులు కుసుమ, కాంతరాజు, మహాదేవమ్మ జైలు శిక్ష పడిన వారు. భార్య పుట్టసౌమ్యను మరింత కట్నం తేవాలని భర్త మహేష్, ఇతర బంధువులు వేధించేవారు. 2015 ఫిబ్రవరి 7వ తేదీన పుట్ట సౌమ్య ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తెలిపారు. నాకు చెప్పకుండా ఎందుకు ఆస్పత్రికి వెళ్లావు అని మహేశ్ బంధువులు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడే గర్భస్రావమైంది. దాంతో బాధితురాలు బదవనాళు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. కోర్టు విచారణలో మహేశ్అ త్తమామల నేరం రుజువైంది. దీంతో జడ్జి మల్లికార్జున దోషులకు తలా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.22 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
Navneet Rana: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్
ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సెషన్స్ కోర్టు. సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ తరుణంలో ఏప్రిల్ 23వ తేదీన ఖర్ స్టేషన్ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ముంబై సెషన్స్ కోర్టు.. మీడియాతో మాట్లడవద్దని నవనీత్ కౌర్ దంపతులను ఆదేశించింది. చదవండి: ఎస్సీ కావడంతో నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు: నవనీత్ కౌర్ -
అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!: రూ.13 లక్షల బంగారం.. రూ. 8 కోట్లుగా తిరిగొచ్చింది!
Mumbai Police returns family's stolen gold worth ₹8 cr: నిజానికి దొంగలపాలైన సొమ్ము దొరకడం చాలా కష్టం. చాలా మటుకు పోలీసులు విచారించిన మన సొత్తు మనకు తిరిగి లభించడం అనేది అత్యంత అరుదు. అలాంటిది కోట్లు ఖరీదు చేసే సొమ్ము ఐతే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. దొరికే అవకాశం ఉంటుందనే ఊహ కూడా ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జున్ దాస్వానీ కుటుంబం పై ఒక ముఠా కత్తులతో దాడి చేసింది. అతన్ని అతని భార్యను తాళ్లతో కట్టేసి ఆ ముఠా రూ.13 లక్షల విలువైన బంగారాన్ని దొంగిలించింది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. 1998లో ఆ సొత్తు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1999లో విచారణలో ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ డబ్బు పోలీసుల ఆధీనంలోనే ఉంది.కానీ ఆ కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన సెషన్ కోర్టు.. ఫిర్యాదుదారునికి సొత్తు ఇవ్వకుండా సుమారు 19 ఏళ్లుగా నిరీక్షించేలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సొత్తును షరుతులతో కూడిన నిబంధనలకు లోబడి అందజేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని ఆస్తికి సంబంధించిన బిల్లులను సమర్పించి తమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతం అయిన ఆ ఆస్తి విలువ కాస్త ఇప్పుడు రూ 8 కోట్లు పైనే కావడం విశేషం. (చదవండి: అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!) -
‘శరవణ’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ‘శరవణ భవన్’ హోటళ్ల యజమాని పి.రాజగోపాల్ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని సెషన్‌కోర్టులో లొంగిపోయారు. దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్ ఓ హత్య కేసులో దోషి. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. 2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది. -
నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
-
నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు
సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు. -
ముంబైని వణికిస్తున్న అగ్ని ప్రమాదాలు
సాక్షి,ముంబై: దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబై సోమవారం ఉదయం మరో అగ్నిప్రమాదంతో ఉలిక్కి పడింది. ముంబై సెషన్స్ కోర్టులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఆందోళనకు గురిచేసింది. కోర్టు భవనంలోని మూడో అంతస్థులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీనికిగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారి చెప్పారు. సౌత్ ముంబై యూనివర్సిటీ ప్రాంగణానికి సమీపంలోని కోర్టు భవనంలో నేటి ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్ని మాపక విభాగానికి సమాచారం అందించారు. దాదాపు అయిదు ఫైర్ ఇంజీన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తూ తాజా సమాచారం ప్రకారం ఇంకా కోర్టు కార్య కలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా గత 20 రోజుల్లో నగరంలో ఇది ఐదో అగ్ని ప్రమాదం. డిసెంబర్ 18 న ముంబైలోని సకి నాకా-కుర్లా ప్రాంతంలో ఒక చిరుతిండి దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పన్నెండు మంది మృతి చెందారు. డిసెంబరు 29 న కమలా మిల్స్ ఆవరణలో ప్లబ్ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. జనవరి 4 న జరిగిన మరొక సంఘటనలో, ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనవరి 6న సినీ విస్తా స్టూడియో ప్రమాదంలో టెలివిజన్ సీరియల్ ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి(20) చనిపోయాడు. -
‘ఓబులేసు’ బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ‘అరబిందో ఫార్మా’ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపేందుకు యత్నించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మంగళవారం కొట్టివేశారు. ఓబులేసుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందని, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలబుచ్చయ్య కోర్టు దృష్టికి తెచ్చారు. అభియోగాలు నమోదు చేస్తే రోజూ వారీ పద్దతిలో తుది విచారణ (ట్రయల్) చేపట్టేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. ఈ వాదనతో సెషన్స్ జడ్జి ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.