Mass Shooting at a Bar in South Africa Johannesburg More Than 10 People Dead - Sakshi
Sakshi News home page

South Africa: తుపాకులతో రెచ్చిపోయిన ముఠా.. 14 మంది మృతి

Published Sun, Jul 10 2022 1:19 PM | Last Updated on Sun, Jul 10 2022 2:37 PM

Mass Shooting at a Bar in South Africa Johannesburg More Than 10 People Dead - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌:  దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్‌లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని,  ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్‌లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement