Mumbai Police returns family's stolen gold worth ₹8 cr: నిజానికి దొంగలపాలైన సొమ్ము దొరకడం చాలా కష్టం. చాలా మటుకు పోలీసులు విచారించిన మన సొత్తు మనకు తిరిగి లభించడం అనేది అత్యంత అరుదు. అలాంటిది కోట్లు ఖరీదు చేసే సొమ్ము ఐతే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. దొరికే అవకాశం ఉంటుందనే ఊహ కూడా ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే....ముంబైలోని ప్రముఖ చరగ్ దిన్ వ్యవస్థాపకుడు అర్జున్ దాస్వానీ కుటుంబం పై ఒక ముఠా కత్తులతో దాడి చేసింది. అతన్ని అతని భార్యను తాళ్లతో కట్టేసి ఆ ముఠా రూ.13 లక్షల విలువైన బంగారాన్ని దొంగిలించింది. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. 1998లో ఆ సొత్తు మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1999లో విచారణలో ఆ ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే ఈ కేసుకి సంబంధించిన మరో ముగ్గురు నిందుతులు పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ డబ్బు పోలీసుల ఆధీనంలోనే ఉంది.కానీ ఆ కేసులో పెద్దగా పురోగతి లేకపోవడంతో సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన సెషన్ కోర్టు.. ఫిర్యాదుదారునికి సొత్తు ఇవ్వకుండా సుమారు 19 ఏళ్లుగా నిరీక్షించేలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు సొత్తును షరుతులతో కూడిన నిబంధనలకు లోబడి అందజేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్జన్ దాస్వానీ కొడుకు రాజు దాస్వాని ఆస్తికి సంబంధించిన బిల్లులను సమర్పించి తమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత సొంతం అయిన ఆ ఆస్తి విలువ కాస్త ఇప్పుడు రూ 8 కోట్లు పైనే కావడం విశేషం.
(చదవండి: అక్కడ తండ్రులు వ్యాక్సిన్‌లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!)
Comments
Please login to add a commentAdd a comment