south africa
-
మీరు జీవితకాల ప్రేమ పొందారు: యూపీ పోలీసు వినూత్న ట్వీట్
లక్నో: భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడిచింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండో టీ20 ప్రపంచ కప్‌ను అందుకుంది. భారత్ టీ 20 ప్రపంచం కప్ సాధించటంతో ప్రధాని మోదీ నుంచి మొదలు.. సెలబ్రిటీలు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. యూపీ పోలీసులు.. తమ ‘ఎక్స్’అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.‘బ్రేకింగ్ న్యూస్.. భారత జట్టు బౌలర్లు దక్షిణాఫ్రికా హృదయాలను బద్దలు కొట్టడంలో దోషులుగా మిగిలారు. అలాగే భారత్‌లోని బిలియన్ క్రికెట్ అభిమానుల నుంచి జీవితకాల ప్రేమను పొందారు!’ అని పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగా చెప్పారు. భారత జట్టు బిలయన్ అభిమాను జీవితం కాలం పొందారు’అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 𝑩𝒓𝒆𝒂𝒌𝒊𝒏𝒈 𝑵𝒆𝒘𝒔: Indian bowlers found guilty of breaking South African hearts.𝑺𝒆𝒏𝒕𝒆𝒏𝒄𝒆: Lifelong love from a billion fans! ❤️🏏 #INDvSAFinal#T20WorldCupFinal pic.twitter.com/UPaCzgf6vm— UP POLICE (@Uppolice) June 29, 2024 -
విరాట్ కోహ్లి నాపై ఉమ్మేశాడు.. రెండేళ్ల తర్వాత: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఓ పోడ్కాస్ట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి భారత పర్యటనలో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని ఎల్గర్ ఆరోపించాడు. ఆ సంఘటన జరిగిన రెండు ఏళ్ల తర్వాత కోహ్లి తనకు క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ తెలిపాడు. కాగా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన ఎల్గర్.. 2015 తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో విరాట్ కోహ్లి టీమిండియా ఫుల్‌టైమ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. "అది భారత్‌లో నా తొలి పర్యటన. మొదటి టెస్టులో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. విరాట్ కోహ్లిని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలి సారి. అక్కడ పిచ్‌ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఆ వికెట్‌పై ఆడటం నాకు పెద్ద సవాలుగా మారింది. టర్నింగ్ వికెట్‌పై అశ్విన్, జడేజాను ఎదుర్కొవడం కష్టంగా మారింది. అంతేకాకుండా వారిద్దరూ నన్ను స్లెడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో కోహ్లి నాపై ఉమ్మివేశాడు. వెంటనే నా బాషలో ఓ అసభ్య పదజాలం వాడి బ్యాట్‌తో కొడతానని అన్నాను. నేను మాట్లాడిన బాష కోహ్లి అర్ధమైంది అనుకునున్నాను. ఎందుకంటే అప్పటికే అతడు ఐపీఎల్లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. నేను బూతు పదం వాడిన తర్వాత కోహ్లి కూడా అదే పదాన్ని వాడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. అతడు అరుస్తునే ఉంటాడని పట్టించుకోవడం మానేసాను. ఎందుకంటే మేము భారత్‌లో ఉన్నాము కాబట్టి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఎబి డివిలియర్స్ సైతం కోహ్లిని ప్రశ్నించాడు. అనంతరం రేండేళ్ల తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లి నాకు ఫోన్ చేశాడు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. నేను అందుకు అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం డ్రింక్ చేస్తునే ఉన్నామని'బాంటర్ విత్ బాయ్స్' అనే ఈ పోడ్ కాస్ట్లో ఎల్గర్ పేర్కొన్నాడు. -
వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న నోర్జే కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా నోర్జే గాయపడ్డాడు. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను వెంటనే జొహన్నస్‌బర్గ్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ పంపింది. ఈ క్రమంలో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. కాగా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటిస్ జట్టులో నోర్జే కూడా భాగంగా ఉన్నాడు. నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ మెగా టోర్నీకి ఎంపికైన ప్రోటీస్ పేసర్ సిసంద మగల సైతం మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే అతడు వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక మెగా ఈవెంట్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పాపా’ అంటూ! -
Pak Vs SA: పరిగెత్తడంలో బద్దకం; రెండుసార్లు తప్పించుకొని చివరకు
టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలిసారి బ్యాటింగ్‌లో కాస్త మెరిశాడు. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చాలా రోజుల క్రితమే ఫామ్ కోల్పోయిన బవుమా గురువారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. బవుమా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బవుమా ఇబ్బందిగానే కనిపించాడు. ముఖ్యంగా పరుగులు తీయడంలో బద్దకించాడు. ఫలితంగా రెండుసార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న బవుమా మరో రెండు బౌండరీలు బాదాడు. అయితే చివరకు షాదాబ్ ఖాన్‌కు దొరికిపోయాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేసిన బవుమా రిజ్వాన్‌కు క్యాచ్‌కు ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమాయానికి సౌతాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా 9 ఓవర్లు ముగిసేసరికి 84 పరుగులు చేయాలి. కానీ 15 పరుగులు ప్రొటిస్ వెనుకబడి ఉంది. వర్షం పాకిస్తాన్‌కు మేలు చేయనుంది. మ్యాచ్ రద్దు అయితే మాత్రం సౌతాఫ్రికా ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు. చదవండి: మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? పాక్ తరపున రెండో బ్యాటర్‌గా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కారును చుట్టుముట్టిన దొంగలు.. సింహంలా పోరాడిన వ్యక్తి.. వీడియో వైరల్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. ముఠాలుగా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అయితే ఓ వ్యక్తి దొంగల బారి నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు. ముసుగులు ధరించిన దొంగల ముఠా ఆయన కారును చుట్టుముట్టగా.. కత్తితో వారిని హడలెత్తించాడు. ఓ దొంగను దాదాపు పొడిచినంత పని చేశాడు. అతని తెగువను చూసి దొంగలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. “But why would I need a gun in South Africa” pic.twitter.com/po6zq83e7p — Roman Cabanac (@RomanCabanac) July 20, 2022 ఓవైపు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం గన్ లెసెన్సులు జారీ చేయకుండా చట్టాన్ని తేవాలని ఆలోచిస్తున్న సమయంలో.. ఈ దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుటుంబం కోసం వీరోచితంగా పోరాడిన సదరు వ్యక్తి ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా గన్ లెైసెన్స్ అంశంపై చర్చిస్తున్నారు . ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గన్ ఉంటే బాగుండేదని, అందుకే ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్సులు జారీ చేయాలనే డిమాండ్ వినపడుతోంది. మరోవైపు అమెరికాలో గన్ కల్చర్ వల్ల మాస్ షూటింగ్‌లు జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ వయోజనులందరికీ అధికారికంగా తుపాకుల పొందేందుకు అనుమతి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇదిలాఉండగా.. జులై 10న జొహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఓ బార్లో దుండగుల ముఠా అర్ధరాత్రి తుపాకులతో రెచ్చిపోయి 14 మందిని చంపిన విషయం తెలిసిందే. చదవండి: యుద్ధ ట్యాంకర్లతో జనాలను భయపెడుతూ.. మళ్లీ మారణహోమం తప్పదా?! -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్దు.. ప్రపంచకప్ రేసు నుంచి దక్షిణాఫ్రికా ఔట్..?
-
బార్లో అర్ధరాత్రి కాల్పులు.. 14 మంది మృతి..
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్‌పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
India Test Record In South africa: దక్షిణాఫ్రికాతో తొలి పోరుకు భారత్ సిద్దమైంది. ఆదివారం( డిసెంబర్26) నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్(బ్యాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈ క్రమంలో తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ నేపథ్యంలో సఫారీ గడ్డపై భారత్ సాధించిన రికార్డులెంటో ఓ లుక్కేద్దాం. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు సాధించిన టెస్టు విజయాల సంఖ్య. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడింది. 10 టెస్టుల్లో ఓడిపోయి, ఏడు టెస్టులను ‘డ్రా’ చేసుకుంది. ► దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు టెస్టు విజయాలను అందించిన కెప్టెన్లు. 2006లో రాహుల్ ద్రవిడ్... 2010లో ధోని... 2018లో విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు ఒక్కో టెస్టులో విజయం రుచి చూసింది. ► సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా గెలిచిన టెస్టుల సంఖ్య. ఈ వేదికపై దక్షిణాఫ్రికా మొత్తం 26 టెస్టులు ఆడింది. రెండు టెస్టుల్లో ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు సెంచూరియన్‌లో గతంలో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది. చదవండి: Hardik Pandya: అభిమానితో హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్ -
షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..
దక్షిణాఫ్రికా: స్కై డ్రైవింగ్‌లు గురించి వినే ఉంటాం. ఇలాంటి స్కై డ్రైవింగ్‌లు భయం కలిగించే అత్యద్భుతమైన ధైర్య సాహసాలతో చేసే ఒక అరుదైన విన్యాసం. కానీ ఒక్కోసారి ఈ విన్యాసాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడొక దక్షిణాప్రికా బృందం చేసిన స్కైడ్రైవింగ్ చూస్తే చాలా భయం వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) ఈ వీడియోలో ..మొదట ఆ బృందం అంతా విమానంలో ఆకాశంలో ఒక చోట ఈ విన్యాసం చేయడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ మేరకు అక్కడే ఆకాశంలో ఒక చోట గాలిలో విమానాన్ని నిలిపి నెమ్మదిగా విమానం డోర్ తీసి ఒకేసారి జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. వారు అనుకున్న విధంగా అందరూ ఒకేసారి 16 వేల అడుగుల ఎత్తులోంచి జంప్ చేస్తారు. అయితే వారు జంప్ చేసి విధానం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృందం అంతా ఒకేసారి దూకడంతో విమానం ఒక్కసారి స్పిన్ అయిపోయి అదుపుతప్పినట్టుగా వెళ్లుతుంది. పైగా ఒక దశలో విమానిం కిందకి వెళ్లే క్రమంలో వాళ్లపైకి దూసుకొస్తున్నట్లుగా ఉంటుంది. అదృష్టమేమిటంలే ఎవర్ని ఢీ కొట్టకుండా ఆ విమానం కాసేపటికి నిధానంగా కిందకి ల్యాండ్ అవ్వడానికి వెళ్లిపోతుంది. అయితే జంప్ చేసిన 9 మంది బృంద సభ్యులు ఒక్కసారిగా చెల్లచెదురైనా మళీ అంతా భలే చక్కగా ఒకరిని ఒకరు పట్టుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు. ఈ మేరకు ఈ 9 మంది బృంద సభ్యులు ఏవియేషన్ విద్యలో భాగంగానే ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారు. అయితే కొంతసేపటికి ఆ బృందం సురక్షితంగా కిందకి ల్యాండ్ అవుతారు. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
కరీబియన్ల పై ప్రతీకారం తీర్చుకున్న సఫారీలు..
గ్రెనడా: వెస్టిండీస్ చేతిలో తొలి టీ20 ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. గ్రెనడా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు టీ20ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మెదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్ హెండ్రిక్స్ (42), కెప్టెన్ బవుమా (46) డికాక్(26) మెరుగైన స్కోర్లు నమోదు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ రెండు, హోల్డర్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ఆనంతరం 167 పరుగల లక్ష్యంతో బరి లోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లావిస్ (21), ఫ్లెచర్ (35) శుభారంభం ఇచ్చినా.. మిడిలార్డర్లో క్రిస్‌గేల్ (8), నికోలస్ పూరన్ (9), కీరన్ పొలార్డ్ (1), ఆండ్రీ రసెల్ (5) తేలిపోయారు. మధ్యలో ఫ్యాబియన్ అలెన్ సిక్స్‌లు, ఫోర్లుతో కాసేపు సఫారీలను కంగారు పెట్టినా వరస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కరీబియన్లకి 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టులో రబాడకి మూడు వికెట్లు దక్కగా.. లిండేకి రెండు, లుంగి ఎంగిడి, నార్జ్, షంషీకి ఒక్కో వికెట్ పడ్డాయి. ఈ మ్యాచ్ లో రెండు కీలక మైన వికెట్లు పడగొట్లిన జార్జ్ లిండే కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది చదవండి: India Tour Of Sri Lanka: శ్రీలంకకు బయల్దేరిన భారత జట్టు ఇదే! -
వైజాగ్ టెస్టులో సరికొత్త వరల్డ్ రికార్డు
విశాఖ: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడ జరిగిన తొలి టెస్టు పలు రికార్డులకు వేదికైంది. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించి ఆ ఫీట్ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధిస్తే, భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 350వ టెస్టు వికెట్లను 66వ టెస్టులోనే సాధించి అత్యంత వేగవంతంగా ఆ ఘనతను అందుకున్న జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా టెయిలెండర్ బ్యాట్స్‌మన్ పీయుడ్త్ 10 వస్థానంలో బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా భారత్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా తరఫున ఆ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.(ఇక్కడ చదవండి: రెండో సెషన్లోనే దక్షిణాఫ్రికా ‘ఖేల్’ ఖతం) ఇదిలా ఉంచితే, వైజాగ్ టెస్టులో మరో రికార్డు నమోదైంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 37 సిక్సర్లు సాధించాయి. ఫలితంగా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన రికార్డు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య లిఖించబడింది. 2014-15 సీజన్లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులో 35 సిక్సర్లు రికార్డు ఇప్పటివరకూ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా-దక్షిణాఫ్రికాలు బ్రేక్ చేశాయి. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు సాధిస్తే, దక్షిణాఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన సిక్సర్లు 14 కాగా, దక్షిణాఫ్రికా 3 సిక్సర్లకే పరిమితమైంది. రవీంద్ర జడేజా వేసిన 35 ఓవర్లో పీయడ్త్ సిక్స్‌ను కొట్టడం ద్వారా పాకిస్తాన్-న్యూజిలాండ్‌ల పేరిట ఉన్న 35 సిక్సర్ల రికార్డు బద్ధలైంది. కాగా, చివర్లో రబడా సిక్స్ కొట్టడంతో మ్యాచ్‌లో సిక్సర్ల సంఖ్య 37కు చేరింది. -
బంగారు రంగు చిరుతను చూశారా!
చిరుత పులి పేరు వినగానే మనకు తెలుపు, నలుపు, గోధుమ రంగు వర్ణంలో ఉంటుందని తెలుసు. మన ఊహే కాదు.... వాస్తవంగా కూడా చిరుత పులి అలాగే వుంటుంది కదా అనుకుంటున్నారా? అయితే ఫేస్బుక్లో వైరల్‌గా మారిన ఈ చిరుత ఫోటోలు చూసేయండి మరి. స్ట్రాబెర్రి పండు చారలతో బంగారు వర్ణంలో ఉన్న అరుదైన ఈ చిరుత పేరు స్ట్రాబెర్రి లిమోపార్డ్ లేదా ఎరిథ్రిస్ట్రక్. ఇది ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత. దక్షిణాఫ్రికాకు చెందిన అలాన్ వాట్సాన్ అతని భార్య లిన్సే,బ్లాక్ లిపార్డ్ మౌంటైన్ లాడ్జ్ దీన్ని వారి కెమెరాలో బంధించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిరుత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాదాపు 3 వేలకు పైగా కామెంట్లు, రెండు వేలకు పైగా షేర్లు వచ్చాయి. ‘నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అరుదైన రంగు చిరుత’ అని వాట్సాన్ ఓ పత్రికతో తెలిపాడు. వివిధ జాతి పులులు అంతరించిపోతున్న సమయంలో ‘మేము నమ్మశక్యంగా లేని అరుదైన రంగు చిరుతను చూశామంటూ ఆ జంట ఫేస్ బుక్‌లో వారి అనుభవాన్ని పంచుకున్నారు. చనిపోయిన జిరాఫీ కళేబరాన్ని తింటున్న చిరుత ఫొటోలకు నెటిజన్లంతా ‘నేను ఇంతకు ముందు ఇలాంటి చిరుతను చూడలేదు’, ‘అద్భుతమైన ఫొటో ఇది.. దీనిని షేర్ చేసినందుకు ధన్యవాదాలు’, ‘ ఇలాంటి అరుదైన రంగు, జాతి జంతువులను సురక్షితంగా ఉంచండి’ అంటూ చిరుత పులి(ఎరిథ్రిస్ట్రక్) పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు. -
దక్షిణాఫ్రికాలో వైఎస్ఆర్సీపీ జెండాతో బంగీజంప్
-
ఉదయం రికార్డు సాయంత్రం బద్దలు...
టాంటన్: ముక్కోణపు మహిళల టి20 క్రికెట్ టోర్నీలో ఒకే రోజు రెండు అత్యధిక స్కోర్ల రికార్డులు నమోదయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (209/4; ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. కివీస్ కెప్టెన్ సుజీ బేట్స్ (66 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. సోఫియా డివైన్ ( 73; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి మహిళల టి20ల్లో ఏ వికెట్ౖకైనా అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. టామీ బ్యూమోంట్ సెంచరీ... న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత సాయంత్రం ఇంగ్లండ్ తో దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ జట్టులో టామీ బ్యూమోంట్ (52 బంతుల్లో 116; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించింది. -
ఇలాంటి కసాయి తండ్రిని చూసుండరు..
పోర్ట్ ఎలిజెబెత్(దక్షిణాఫ్రికా) : తమ పిల్లలకు కష్టమొస్తే తల్లడిల్లి పోయే తండ్రులను చూసుంటారు.. తాము కష్టాలపాలైనా పిల్లలు సుఖంగా ఉంటే చాలనుకునే నాన్నలను చూసుంటారు.. కానీ ఈ తండ్రి అందుకు పూర్తి భిన్నం. కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆరు నెలల కూతురిని ఇంటిపై నుంచి విసిరేశాడు. అదృష్టం బాగుండి పాపను పోలీసులు కిందపడకుండా పట్టుకోవడంతో ఎలాంటి గాయాలు లేకుండా బతికి పోయింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజెబెత్ సమీపంలో ఉన్న క్వాడ్‌వేసి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. క్వాడ్‌వేసి పట్టణంలోని జాయ్ స్లోవో టౌన్ షిప్లో అక్రమంగా నిర్మించిన 90 ఇళ్లను కూల్చాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయం అక్కడ ఉంటున్న వారికి తెలియడంతో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇళ్లను కూల్చొద్దంటూ నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారలు టైర్లు కాల్చి, రహదారులను నిర్భందించి పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి తన కూతురిని తీసుకుని తాను ఉంటున్న ఇంటిపైకి ఎక్కాడు. పోలీసులు వెనక్కి వెళ్లకపోతే పాపను కింద పడేస్తానని బెదిరించాడు. అతడితో పోలీసులు జరిపిన చర్చలు విఫలమవడంతో తన కూతురిని కిందకు పడేశాడు. అదృష్టవశాత్తు కిందున్న పోలీసులు పాపను పట్టుకోవడంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. కూతుర్ని ఇంటిపై నుంచి కిందకు పడేసిన కసాయి తండ్రిని హత్యాయత్నం కేసు కింద పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి కోసం పాపను బలి చేయాలనుకున్న ఆ తండ్రిపై నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. -
తప్పుడు నాయకుడు
అనూహ్యం... అసాధారణం... ఒక అగ్రశ్రేణి జట్టు కెప్టెన్ తాము కావాలనే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని, ఇదంతా వ్యూహంలో భాగంగా తాము తీసుకున్న సమష్టి నిర్ణయమని ప్రకటించడం! క్రీడాస్ఫూర్తి అనే పదానికి ఎప్పుడూ మైళ్ల దూరంలో ఉండే ఆస్ట్రేలియా మరోసారి తన అథమ స్థాయి తెలివితేటలను బయట పెట్టుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు తప్పుడు పని చేయాలనుకోవడమే నేరం కాగా... ఒక యువ ఆటగాడిని అందుకోసం బలి పెట్టే ప్రయత్నం చేయడం నిజంగా క్షమించరానిది. పైగా తాను బాధ్యత తీసుకుంటున్నానని, అయితే కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోనంటూ మళ్లీ బుకాయింపు కూడా. సరిగ్గా ఏడాది క్రితం భారత్‌తో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్ నుంచి రివ్యూ విషయంలో రచ్చ చేసి ‘తన బుర్ర పని చేయలేదని’ అంగీకరించిన స్మిత్, కోచ్ లీమన్ మార్గనిర్దేశనంలోనే ఇప్పుడు అలాంటి సీక్వెల్ తయారు కావడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద సంచలనం. కేప్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ వివాదాలు కొత్త కాదు. రివర్స్ స్వింగ్‌ను రాబట్టేందుకు ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఘటనలు అనేకం. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాము కావాలని చేయలేదనే వివరణ ఇస్తూ ఒక క్షమాపణతో, చిన్నపాటి శిక్షతో వారంతా బయటపడిపోయారు. కానీ తాజా ఘటనకు ఆ పాపాల జాబితాలో అగ్రస్థానం దక్కుతుంది. క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మన్వంటి ఆటగాళ్ల ఆత్మలు కూడా సిగ్గుతో తలదించుకునే స్థితి ఇది. ప్రత్యర్థిని అడ్డుకోలేక ఒక కెప్టెన్ అంత పచ్చిగా ట్యాంపరింగ్‌ను ఆశ్రయించడం ఊహకు అందనిది. పైగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడమంటూ తన సహచరుల్లో ఒకరిని పురమాయించాడు. ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్ ఒప్పుకున్నాడు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను’ అని స్మిత్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. అతని ప్రతీ మాటలో అపరాధ భావం కనిపించింది. వీడియో ఫుటేజీలో తాము పట్టుబడకపోయినా జరిగిన సంఘటన పట్ల తాను బాధ పడేవాడినని అతను చెప్పాడు. ‘మేమందరం కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమిది. ఇందులో కోచ్‌ల పాత్ర ఏమీ లేదు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. నా నాయకత్వంలో ఇలాంటిది మొదటిసారి జరిగింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్ అని తెలుసు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బంతి బాగా రివర్స్ అయింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేశాం. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటిది జరగనివ్వను’ అని స్మిత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా తన అవసరం ఆసీస్ జట్టుకు ఉందని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను చేసింది చాలా పెద్ద తప్పని, అయితే మున్ముందు దీని నుంచి తాను నేర్చుకుంటానన్న స్మిత్... ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు. లంచ్ సమయంలో మేం దీనిపై చర్చించాం. ట్యాంపరింగ్ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు. – బెన్‌క్రాఫ్ట్ -
‘కేప్‌టౌన్’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం
జొహన్నెస్‌బర్గ్: తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్‌టౌన్‌కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. గత శనివారం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు ‘గివర్స్ ఫౌండేషన్’కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్‌టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు. -
అందుకే ఇది 80 శాతం ప్రదర్శన
సఫారీలతో సిరీస్ ముగిశాక తమ సామర్థ్యంలో 80 శాతమే కనబర్చామని ప్రకటించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి... సాధ్యమైనంత త్వరగా 100 శాతం ఆటను ప్రదర్శించేలా బాజా మోగించాడు. దక్షిణాఫ్రికాపై ప్రత్యేకించి పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో భారత్ అన్ని విభాగాల్లో సొంత సామర్థ్యాన్ని నమ్ముకుని అవసరమైన సందర్భాల్లో ఉత్తేజకరమైన ఆట కనబరిచింది. ఇదే పనిని ప్రత్యర్థి చేయలేకపోయింది. టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో లోయరార్డర్‌తో పెద్దగా పని పడలేదు. ప్రారంభంలో, చివర్లో పరుగులు ఇవ్వకుండా కొత్త బంతి బౌలర్లు ప్రొటీస్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. మధ్య ఓవర్లలో స్వేచ్ఛగా ఆడదామనుకుంటే మణికట్టు స్పిన్నర్లు ఆశ్చర్యానికి గురిచేశారు. కుల్దీప్, చహల్‌లు వారిని తప్పుదారి పట్టించి పాఠశాల స్థాయి క్రికెటర్లుగా మార్చేశారు. ఈ ఇద్దరి మాయాజాలం, ధైర్యం, అద్భుత ఆత్మవిశ్వాసంతో భారత్ మున్ముందు టెస్టుల్లోనూ మరిన్ని విజయాలు సాధించగలదు. టెస్టు సిరీస్ ఓటమిని ప్రస్తావిస్తే... మన జట్టు రెండు టెస్టుల్లో మూడో ఇన్నింగ్స్ వరకూ పోటీలోనే ఉంది. సరైన ప్రారంభం దక్కక, మిడిలార్డర్లో రహనే లేకపోవడంతో నాలుగో ఇన్నింగ్స్‌లో మాత్రమే విఫలమైంది. ఈ రెండు సార్లూ కోహ్లి రాణించకపోవడమూ ప్రభావం చూపింది. జొహన్నెస్‌బర్గ్‌లో లిఫ్ట్‌లో వెళ్తుండగా నాకు ఆజానుబాహులైన రగ్బీ ఆటగాళ్లు తారసపడ్డారు. కోహ్లికి, మిగతా 21 మంది ఆటగాళ్ల మధ్య సామర్థ్యం, దృక్పథం విషయంలో సరిగ్గా ఇదే తీరున తేడా కనిపించింది. టీమిండియా గతంలో దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ గెలుచుకోలేదు. ఈసారి మాత్రం కోహ్లి సేన దానిని చేసి చూపింది. టెస్టు సిరీసూ గెలిచి ఉంటే భారత క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయేది. అందుకే ఇది 80 శాతం ప్రదర్శన కనబర్చిన సిరీస్‌గా మిగిలిపోయింది. -
సఫారీ గడ్డపై నారీభేరి
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కైవసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్, ముంబై టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కేప్‌టౌన్: భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్ (50 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లలో మరిజనే కాప్, అయబొంగ కాకా, షబ్నిమ్ ఇస్మాయిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు శిఖా పాండే (3/16), రుమేలీ ధర్ (3/26), రాజేశ్వరి గైక్వాడ్ (3/26) సమష్టిగా విజృంభించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరిజనే కాప్ చేసిన 27 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్ టాప్‌స్కోర్ కాగా... ట్రియాన్ 25 పరుగులు చేసింది. సిక్సర్లతో చెలరేగుతున్న కాప్ ఇన్నింగ్స్‌కు జెమీమా అద్భుతమైన క్యాచ్‌తో ముగింపు పలికింది. రుమేలీ బౌలింగ్‌లో మరిజనె కాప్ భారీ షాట్ బాదగా... బౌండరీ లైన్ దగ్గర జెమీమా కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ మిథాలీకే లభించాయి. -
'మిషన్' ముగిసింది
దక్షిణాఫ్రికా ఆధిపత్యంతో టెస్టు సిరీస్ ఫలితం ముందే తెలిసిపోయింది. భారత్ దూకుడుతో వన్డే సిరీస్ ఏకపక్షంగా సాగింది. ఉత్కంఠ రేపే టి20 ఫార్మాట్లో మాత్రం రెండు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సిరీస్ విజయం కోసం ఆఖరి మ్యాచ్ వరకు ఆగాయి. ఇందుకు తగ్గట్లే ఒకింత ఆసక్తిగా సాగిన మూడో టి20లో విజయం మన జట్టునే వరించింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సొంతమైంది. ఏ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు టీమిండియా వచ్చిందో దానిని సాధించి సగర్వంగా తిరుగు పయనం కానుంది. కేప్‌టౌన్: సఫారీ పర్యటనలో ఆఖరి పంచ్ మనదే అయింది. దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్కర్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్ స్థానంలో క్రిస్టియన్ జాన్కర్ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు. రైనా మెరుపులు... ధావన్ నిలకడ టాస్కు కోహ్లి కాకుండా రోహిత్ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత కూడా రోహిత్ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్లో అతడి పేలవ ఫామ్ కొనసాగింది. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్ హ్యాండర్. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్ లెగ్‌లో సిక్స్ బాదాడు. ఓవైపు ధావన్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో మనీశ్ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్ డీప్ మిడ్‌వికెట్ నుంచి డాలా విసిరిన డైరెక్ట్ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్ ఝళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది. డుమిని నిలిచాడు... జాన్కర్ భయపెట్టాడు 173 పరుగుల ఛేదనలో ప్రొటీస్‌కు శుభారంభం దక్కలేదు. భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, శార్దుల్‌తో పాటు హార్దిక్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆ జట్టు లక్ష్యం దిశగా పరుగులు చేయలేకపోయింది. మూడో ఓవర్లో హెన్డ్రిక్స్ (7)ను అవుట్ చేసి భువీ బ్రేక్ ఇవ్వగా, ఓపెనర్‌గా వచ్చిన మిల్లర్ (23 బంతుల్లో 24; 1సిక్స్, 2 ఫోర్లు)ను రైనా వెనక్కుపంపాడు. విధ్వంసక క్లాసెన్ (7) ఆటలు ఈసారి సాగలేదు. కానీ కెప్టెన్ డుమిని పోరాటం సాగించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇతడిని శార్దుల్ ఔట్ చేశాడు. వెంటనే మోరిస్ (4) కూడా అవుటయ్యాడు. అప్పటికి విజయ సమీకరణం 21 బంతుల్లో 59. అయితే... అరంగేట్ర ఆటగాడు జాన్కర్ తన విధ్వంసంతో భయపెట్టాడు. బెహర్దీన్ (15 నాటౌట్) తోడుగా విరుచుకుపడ్డాడు. జాన్కర్ ధాటికి 17, 18, 19 ఓవర్లలో కలిపి సఫారీ జట్టుకు ఏకంగా 45 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడు. -
సిరీస్ చేజారదిక... భారత్, దక్షిణాఫ్రికా
సెంచూరియన్: ఇప్పటికే దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు... టి20 సిరీస్‌నూ దక్కించుకునే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన నాలుగో టి20 వర్షం కారణంగా రద్దయింది. భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన ఐదో టి20 24న కేప్‌టౌన్‌లో జరుగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి నా సిరీస్ 2–2తో ముగుస్తుంది. భారత్ గెలిస్తే మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనలో ఏకకాలంలో వన్డే, టి20 సిరీస్ నెగ్గిన జట్టుగా గుర్తింపు పొందుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా స్కోరు 15.3 ఓవర్లలో 130/3తో ఉన్న దశలో వర్షం వచ్చింది. వాన తగ్గకపోవడంతోఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దక్షిణాఫ్రికా ఓపెనర్లు కెప్టె న్ నికెర్క్ (55; 2 సిక్స్‌లు, 6 ఫోర్లు), లీజెల్లి లీ (58; 5 సిక్స్‌లు, 2 ఫోర్లు) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. -
చెలరేగిన పాండే..దక్షిణాఫ్రికా లక్ష్యం 189
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్మాన్ మనీష్ పాండే( 79, 48 బంతుల్లో 3సిక్స్‌లు, 6 ఫోర్లు) చెలరేగి ఆడటంతో భారత్, ప్రత్యర్థికి 189 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించగలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేనకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే ధావన్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూ ప్రకటించగా.. రివ్యూ కోరి ధావన్ గట్టెక్కాడు. అనంతరం ఎదుర్కొన్న ఐదు బంతులను బ్యాట్‌కు తగిలించడానికి ధావన్ తెగ ఇబ్బంది పడ్డాడు. దీంతో తొలి ఓవర్లో భారత్ పరుగుల ఖాతా తెరవలేకపోయింది. డాలా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ డకౌటవ్వడంతో భారత్ పరుగులేమి చేయకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా, ధావన్‌లు ధాటిగా ఆడి రన్‌రేట్‌ను పరుగెత్తించారు. ఈ తరుణంలో ధావన్(24: 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి(1) నిరాశపరిచాడు. తర్వాత వచ్చిన పాండే, సురేశ్ రైనాలు చెలరేగడంతో భారత్ 10 ఓవర్లు ముగిసే సరికి 86 పరుగులుచేసింది. అనంతరం జట్టు స్కోరు 90 పరుగుల వద్ద రైనా(31: 24 బంతులు,5ఫోర్లు) ఎల్బీడబ్యూగా అవుటయ్యాడు. చివర్లో మనీష్‌పాండే, ధోనీ(52, 28 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో వికెట్ కోల్పోయి 103 పరుగులు చేసింది. -
మిథాలీ మెరుపులు
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఓపెనర్లు స్మృతి మంధాన (42 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిథాలీ రాజ్ (61 బంతుల్లో 76 నాటౌట్; 8 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 9 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. తొలుత దక్షిణాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్యూన్ లుస్ (33), డిక్లెర్క్ (26) మినహా మిగతావారు విఫలమయ్యారు. స్పిన్నర్లు పూనమ్ యాదవ్ (2/18), అనూజ పాటిల్ (2/37) రాణించారు. అనంతరం ఛేదనలో భారత్ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆడింది. ప్రొటీస్ జట్టులో ఏడుగురు బౌలింగ్ చేసినా మంధాన, మిథాలీలను నిలువరించలేకపోయారు. 14.2 ఓవర్లలో 106 పరుగులు చేశాక ఈ జోడీని డేనియల్స్ విడదీసింది. 20వ ఓవర్ మొదటి బంతిని బౌండరీకి తరలించిన మిథాలీ లాంఛనాన్ని పూర్తిచేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ నెల 18, 21, 24 తేదీల్లో జరిగే మిగిలిన మ్యాచ్‌లు సోనీ టెన్–1, 3లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
ఎవరి గాలి వీస్తుందో!
దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ నెగ్గేందుకు అతి చేరువగా వచ్చిన భారత్ గత మ్యాచ్‌లో ఆ అవకాశాన్ని కోల్పోయింది. వర్షం కారణంగా లక్ష్యం తగ్గిపోవడం, మరి కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి సఫారీ జట్టు నాలుగో వన్డేలో గట్టెక్కింది. అయితే టీమిండియా ఇంకా సిరీస్ ఫలితాన్ని శాసించే స్థితిలోనే ఉంది. తొలి మూడు వన్డేల్లో చూపిన ఫామ్‌ను మరోసారి ప్రదర్శిస్తే ఈసారి గెలుపు అసాధ్యం కాబోదు. మరోవైపు వరుస పరాజయాలకు వాండరర్స్‌లో అడ్డుకట్ట వేయడంలో సఫలమైన సఫారీ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ మరో మ్యాచ్‌కు ముందే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా లేక దక్షిణాఫ్రికా ఫలితాన్ని చివరి మ్యాచ్ వరకు తీసుకెళుతుందా అనేది చూడాలి. పోర్ట్ ఎలిజబెత్: టెస్టు సిరీస్‌లో పరాజయం తర్వాత వన్డే సిరీస్‌ను ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ ఆ దిశగా మరొక్క విజయాన్ని ఆశిస్తోంది. తమ జోరుకు నాలుగో వన్డేలో బ్రేక్ పడినా అది తాత్కాలికమేనని, సిరీస్ గెలవగల సత్తా తమలో ఉందని నిరూపించేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్‌లో ఐదో వన్డే జరగనుంది. ప్రస్తుతం 3–1తో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతం కావడంతో పాటు నంబర్‌వన్ ర్యాంక్ కూడా సుస్థిరమవుతుంది. సొంతగడ్డపై సిరీస్ కాపాడుకునే ప్రయత్నంలో గత మ్యాచ్‌లో రాణించిన సఫారీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. కేదార్ జాదవ్ ఉంటాడా! జొహన్నెస్‌బర్గ్ వన్డేలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడంతో పాటు కొన్ని అంశాలు కొత్త పాఠాన్ని నేర్పాయి. తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఇద్దరు లెగ్ స్పిన్నర్లపైనే కోహ్లి అమితంగా ఆధారపడటం సరైంది కాదని తేలింది. డెత్ బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రాలను సరైన విధంగా వాడుకోవాలని కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలో భారత్ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో జాదవ్ ఉండి ఉంటే ‘లో ఆర్మ్’ బౌలింగ్ జట్టుకు ఉపయోగపడేదేమో. అతను అనారోగ్యం నుంచి కోలుకుంటే తుది జట్టులోకి రావచ్చు. పైగా స్పిన్‌కు పిచ్ అనుకూలంగా ఉంది కాబట్టి అది బలంగా మారవచ్చు కూడా. మరోవైపు దైవాధీనంలా ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్ మెరుగుపడాలని జట్టు కోరుకుంటోంది. అదే విధంగా నాలుగో స్థానంలో పాతుకుపోయే అవకాశం దక్కినా రహానే ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండటం నిరాశ కలిగించే అంశం. తొలి వన్డేలో అర్ధ సెంచరీ తర్వాత అతను రెండు సార్లు పేలవంగా 11, 8 పరుగులకే వెనుదిరిగాడు. రహానే స్థానంలో మనీశ్ పాండేను ప్రయత్నించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి చూస్తే ఇద్దరు స్పిన్నర్లలో ఒకరి స్థానంలో లేదా పాండ్యాకు బదులుగా అక్షర్ పటేల్‌ను ఎంచుకోవచ్చని కూడా ఒక అంచనా. అయితే బౌలింగ్ మార్పులు ఎలా ఉన్నా మరోసారి మన బలమైన బ్యాటింగ్‌పైనే భారమంతా ఉంది. ముఖ్యంగా కోహ్లి, ధావన్ సూపర్ ఫామ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందిస్తే ఇక తిరుగుండదు. చివరి వన్డే దాకా ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలంటే సిరీస్‌ను ఇక్కడే ముగించాల్సి ఉంది. ఈసారి హీరో ఎవరు? దక్షిణాఫ్రికా ఎట్టకేలకు విజయాన్ని అందుకున్న నాలుగో వన్డేలో ఓవరాల్‌గా చూస్తే అందరూ తలా ఓ చేయి వేసి జట్టును గెలిపించారు. ఆమ్లా, డివిలియర్స్, మిల్లర్ చేసినవీ భారీ స్కోర్లేమీ కావు. అదే విధంగా చివర్లో టి20 తరహాలో ఆడటం వల్ల క్లాసెన్, ఫెలుక్వాయో కొన్ని మెరుపులు మెరిపించగలిగారు. ఇది చాలు దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసేందుకు. మూడు మ్యాచ్‌ల వరకు కనీసం స్పిన్ బంతిని కూడా అర్థం చేసుకోలేని స్థితినుంచి ఎదురుదాడితో మ్యాచ్ గెలవవచ్చని వారు నిరూపించగలిగారు. ఇదే ఆటను మళ్లీ చూపిస్తే సఫారీల పని సులువవుతుంది. బౌలింగ్‌లో రబడ ముందుండి నడిపిస్తున్నాడు. అతడిని ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. అయితే మరో ఇద్దరు పేసర్లు మోర్కెల్, ఇన్గిడిలలో ఒకరు ఈ సారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. గత మ్యాచ్‌కు దూరమైన తాహిర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నాలుగో వన్డేలో కేవలం డుమిని పార్ట్‌టైమ్ స్పిన్నే దక్షిణాఫ్రికా నమ్ముకొని బరిలోకి దిగింది. కానీ ఇక్కడి పిచ్‌పై ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ అవసరం ఉంది. మొత్తంగా డివిలియర్స్ రావడమే ఆ జట్టులో కొత్త స్ఫూర్తి నింపినట్లుంది. అయితే ఈ మైదానంలో సఫారీల రికార్డూ గొప్పగా లేకపోవడం ప్రతికూలాంశం. 32 మ్యాచ్‌లలో 11 ఓడిన ఆ జట్టు... గత పది మ్యాచ్‌లలో ఆరు ఓడింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, జాదవ్/అయ్యర్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, డివిలియర్స్, మిల్లర్, క్లాసెన్, ఫెలుక్వాయో, మోరిస్, రబడ, మోర్కెల్, ఇన్‌గిడి/తాహిర్. దక్షిణాఫ్రికాలో భారత్‌కు పేలవ రికార్డు ఉన్న మైదానాల్లో ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్ ఒకటి. 1992 నుంచి ఈ స్టేడియంలో ఐదు వన్డేలు ఆడిన భారత్ అన్నీ ఓడిపోయింది. నాలుగు సార్లు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలు కాగా, ఒకసారి కెన్యా చేతిలోనూ ఓడింది. పైగా టీమ్ అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. ‘విండీ సిటీ’గా పేరున్న పోర్ట్ ఎలిజబెత్‌లో విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. దానిని దృష్టిలో ఉంచుకొని కూడా తుది జట్టును ఎంపిక చేస్తామని భారత్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించారు. పిచ్, వాతావరణం దక్షిణాఫ్రికాలోని నెమ్మదైన పిచ్‌లలో ఇది ఒకటి. అయితే ఆరంభంలో మంచి బ్యాటింగ్ వికెట్. ఆపై స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. -
2200 గజాల పరుగు!
కొత్తగా వర్ణించేందుకు విశేషణాలు కరువైపోతున్నాయి... గొప్పతనం గురించి మళ్లీ మళ్లీ చెప్పడానికి అంకెలు కూడా చిన్నబోతున్నాయి... దిగ్గజాలతో పోలికను కూడా దాటిపోయి చాలా కాలమైంది... అయినా ఆ పరుగుల దాహం, సెంచరీలపై వ్యామోహం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కాస్త బయటకు వెళ్లి టీ తాగి వస్తానని చెప్పినట్లుగా అలా మైదానంలోకి వెళ్లడం, సెంచరీ బాది వచ్చేయడం అలవాటుగా మారిపోయింది. రోజుకో రికార్డు సవరించడాన్ని రొటీన్ వ్యవహారంగా మార్చుకున్న విరాట్ కోహ్లి మూడో వన్డేలోనూ మళ్లీ అదే చేసి చూపించాడు. 49 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి మరో అరుదైన ఇన్నింగ్స్‌తో తన స్థాయిని ప్రదర్శించాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా, అవతలి ఎండ్ నుంచి సహకారం లోపించినా ఎక్కడా వెనకడుగు వేయకుండా అతను దూసుకుపోయిన తీరు కోహ్లిని మరోసారి సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ అవుటయ్యాక జట్టు ఇన్నింగ్స్‌ను విరాట్ భుజాన వేసుకొని నడిపించిన వైనం అతడిని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. శిఖర్ వెనుదిరిగాక భారత్ 163 పరుగులు చేస్తే... అందులో కోహ్లి ఒక్కడివే 101 పరుగులు ఉన్నాయి. తన వికెట్ విలువేమిటో కోహ్లికి తెలిసినంతగా మరెవరికీ తెలీదంటే అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి బౌలర్లకు అతను ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఏ దశలో కూడా అతను ఒక్క తప్పుడు షాట్ ఆడలేదు. ఎక్కడా బౌండరీల కోసం బలవంతపు దూకుడుకు ప్రయత్నించలేదు. ఫోర్లు, సిక్సర్లకంటే వికెట్ల మధ్య పరుగెత్తడాన్నే కోహ్లి ఎక్కువగా ప్రేమిస్తాడని అనిపిస్తుంది ఈ ఇన్నింగ్స్ చూస్తే. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చూపించకుండానే కేవలం సింగిల్స్ ద్వారా వంద పరుగులు చేయడం అనితర సాధ్యం. మధ్యలో ఒక దశలో 45 బంతుల పాటు కోహ్లి ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఏం పర్లేదు...క్రీజ్‌లో ఉంటే చాలు తర్వాత చూసుకోవచ్చులే అనే ధీమా అతనిది. సరిగ్గా అదే జరిగింది కూడా. తనదైన శైలిలో లెక్క సరి చేస్తూ ఇన్నింగ్స్ ముగిసేసరికి అతను 100కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ముగించడం విశేషం. సెంచరీ పూర్తి చేసుకునే సమయానికి 7 ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లి...ఆ తర్వాత మరో 5 ఫోర్లు కొట్టాడు. శతకం తర్వాత మాత్రమే రెండు సార్లు బంతి గాల్లోకి లేచింది. ముఖ్యంగా రబడ వేసిన చివరి ఓవర్లో శరీరం మొత్తాన్ని గుండ్రంగా తిప్పేస్తూ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరి బంతికి మిడాఫ్ మీదుగా కొట్టిన బుల్లెట్‌లాంటి ఫోర్‌తో విరాట్ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌కు ఇచ్చిన ముగింపును అంతా సులువుగా మరిచిపోలేం. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులతో గణాంక నిపుణులను తనతో పాటు పరుగెత్తిస్తున్న కోహ్లి బుధవారం కూడా వారికి మరోసారి భారీ హోంవర్క్ ఇచ్చేశాడు. ఈ జోరు ఇలాగే సాగితే అసలు కోహ్లి పరుగుల వరద ఎక్కడ ఆగుతుందో ఊహకు కూడా అందడం లేదు! ►100 సింగిల్స్ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. ఈ మ్యాచ్‌లో 75 సింగిల్స్ తీసిన అతను 11 సార్లు 2 పరుగులు, ఒకసారి 3 పరుగుల చొప్పున సాధించాడు. ►1 కెరీర్లో 34వ సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు. -
స్మృతి, జులన్ మెరుపులు
కింబర్లీ: ఒకవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే ఓ ఆటాడిస్తుండగా... అదే దేశంలో మరో చోట మన మహిళల టీమ్ కూడా సఫారీల పని పట్టింది. భారీ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధన (98 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించింది. స్మృతి, కెప్టెన్ మిథాలీ రాజ్ (70 బంతుల్లో 45; 2 ఫోర్లు) కలసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఖాకా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 43.2 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ వ్యాన్ నీకెర్క్ (88 బంతుల్లో 41; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (4/24) అద్భుత ప్రదర్శనతో సఫారీల వెన్ను విరిచింది. శిఖాపాండేకు 3 వికెట్లు.. పూనమ్ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఐసీసీ ఉమెన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతోన్న ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ విజయంతో భారత్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. రెండో వన్డే బుధవారం జరుగుతుంది. ►1 వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టడంతో పాటు 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా జులన్ గోస్వామి అరుదైన ఘనత సాధించింది. ఓవరాల్‌గా ఈ ‘డబుల్’ చేసిన ఎనిమిదో ప్లేయర్ జులన్. -
దక్షిణాఫ్రికాపై భారత మహిళల ఘన విజయం
కింబర్లీ: ఐసీసీ మహిళల చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మహిళలు సైతం అదరగొట్టారు. ఆతిథ్య జట్టుపై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 125 పరుగులకే కుప్పకూల్చారు. భారత మహిళల బౌలర్లలో సీనియర్ బౌలర్ జూలన్ గోస్వామి నాలుగు వికేట్లతో కదం తొక్కగా.. శిఖా పాండే మూడు , పూనమ్ యాదవ్‌లు రెండు వికెట్లు తీశారు. గైక్వాడ్‌కు ఓ వికెట్ దక్కింది. దీంతో ప్రొటీస్ మహిళా బ్యాట్స్ఉమెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సఫారీ మహిళా బ్యాట్స్ఉమెన్లలో కెప్టెన్ వాన్ నీకెర్క్ (41), లారా వోల్వార్డ్(21), మరిజన్నే కాప్(23), సునే లూస్(18)లు మినహా మిగతా ఎవరూ రెండెంకల స్కోరు చేయలేదు. దీంతో ఆతిథ్య జట్టు 43.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మెరుపులు.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధన 84 ( 98 బంతులు, 8 ఫోర్లు 1 సిక్సు)తో మెరవగా కెప్టెన్ మిథాలీ రాజ్ 45(70 బంతులు,2 ఫోర్లు) రాణించారు. మిగతా భారత బ్యాట్స్ఉమన్లు విఫలమయ్యారు. -
మెరిసిన స్మృతి మంధన.. దక్షిణాఫ్రికా లక్ష్యం 214
కింబర్లీ: ఐసీసీ మహిళల చాంపియన్ షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మహిళలు 214 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధన 84 ( 98 బంతులు, 8 ఫోర్లు 1 సిక్సు)తో మెరవగా కెప్టెన్ మిథాలీ రాజ్ 45(70 బంతులు,2 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాట్స్ఉమెన్లు విఫలమవ్వడంతో భారత్ ఆతిథ్య జట్టు ముందు స్వల్పలక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా మహిళా బౌలర్లలో మరిజన్నే కాప్, అయబోంగా కాకాలు రెండేసి వికెట్లు పడగొట్టగా.. మసబట క్లాస్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
ఏ స్థానంలో ఆడటానికైనా నేను సిద్ధమే
-
‘ఆస్థానంలో బ్యాటింగ్ చేసి ఎంతో పరిణితి చెందా’
సెంచూరియన్ : నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో ఎంతో పరిణితి చెందానని టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. తొలి వన్డేలో రహానే(79) అద్బుత ఇన్నింగ్స్‌తో భారత్ ఆరు వన్డేల సిరీస్‌ను గెలుపుతో ఆరంభించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్ మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో నాలుగో స్థానంలో ఎవరిని దింపాలని టీమిండియా కసరత్తులు మెదలు పెట్టింది. దీనికోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లను పరీక్షించి మిశ్రమ ఫలితాలను పొందింది. దీంతో నాలుగో స్థానంలో ఎవరిని పంపాలనే విషయం జట్టు మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాణించి విజయంలో తనవంతు పాత్ర పోషించిన రహానేను అనూహ్యంగా తొలి వన్డేలో నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపి మంచి ఫలితాన్ని పొందింది. ఈ తరుణంలో నేడు(ఆదివారం) రెండో వన్డే సందర్భంగా రహానే మీడియాతో మాట్లాడారు. నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్దమయ్యానని, ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం విభిన్నమైనప్పటికి నా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో బాగా తెలుసని రహానే అభిప్రాయపడ్డాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల ఎంతో పరణతి చెందానని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో రాణించడంపై స్పందిస్తూ.. చివరి టెస్ట్ విజయం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని, అదే ఊపుతో విజయం సాధించామన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, తన బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించానని ఈ ముంబైకర్ చెప్పుకొచ్చాడు. ఏ జట్టుపైనైనా ఆడటానికి ఆస్వాదిస్తానని, కానీ దక్షిణాఫ్రికాపై అయితే మరింత ఇష్టపడతానన్నాడు. వారిని తక్కువ అంచనా వేయడం లేదని, పేస్ బౌలింగ్‌ను సవాల్‌గా స్వీకరిస్తున్నట్లు రహానే తెలిపాడు. జట్టు మెనేజ్మెంట్ ఆదేశాల మేరకు ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనని, గెలుపులో ముఖ్య పాత్ర పోషించడమే తన కర్తవ్యమని రహానే వ్యాఖ్యానించాడు. -
గెలుపు రుచి తెలిసింది!
ఛేదనలో మొనగాడైన విరాట్ కోహ్లి డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై చక్కటి విజయాన్ని అందించాడు. అయితే ఇది కనిపించినంత సునాయాస లక్ష్యం ఏమీ కాదు. చివరి ఓవర్లలో ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ఆ స్కోరు చేయగలిగింది. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు డివిలియర్స్‌లాంటి ఆటగాడు లేకపోవడంతో ఆ జట్టు కనీసం 300 చేయాల్సిన చోట 30 పరుగులు తక్కువగా సాధించింది. నెమ్మదిగా ఉన్న కింగ్స్‌మీడ్ పిచ్‌పై బౌన్స్ తక్కువగా కనిపించింది. దీనిని మన మణికట్టు స్పిన్నర్లు బాగా ఉపయోగించుకున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ చక్కటి ఆటతో సెంచరీ అయితే సాధించాడు కానీ ఏ దశలోనూ అతను మననుంచి మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించలేదు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌లో మోరిస్ మినహా ఎవరి నుంచీ అతనికి తగిన సహకారం లభించలేదు. ఒక్కసారి మైదానంలో లైట్లు వేయగానే డర్బన్ పిచ్ వేగవంతంగా మారుతుందని చెప్పారు. నిజానికి ఇలాంటి స్థితిలో ఆడటం రోహిత్, ధావన్‌లకు కూడా ఇష్టమే. వీరిద్దరు జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చారు. మరో భారీ స్కోరు సాధించేందుకు ధావన్ సిద్ధమైన తరుణంలో కెప్టెన్ అనవసరపు పరుగు పిలుపు అతడిని పెవిలియన్ పంపించింది. ఇక ధావన్ వంతు పరుగులు కూడా తానే చేయాల్సి ఉందని కోహ్లి భావించి బాధ్యత తీసుకున్నట్లున్నాడు. రహానే తన వాండరర్స్ ఫామ్‌ను ఇక్కడా కొనసాగించి తొలి రెండు టెస్టుల్లో తనను తీసుకోకపోవడం ఎంత తప్పో మరోసారి నిరూపించాడు. భారత్ ఇప్పటికే విజయానుభూతిని రుచి చూసింది కాబట్టి దక్షిణాఫ్రికా మళ్లీ కోలుకునే అవకాశం ఇస్తుందని నేను అనుకోవడం లేదు. -
రెండో వన్డే ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు’ గా ఉంది దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. ఇప్పటికే గాయంతో తొలి మూడు వన్డేలకు సీనియర్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ దూరం అయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆదివారం జరిగే రెండో వన్డే ముందే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్ డుప్లెసిస్ చేతి వేలి గాయంతో పూర్తి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్‌కు కుడి చేతి చూపుడు వేలు విరిగిందని, మూడు నుంచి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గాయపడటంతో కెప్టెన్ ఎవరా అనే సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో అనూహ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌ను ప్రకటించింది. డుప్లెసిస్ స్థానంలో ఫర్హాన్ బెహర్డీన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. వన్డే సిరీస్ మొత్తానికి మర్ క్రామ్ నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ దక్షిణాఫ్రికా కన్వీనర్ లిండాజొండి తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమేమి కాదని, మరక్రమ్కు డివిలియర్స్, ఇతర సీనియర్ ఆటగాళ్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. -
అదిరే ఆరంభం
ఎక్కడ లక్ష్య ఛేదన ఉంటుందో అక్కడ విరాట్ కోహ్లి ఉంటాడు. ఫార్మాట్ మారినా, వేదిక మారినా వేటలో అతని ఆట మారలేదు. శతకాల జాబితాలో మరో అంకె కొత్తగా వచ్చి చేరిందే తప్ప తేడా ఏమీ లేదు. అతనికి తోడుగా అజింక్య రహానే కూడా జత కలిశాడు. అలవోకగా, ఆడుతూ పాడుతూ, ఎక్కడా ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా ముందుకు సాగిన ఈ ద్వయం దక్షిణాఫ్రికాను ఓ ఆటాడుకుంది. ఫలితమే భారత్‌కు అపురూప విజయం. ఆరు వన్డేల సిరీస్‌లో శుభారంభం. ముందుగా భారత స్పిన్నర్లు కుల్దీప్, చహల్ దెబ్బకు పరుగులు తీసేందుకు తీవ్రంగా శ్రమించిన దక్షిణాఫ్రికా జట్టు... కెప్టెన్ డు ప్లెసిస్ సెంచరీ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. కానీ ఆ జట్టు విధించిన లక్ష్యం భారత్ ముందు చిన్నదిగా మారిపోయింది. ఓపెనర్లు త్వరగానే వెనుదిరిగినా కోహ్లి, రహానే 189 పరుగుల భారీ భాగస్వామ్యం భారత్‌ను ముందంజలో నిలిపింది. చివరి టెస్టులో విజయం తర్వాత డర్బన్ వేదికపై తొలి గెలుపుతో టీమిండియా వన్డేల్లోనూ సఫారీలకు సవాల్ విసిరింది. డర్బన్: వన్డేల్లో భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సునాయాస విజయంతో శుభారంభం చేసింది. గురువారం ఇక్కడ కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. కుల్దీప్ 3, చహల్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది. అనంతరం భారత్ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా... అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడి తన ఆటపై ఉన్న అనుమానాలను తొలగించాడు. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా... ఆదివారం సెంచూరియన్‌లో రెండో వన్డే జరుగుతుంది. ఈ గెలుపుతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా వరుస 17 విజయాలకు భారత్ బ్రేక్ వేసింది. కీలక భాగస్వామ్యాలు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆశించిన ఆరంభం లభించలేదు. బుమ్రా వేసిన చక్కటి బంతికి ఆమ్లా (16) వికెట్ల ముందు దొరికిపోయాడు. వచ్చీ రాగానే భువనేశ్వర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి డు ప్లెసిస్ ధాటిని ప్రదర్శించగా... పవర్‌ప్లే ముగిసేసరికి దక్షిణాఫ్రికా 49 పరుగులు చేసింది. ఆ తర్వాత పాండ్యా ఓవర్లోనూ మూడు ఫోర్లతో దక్షిణాఫ్రికా 18 పరుగులు రాబట్టింది. అయితే మరుసటి ఓవర్లో డి కాక్ (49 బంతుల్లో 34; 4 ఫోర్లు)ను ఎల్బీగా అవుట్ చేసి చహల్ మరో వికెట్ అందించాడు. ఈ దశలో లెగ్‌స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్ సఫారీలను పూర్తిగా కట్టి పడేసింది. ఒక ఎండ్‌లో ప్లెసిస్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, మరో ఎండ్‌లో తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు పడ్డాయి. మార్క్రమ్ (9) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. గుగ్లీతో డుమిని (12)ని క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్... తన తర్వాతి ఓవర్లోనే మిల్లర్ (7)ను కూడా పెవిలియన్ పంపించాడు. కవర్స్‌లో కోహ్లి పట్టిన చక్కటి క్యాచ్ మిల్లర్ ఆట ముగించింది. 16–30 ఓవర్ల మధ్య కేవలం 2 ఫోర్లతో దక్షిణాఫ్రికా 55 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే భారత బౌలింగ్ ఎంత బాగా సాగిందో అర్థమవుతుంది. 134/5 స్కోరు నుంచి మోరిస్ (37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కుల్దీప్ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అతను మరో రెండు బంతులకే క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో సింగిల్ తీసి 101 బంతుల్లో డు ప్లెసిస్ కెరీర్లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో ప్లెసిస్, ఫెలుక్వాయో (27 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి దక్షిణాఫ్రికాకు మెరుగైన స్కోరు అందించారు. ఒకరితో ఒకరు పోటీ పడి... భారత్ కూడా ఛేదనను దూకుడుగా ఆరంభించలేకపోయింది. తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ శర్మ (20) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు ధావన్ (29 బంతుల్లో 35; 6 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. చక్కటి షాట్లతో అతను చకచకా పరుగులు రాబట్టాడు. అయితే కోహ్లితో సమన్వయ లోపంతో ధావన్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ దశలో కోహ్లి, రహానే కీలక భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరు మంచి సమన్వయంతో ఆడుతూ సఫారీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 56 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరు మరింత దూకుడు పెంచారు. సఫారీల పేలవ బౌలింగ్ కూడా భారత్‌కు కలిసొచ్చింది. కొద్ది సేపటికి రహానే కూడా 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అతనికి ఇది వరుసగా ఐదో అర్ధసెంచరీ కావడం విశేషం. తర్వాత వీరిద్దరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించి దూసుకుపోయారు. 105 బంతుల్లో దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి తొలి సెంచరీ పూర్తయింది. చివర్లో రహానే, కోహ్లి అవుటైనా అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ►15 విదేశీ గడ్డపై కోహ్లి చేసిన సెంచరీల సంఖ్య ►1 డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌కిదే తొలి విజయం. గతంలో ఈ వేదికపై భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడగా... ఆరింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. -
దీటుగా బదులిస్తున్న దక్షిణాఫ్రికా
జొహనెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా చివరి టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా కుదురుగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (28; 95 బంతుల్లో 3 ఫోర్లు), హషీమ్ ఆమ్లా (26; 60 బంతుల్లో4 ఫోర్లు)బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రొటీస్ జట్టుకు విజయానికి ఇంకా172 పరుగుల దూరంలో ఉంది. -
బ్యాట్స్‌మెన్‌దే భారం
పూర్తిగా ఏకపక్షమైన మూడో టెస్టు మ్యాచ్ పిచ్‌పై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నివేదిక ఇస్తాడో ఆసక్తికరంగా మారింది. ఏ పిచ్ అయిన ఏకపక్షంగా సాగితే అది మంచి పిచ్ కానే కాదు. ఇపుడు వాండరర్స్ పూర్తిగా బౌలర్లకే మొగ్గు చూపుతోంది. ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌గా కితాబు అందుకున్న వారు కూడా ఈ పిచ్‌పై విలవిలలాడుతున్నారు. ఇలాంటి పిచ్‌పై కూడా చతేశ్వర్ పుజారా ఆటతీరును చూస్తే ఒక దశలో భారత్ 300 స్కోరు చేస్తుందనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్నకొద్దీ పరుగులే గగనంగా, క్రీజ్‌లో నిలవడమే కష్టంగా మారింది. పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ అంతకంతకూ కష్టమే అని చెప్పాలి. కానీ భువీ మాత్రం రెండు విభాగాల్లో ఆకట్టుకున్నాడు. పేసర్ షమీ కేప్‌టౌన్‌లో కొనసాగించిన జోరును ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. భారత్ స్కోరు మరీ తక్కువగా ఉండటంతో హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టి భువీ, ఇషాంత్ శర్మ, బుమ్రాలపైనే ఆధారపడ్డాడు. వీళ్లు మనసు పెట్టి బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా కూడా తక్కువస్కోరుకే ఆలౌటైంది. ఇప్పుడు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో భారీస్కోర్లు చేయడంపైనే దృష్టిపెట్టాలి. అప్పుడే టెస్టును గెలిచి సిరీస్‌లో ఊరట పొందొచ్చు. -
పట్టు చిక్కింది!
బంతితో బల ప్రదర్శనలో సై అంటే సై! టపటపా వికెట్లు తీయడంలో మీలాగే మేమూ! పోటాపోటీలో ఆధిక్యం నీదా? నాదా? అన్నట్లు సాగుతోంది వాండరర్స్ టెస్టు. ఒకరిద్దరు మినహా రెండు జట్ల ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన ఈ పిచ్‌పై బౌలర్లు ‘చేసిన పరుగులే’ అత్యంత విలువైనవిగా మారనున్నాయి. పేస్ విశ్వరూపం కనిపిస్తున్నచోట అతి స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలదే పైచేయి అయింది. ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన రెండో ఇన్నింగ్స్‌లో చూపే పోరాటమే గెలుపు బాట చూపనుంది. జొహన్నెస్‌బర్గ్: పదునైన బంతులతో భారత పేసర్లు ప్రతాపం చూపడంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్లిష్ట పరిస్థితుల్లో పడింది. బుమ్రా (5/54), భువనేశ్వర్ (3/44) అరివీర విజృంభణకు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 194 పరుగులకే పరిమితమైంది. బౌలర్ వదలడమే ఆలస్యం... బంతి రాకెట్లా దూసుకెళ్తున్న వాండరర్స్ వికెట్‌పై ఆ జట్టు అతికష్టమ్మీద 7 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అది కూడా ఆపద్బాంధవుడు ఆమ్లా (121 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ శతకానికి బౌలింగ్ ఆల్ రౌండర్లు రబడ (84 బంతుల్లో 30; 6 ఫోర్లు), ఫిలాండర్ (55 బంతుల్లో 35; 5 ఫోర్లు) తోడుగా నిలవడంతోనే సాధ్యమైంది. వీరు ముగ్గురు తప్ప జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి పార్థివ్ పటేల్ (16) వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (13 బ్యాటింగ్), వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికి టీమిండియా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్ బహు కష్టంగా ఉన్న నేపథ్యంలో నిఖార్సైన పేస్‌ను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్‌కు ఛేదన దుర్లభమే. కాబట్టి... మూడో రోజు భారత్ ఎన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే విజయానికి అంత చేరువవుతుంది. ఆపద్బాంధవుడు నిలిచాడు... 6/1తో గురువారం ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. భువీ, ఇషాంత్ పకడ్బందీ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఏడో ఓవర్లోనే ఎల్గర్ (4)ను భువీ అవుట్ స్వింగర్‌తో వెనుక్కు పంపాడు. దీంతో నైట్‌వాచ్‌మన్ రబడకు ఆమ్లా జత కలిశాడు. వీరిద్దరూ భారత బౌలర్లను పరీక్షించారు. మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ముఖ్యంగా రబడ ఏ ఇబ్బంది లేకుండా ఆడాడు. అయితే... లంచ్‌కు కొద్దిగా ముందు ఇషాంత్ బౌలింగ్‌లో గల్లీలో రహానే చురుకైన క్యాచ్ పట్టడంతో రబడ పెవిలియన్ చేరాడు. దీంతో డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. అంతముందుకు ఇషాంత్ బౌలింగ్‌లోనే ఆమ్లా ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. భారత్ డీఆర్ఎస్ కోరినా... అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో వికెట్ దక్కలేదు. లంచ్ తర్వాత బూమ్ బూమ్ బుమ్రా... 81/3తో లంచ్‌కు వెళ్లి వచ్చిన దక్షిణాఫ్రికాకు తర్వాత చుక్కలు కనిపించాయి. భువీ, బుమ్రా అద్భుతమైన ఇన్స్వింగర్లతో డివిలియర్స్ (5), కెప్టెన్ డుప్లెసిస్ (8)లను బౌల్డ్ చేశారు. ఈ బంతులకు మేటి బ్యాట్స్‌మెన్ అయిన వీరిద్దరి వద్ద సమాధానమే లేకపోయింది. ప్రమాదకారి అయిన డికాక్ (8)నూ మరో మంచి బంతితో బుమ్రానే బలిగొన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 125/6. దీంతో భారత్‌కు ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ... ఫిలాండర్ తోడుగా ఆమ్లా అడ్డుగోడలా నిలిచాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరు మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లారు. అనంతరం ఫిలాండర్ దూకుడుగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచాడు. ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాక ఆమ్లా... బుమ్రా బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే ఫిలాండర్ షమీకి చిక్కాడు. ఫెలుక్వాయో (9), మోర్కెల్ (9 నాటౌట్) రెండేసి బౌండరీలతో సఫారీలకు ఆధిక్యం దక్కించారు. ఇన్నింగ్స్ 66వ ఓవర్లో రెండు బంతుల వ్యవధిలో ఫెలుక్వాయో, ఇన్‌గిడి (0)లను వెనక్కు పంపిన బుమ్రా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికి... కెరీర్లో తొలిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. లంచ్ తర్వాత పడ్డ ఏడు వికెట్లలో బుమ్రాకే ఐదు దక్కాయి. పార్థివ్ ఓపెనింగ్... అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్... అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. కీపర్ పార్థివ్‌ను ఓపెనింగ్‌కు పంపింది. అయితే మూడు ఫోర్లు కొట్టినా తడబడుతూనే ఆడిన అతడు... మార్క్రమ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుటయ్యాడు. ఈ వికెట్ ఫిలాండర్‌కు దక్కింది. తర్వాత వన్‌డౌన్‌లో పుజారా కాకుండా రాహుల్ వచ్చాడు. కొన్ని ఉత్కంఠ పరిస్థితులు ఎదుర్కొన్నా... విజయ్, రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ్యాచ్‌కు కీలకం కానుంది. సఫారీ పేసర్లను కాచుకుంటూ కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానేలతో పాటు పాండ్యా ఓ చేయి వేసి జట్టు మెరుగైన స్కోరుకు దోహదపడితే ఈ టెస్టులో భారత్ విజయాన్ని ఆశించవచ్చు. రెండో రోజు 76.5 ఓవర్లే... రెండు జట్లలో ఒక్క స్పిన్నరూ లేని పరిస్థితుల్లో వాండరర్స్ పిచ్‌పై తొలి రోజు 83 ఓవర్లు పడ్డాయి. రెండో రోజు 76.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. విశేషమేమంటే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లకు ఆలౌట్ కాగా... సొంతగడ్డపై దక్షిణాఫ్రికా 65.5 ఓవర్లే ఆడగలిగింది. ఇందులో తొలి రోజు ఎదుర్కొన్న 6 ఓవర్లు మినహాయిస్తే గురువారం ఆ జట్టు ఆడినవి 59.5 ఓవర్లే కావడం గమనార్హం. అంతేకాక ఇరు జట్లలోనూ సరిగ్గా ముగ్గురు బ్యాట్స్‌మెనే రెండంకెల స్కోరు చేయగలిగారు. వీరి తర్వాత ఎక్స్‌ట్రాలదే (భారత్‌కు 26), (దక్షిణాఫ్రికాకు 23) అత్యధిక స్కోరు కావడం ఆశ్చర్యకరం. -
పేస్‌కు పడిపోయారు
కీలకమైన టాస్ మననే వరించింది... ఐదుగురు పేసర్లతో దిగినా, భారత్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకుంది. అంతలోనే అసలు సిసలు పేస్ పిచ్ అంటే ఏమిటో తెలిసొచ్చింది... అటు పరుగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థి భీకర బౌలింగ్... ఇటు తంటాలు పడుతూ భారత బ్యాటింగ్... మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లి క్లాస్ ఇన్నింగ్స్... చతేశ్వర్ పుజారా అపరిమిత సహనం... చివర్లో భువనేశ్వర్ కుమార్ పరిణతి! మొత్తంమీద బంతి రెప్పపాటులో దూసుకొస్తున్న వాండరర్స్ వికెట్‌పై కాస్తోకూస్తో చెప్పుకోదగ్గ స్కోరు... ఇక ప్రత్యర్థిని ఎంత తక్కువకు కట్టడి చేస్తే మూడో టెస్టుపై భారత్‌కు అంతగా పట్టు చిక్కుతుంది. జొహన్నెస్‌బర్గ్: అందరూ అనుకున్నట్లే ఎదురైన పచ్చిక పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. సఫారీ పేస్ దళం నిప్పులు చెరిగే బంతులకు సమాధానం ఇవ్వలేకపోయారు. బంతి బంతికి గం డం అన్నట్లు ఆడిన ఓపెనర్లు పూర్తిగా నిరాశ పరి చారు. కానీ... అడ్డుగోడ పుజారా (179 బంతుల్లో 50; 8 ఫోర్లు) తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లి (106 బంతుల్లో 54; 9 ఫోర్లు) పట్టుదల చూపాడు. లోయరార్డర్ లో భువనేశ్వర్ (49 బంతుల్లో 30; 4 ఫోర్లు) విలువైన పరుగులు జోడించాడు. దీంతో జొహన్నెస్‌బర్గ్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైంది. రబడ (3/39), మోర్కెల్ (2/47), ఫిలాండర్ (2/31), ఫెలూక్వాయో (2/25) సమష్టిగా రాణించారు. పిచ్ పరిస్థితి చూస్తే భారత్‌ది పోరాడే స్కోరుగానే కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే భువీ.. ప్రత్యర్థి ఇన్నింగ్స్ మూడో ఓవ ర్లోనే ఓపెనర్ మార్క్రమ్ (2)ను చక్కటి బంతితో అవుట్ చేశాడు. ఆట ముగిసే సమయానికి ఎల్గర్ (4 బ్యాటింగ్), రబడ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కోహ్లి స్థైర్యం... పుజారా సహనం... అచ్చంగా పేసర్లే రాజ్యమేలే వాండరర్స్‌లో ఉదయం టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ... ప్రొటీస్ బౌలర్ల పదునుకు ఓపెనర్లు నిలవలేకపోయారు. కేఎల్ రాహుల్ (0) డకౌట్‌గా వెనుదిరగగా, మురళీ విజయ్ (8) విఫలమయ్యాడు. ఈ స్థితిలో పుజారాకు జత కలిసిన కోహ్లి ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలో సహచరులకు చూపాడు. ఓ వైపు ఫిలాండర్, మోర్కెల్, రబడ, ఇన్‌గిడి కదం తొక్కుతుండగా... పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్థైర్యం కోల్పోకుండా నిలిచాడు. లంచ్ విరామానికి భారత్ 45/2తో నిలిచింది. ఈ సెషన్లో ఫిలాండర్ అత్యంత ప్రమాదకరంగా కనిపించాడు. లంచ్‌తర్వాత పుజారా ఫిలాండర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి రాగా, రబడ బౌలింగ్‌లో బౌండరీతో కోహ్లి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే... మరుసటి ఓవర్లో తక్కువ ఎత్తులో వచ్చిన ఇన్‌గిడి బంతిని డ్రైవ్ ఆడబోయి స్లిప్‌లో డివిలియర్స్‌కు చిక్కాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 84 పరుగులు జోడించారు. దీంతో అజింక్య రహానే (9) క్రీజులోకి వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన అతడు అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (2) తోడుగా పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12 బంతుల వ్యవధిలో ఒక్క పరుగూ రాకుండానే మూడు వికెట్లు పడిపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అవకాశాలు వచ్చినా... కోహ్లి వ్యక్తిగత స్కోరు 11 వద్ద ఉండగా ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను ఫిలాండర్... 32 పరుగుల వద్ద క్యా చ్‌ను స్లిప్‌లో డివిలియర్స్ జారవిడిచారు. పుజారా సున్నా మీద ఉండగా... స్పష్టంగా ఎల్బీ అయినా సందేహంతో దక్షిణాఫ్రికా రివ్యూ కోరలేదు. రహానే 3 పరుగుల వద్ద ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటైనా నోబాల్‌గా తేలడంతో వెనుక్కు పిలిపించారు. ►54 తొలి పరుగు తీసేందుకు చతేశ్వర్ పుజారా ఎదు ర్కొన్న బంతులు. భారత్ తరఫున రాజేశ్ చౌహాన్ (57–శ్రీలంకపై, 1994) పేరిట ఈ రికార్డు ఉంది. అయితే ఇన్నింగ్స్ మధ్యలో పరుగు తీయకుండా ఎక్కువ బంతులు ఆడింది మాత్రం రవిశాస్త్రి. ఇదే జొహన్నెస్‌బర్గ్‌లో 1992 సిరీస్‌లో శాస్త్రి 9 పరుగుల స్కో రుకు చేరుకున్నాక వరుసగా 68 బంతుల పాటు పరుగే తీయలేదు. -
187 పరుగులకు భారత్ ఆలౌట్
జొహన్నెస్‌బర్గ్ : వేదిక మారినా.. జట్టులో మార్పులు చేసినా అదే ఆట..అదే తీరు..! దక్షిణాఫ్రికా ఫేస్ బలగానికి మరోసారి భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కెప్టెన్ కోహ్లి, పుజారాల అర్ధసెంచరీలు మినహా భారత్ బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. దీంతో భారత్ కేవలం187 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేష్ రాహుల్(0), మురళీవిజయ్(8)లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం క్రీజులో వచ్చిన పుజారా, కోహ్లిలు నిలకడగా రాణించారు. ఆచితూచి ఆడుతూ.. సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పుజారా అయితే తొలి పరుగుకు ఏకంగా 54 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లి సైతం సఫారీ బౌలర్ల వేగవంతమైన బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటు వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే రబాడ వేసిన 20.1వ బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో ఉన్న ఫిలాండర్ సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఈ లైఫ్‌ను అందిపుచ్చుకున్న కోహ్లి(54, 101 బంతుల్లో 9 ఫోర్లతో) కెరీర్లో 16 హాఫ్ సెంచరీ సాధించాడు. ఆవెంటనే లుంగిసాని బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్ మొత్తానికి ఈ పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. నిరాశ పరిచిన రహానే తొలి రెండు టెస్టు మ్యాచుల్లో అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వకపోవడంపై కెప్టెన్ కోహ్లి సీనియర్ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో అవకాశం కల్పించగా రహానే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మోర్కెల్ వేసిన 51.4 ఓవర్లో రహానే(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పార్దీవ్ పటేల్ పుజారా ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. కోహ్లి బాటలో పుజారా.. కోహ్లిలానే హాఫ్ సెంచరీ అనంతరం పుజారా పెవిలియన్‌కు చేరాడు. తనదైన బ్యాటింగ్ శైలితో సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష నిలిచిన పుజారా 178 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో కెరీర్లో 17 అర్ధసెంచరీ సాధించాడు. ఆ వెంటనే ఫెహ్లుక్వాయో వేసిన 61.3వ బంతికి ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ వచ్చిన బంతి పుజారా బ్యాట్ అంచుకు తగిలి కీపర్ డికాక్ చేతుల్లో పడింది. అర్ధశతకం సాధించడానికి పుజారా నాలుగు గంటల సమయం తీసుకోవడం విశేషం. ఆ వెంటనే భారత్ పార్దీవ్‌పటేల్(2), హార్దిక్ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద భారత్ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. పర్వాలేదనిపించిన భువనేశ్వర్ అనంతరం క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్(30) పర్వాలేదనిపించాడు. అందివచ్చిన బంతులను బౌండరీలకు తరలిస్తూ జట్టు స్కోర్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఇతర టేయిలండర్ల నుంచి సాయం అందలేదు. దీంతో భారత్ 187 పరుగులు చేయగలిగింది. మహ్మద్ షమీ 8 పరుగులు చేయగా.. ఇషాంత్ డకౌట్ అయ్యాడు. చివర్లో భువీ అవుటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా(0) నాటౌట్‌గా నిలిచాడు. సఫారీ బౌలింగ్‌లో రబడా మూడు వికెట్లు తీయగా.. మోర్కెల్, ఫిలాండర్, ఫెహ్లుక్వాయోలకు తలో రెండు వికెట్లు తీశారు. లుంగిసానికి ఒక వికెట్ దక్కింది. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ సఫారీ ఓపెనర్ ఆడిన్ మార్క్రమ్(2) పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రబడాతో డీన్ ఇల్గర్(4) మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 6 పరుగులు చేసింది. ffff -
భారత్ వికెట్లు టప..టపా
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది. పుజారా(50), పార్దీవ్‌పటేల్(2), హార్దిక్ పాండ్యా(0) వికెట్లను వరుసగా కోల్పోయింది. తొలుత కెప్టెన్ కోహ్లి తరహాలోనే టీమిండియా నయావాల్ చతేశ్వర పుజారా హాఫ్ సెంచరీ అనంతరం ఆండిల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్(2) సైతం మోర్కెల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఆవెంటనే క్రీజులో వచ్చిన ఆల్‌రౌండర్ పాండ్యా ఆండిల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డికాక్ చిక్కాడు. 144 పరుగుల వద్దే భారత్ మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. దీంతో భారత్ 144 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో భువనేశ్వర్(4), మహ్మద్ షమీ(0) ఉన్నారు. అంతకు ముందు పుజారా 178 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక కెప్టెన్ కోహ్లి(54) వికెట్ అనంతరం భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడల్లా కుప్ప కూలింది. -
ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుంటే...
వర్షం కారణంగా మూడో రోజు ఆట తుడిచి పెట్టుకుపోయింది. పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచి, గడ్డి కూడా తొలగించలేదు. కొద్దిగా మేఘావృతంగా ఉన్న కేప్‌టౌన్ వాతావరణంలో భారత కొత్త బంతి బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. స్వింగ్ చేయగలిగారు. క్లాస్ బ్యాట్స్‌మన్ అయిన డివిలియర్స్ తప్ప మిగతా ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. భారత క్యాచింగ్, కోహ్లి ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి. లంచ్ అనంతరం ఎండ మొదలై... పిచ్ పొడిబారడం ప్రారంభించింది. అయినప్పటికీ భారీకాయులు, పొడగరులైన దక్షిణాఫ్రికా బౌలర్లకు అదనపు బౌన్స్ రాబట్టడం కష్టమైంది. ఆస్ట్రేలియాలోలానే ఇక్కడా ధావన్ షార్ట్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. కొంత తప్పించుకుంటూ పుల్ షాట్ ఆడే యత్నంలో అతడు అవుటయ్యాడు. ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతికి పుజారా వెనుదిరిగాడు. బౌన్సీ పిచ్‌లపై బ్యాట్స్‌మన్ బ్యాక్‌ఫుట్ సరిగా లేకుంటే రాణించడం కష్టం. సన్నాహక మ్యాచ్ ఆడి... స్థానిక బౌలర్లను ఎదుర్కొని ఉంటే, దక్షిణాఫ్రికా పొడగరి బౌలర్లతో ఇబ్బంది ఎదురై ఉండేది కాదు. వేగం, పదునుతో షమీ పాత ఫామ్‌ను అందుకున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా క్రమంగా ఎదగడంతో పాటు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాట్‌తో విఫలమైనా... చివరి వరుస ఆటగాళ్లు కొంత పోరాడగలమని చాటారు. ఆధునిక క్రికెట్ షెడ్యూల్లో సిరీస్ మధ్యలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండా ఆడటమంటే... గాలిని చేతితో ఒడిసిపట్టడమే. -
పాండ్యా కపిల్‌ను తలపిస్తున్నాడు
కేప్‌టౌన్‌లో హార్దిక్ పాండ్యా క్లిష్టమైన ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులు విఫలమైన చోట అతను విజయవంతమైన తీరు అద్భుతం. కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్న తీరు చూస్తుంటే కపిల్‌దేవ్ గుర్తొచ్చాడు. ఆయన పుట్టిన రోజు (జనవరి 6)న ఆయన్ని తలపించే ఇన్నింగ్స్ ఆడాడు పాండ్యా. ఇది చూసి ఉంటే కపిల్ కూడా అభినందిస్తారు. బంతితో, బ్యాట్‌తో జట్టును గెలిపించడం వల్లే ఆయన మ్యాచ్ విన్నర్‌గా చరిత్రకెక్కారు. ఇప్పుడు పాండ్యా కూడా విఖ్యాత ఆల్‌రౌండర్ సాధించిన ఘనతల్లో సగం సాధిస్తే... మరో కపిల్ ఖాయమనుకోవచ్చు. ఇప్పుడైతే అతను నేర్చుకునే దశలో ఉన్నాడు. నిలకడగా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే కచ్చితంగా మరో ఆల్‌రౌండర్‌ను చూస్తాం. ఇది మినహా మిగతా భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి మరీ అవుటయ్యారు. ముఖ్యంగా తొలిరోజు పడిన మూడు వికెట్లను అనవసరంగానే సమర్పించుకున్నారు. ఆరంభంలో విజయ్ ఆఫ్‌స్టంప్ బంతుల్ని బాగా ఆడుతున్నట్లే కనిపించాడు. కానీ అదే దిశలో వైడ్‌గా వెళ్లిన బంతిని బాది నిష్క్రమించాడు. ధావన్ అయితే అక్కర్లేని భారీ షాట్‌కు బలై మూల్యం చెల్లించాడు. పుల్ షాట్ ఆడే సందర్భం... సామర్థ్యం లేనపుడు దాన్ని అలా వెళ్లనివ్వాలి. టెస్టుల్లో ముందు క్రీజులో పాతుకుపోయాకే అలాంటి షాట్లపై కన్నేయాలి. కోహ్లి చక్కని డెలివరీకి అవుటైనా... దాన్ని బాగా ఆడే సత్తా ఉన్నవాడే మన కెప్టెన్. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తొలి బంతికే పుజారా సహనం కోల్పోయిన షాట్ ఆడాడు. అశ్విన్ కూడా తేలిగ్గానే వికెట్ సమర్పించుకోగా... రోహిత్ తన పాత బల హీనతకే తలవంచాడు. పాండ్యాకు జతయిన భువనేశ్వర్ తన వికెట్ విలువెంతో గుర్తుంచుకొని ఆడిన తీరు ముచ్చటేస్తుంది. ఇద్దరి సమన్వయం వల్లే విలువైన భాగస్వామ్యం కుదిరింది. వీళ్లిద్దరు చూపిన పట్టుదలే మిగతా వారికి పాఠం. -
నిలిపాడు బ్యాట్‌తో... బంతితో...
తొలుత బ్యాటుతో నిలిచాడు. భీకర పేస్‌ను కాచుకున్నాడు. ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించాడు. వీలుచిక్కితే ఎదురుదాడికి దిగాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం బంతితోనూ ప్రతాపం చూపాడు. రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. కేప్‌టౌన్ టెస్టులో శనివారం హార్దిక్ పాండ్యా ప్రతాపమిది. బ్యాట్స్‌మన్‌గా వీరోచిత పోరాటం చేసి, బౌలర్‌గా సఫారీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి రెండో రోజు ఆటనంతా తనచుట్టూనే తిప్పుకొన్నాడీ యువ ఆల్‌రౌండర్. పాండ్యా తెగువతో టీమిండియా తలెత్తుకోగలిగింది. ఇక చేయాల్సింది సమష్టిగా పోరాడి అతడి ఆటకు మరింత విలువ చేకూర్చడమే. కేప్‌టౌన్: ప్రత్యర్థి ధాటికి బెంబేలెత్తి, ఒక దశలో పూర్తిగా తేలిపోతుందనుకున్న భారత్ పర్వాలేదనిపించే ప్రదర్శనతో పరువు దక్కించుకుంది. పేసర్ భువనేశ్వర్ (86 బంతుల్లో 25; 4 ఫోర్లు) అండగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (95 బంతుల్లో 93; 14 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆట కనబర్చడంతో కేప్‌టౌన్ టెస్టుపై టీమిండియాకు ఆశలు మిగిలాయి. వీరిద్దరి పోరాటం కారణంగా భారత్ 209 పరుగులు చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికాను హార్దిక్ 2 వికెట్లు తీసి దెబ్బతీశాడు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్), నైట్‌వాచ్‌మన్ రబడ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా సఫారీ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే ఈ మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అతి నిదానంగా... ఓవర్‌నైట్ స్కోరు 28/3తో ఆట ప్రారంభించిన భారత ఇన్నింగ్స్ తొలి సెషన్ అతి నెమ్మదిగా సాగింది. పుజారా (26), రోహిత్ శర్మ (59 బంతుల్లో 11) పరుగులు చేయడం కంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఫిలాండర్ వరుసగా అయి దు ఓవర్లు మెయిడిన్లు వేశాడు. అతడు, రబడ కలిసి రోహిత్‌ను తీవ్రంగా పరీక్షించారు. నిలదొక్కుకునేందుకు గంటపాటు శ్రమించిన రోహిత్ చివరకు రబడకే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నిర్ణయంపై సమీక్షకు వెళ్లినా ఫలి తం లేకపోయింది. అనంతరం వచ్చిన అశ్విన్ రెండు ఫోర్లు కొట్టి స్కోరును కొంత ముందు కు కదిలించాడు. ఈ సెషన్లో 25 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే వచ్చాయి. 76/4తో భారత్ లంచ్‌కు వెళ్లింది. అందరూ వెంటవెంటనే... లంచ్ తర్వాతి ఓవర్ తొలి బంతికే భారీ షాక్ తగిలింది. ఫిలాండర్ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా నిష్క్రమించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అంతా అవుటై... 200 పరుగులపైగా వెనుకబడి... ప్రతిదాడి తప్ప మరో అవకాశం లేని ఈ స్థితిలో వచ్చిన పాండ్యా తొలి బంతినే బౌండరీకి తరలించాడు. స్టెయిన్ బౌలింగ్‌లో అంపైర్ అవుటిచ్చినా సమీక్ష కోరి మరీ బయటపడ్డాడు. అయితే కొద్దిసేపటికే ఫిలాండర్ బౌలింగ్‌లో డికాక్ పట్టిన డైవింగ్ క్యాచ్‌కు అశ్విన్ (12) వెనుదిరిగాడు. సాహాను అద్భుత బంతితో స్టెయిన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీనిపై రివ్యూ కోరినా నిరాశే ఎదురైంది. టీ అనంతరం మోర్కెల్... భువీని వెనక్కు పంపి 99 పరుగుల 8వ వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. దీంతో పాండ్యా మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు రబడ ముగింపు పలికాడు. భారీ షాట్ కొట్టే యత్నంలో టాప్ ఎడ్జ్ తాకిన బంతిని డికాక్ ఒడిసి పట్టాడు. బుమ్రా (2)నూ అతడే అవుట్ చేయడంతో 209 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికాకు 77 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌ను సఫారీ ఓపెనర్లు మర్క్రమ్ (43 బంతుల్లో 34; 7 ఫోర్లు), ఎల్గర్ (54 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఆశావహంగా ప్రారంభించారు. నిలకడగా ఆడుతూ 52 పరుగులు జోడించారు. కాసేపట్లో రోజు ముగుస్తుందనగా బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా (2/17) వీరిద్దరినీ అవుట్ చేశాడు. భువీ అండగా... 92/7... మిగిలింది హార్దిక్ ఒక్కడే. మహా అయితే మరో 20, 30 పరుగులు చేయగలదేమోనన్న స్థితి నుంచి భారత్ తేరుకుందంటే పాండ్యా, భువనేశ్వర్‌ల విలువైన భాగస్వామ్యమే కారణం. పరిస్థితిని గ్రహించి ఓవైపు పాండ్యా బ్యాట్ ఝళిపిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకోగా... భువీ అతడికి పూర్తి అండగా నిలిచాడు. స్టెయిన్, రబడ, మోర్కెల్‌లను ఎదుర్కొంటూ 34వ బంతికి సింగిల్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికి వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అందులో పాండ్యావే 47 పరుగులుండటం విశేషం. పేసర్లతో కావడం లేదని 56వ ఓవర్లో స్పిన్నర్ మహరాజ్‌ను బౌలింగ్‌కు దింపగా సిక్స్, ఫోర్‌తో హార్దిక్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో డికాక్ స్టంపింగ్ అవకాశాన్ని చేజార్చాడు. మరోవైపు భువీ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. రబడ, స్టెయిన్ల బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. 185/7తో భారత్ టీ విరామానికి వెళ్లింది. స్టెయిన్‌కు గాయం దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ మడమ గాయం కారణంగా రెండో రోజు టీ విరామం అనంతరం బౌలింగ్‌కు దిగలేదు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్ చేయగా... అతనికి నాలుగు నుంచి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో అతను ఈ టెస్టులో మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం లేదు. సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లోనూ అతను ఆడేది అనుమానమే. -
ఎవరు నంబర్‌వన్ అనేది తేలే సమయం
పరుగులు చేయడం, వికెట్లు తీయడం కంటే మాట్లాడటం తేలిక. ఇప్పుడిక అసలు ఆట ప్రారంభమైంది. రెండింటిలో ఏది నంబర్‌వన్ టెస్టు జట్టో తేల్చే సమయం వచ్చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుదీర్ఘ సిరీస్‌లో ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. రెండు జట్లకూ ఎంపికలో ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా పేసర్ల విషయంలో. తీవ్రమైన భుజం గాయం నుంచి డేల్ స్టెయిన్ కోలుకున్నాడు. కానీ మ్యాచ్ ఫిట్నెస్తో ఉన్నాడా? రోజంతా బౌలింగ్ చేయగలడా? అతడి భుజం వేగంగా బంతులు విసిరేందుకు సహకరిస్తుందా? 400లకు పైగా వికెట్లు తీసిన అతడిని తుది జట్టులోకి తీసుకోకుండా ఉండగలమా? ఒకవేళ మళ్లీ గాయపడితే? ఇదంతా దక్షిణాఫ్రికా సందిగ్ధత. ఏ సీమర్‌ను పక్కన పెట్టాలి... ఏ స్పిన్నర్‌ను ఆడించాలి? అనేవి భారత్ సందేహాలు. షమీ, భువనేశ్వర్ జట్టు తొలి ప్రాధాన్యత. వీరికి తోడుగా అదనపు పేస్‌తో పాటు, పాత బంతిని స్వింగ్ చేయగల ఉమేశ్, తిరిగి గాడిలో పడిన ఇషాంత్‌లలో ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడింది. జడేజా జ్వరం కారణంగా ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్ ఖాయమే. కానీ... జడేజా కోలుకుంటే కోహ్లి ఎక్కువగా నమ్మే అతడికే అవకాశం ఉండొచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లు సహా మిడిలార్డర్ గురించి టీమిండియాకు ఇబ్బంది లేదు. లోయర్ ఆర్డర్లో వికెట్ కీపర్ సాహా బ్యాటింగ్ సామర్థ్యం అదనపు బలం. భారత ఫీల్డింగ్ గురించే కొంచెం ఆలోచించాలి. శ్రీలంక సిరీస్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినా అంతిమంగా విజయం దక్కింది. అయితే... జారవిడిచిన క్యాచ్‌లు గెలుపునే దూరం చేస్తాయని ఢిల్లీ టెస్టు నిరూపించింది. స్లిప్ చాలా కీలక ప్రాంతం. సుదీర్ఘ కాలంగా ఉత్తమ క్యాచర్‌గా ఉన్న రహానే సీమర్ల బౌలింగ్‌లో ఎప్పుడోగానీ క్యాచ్‌లు రాని గల్లీలో ఎందుకు? ధావన్, అతడు 1, 2 స్లిప్‌లలో ఉండాలి. జట్టుగా బలంగా ఉన్న భారత్... మైదానంలో కనబరిచే ఆటపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. -
ప్రాక్టీస్‌కు అందరూ డుమ్మా!
కేప్‌టౌన్: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిరీస్‌లో తొలి టెస్టు ఆరంభానికి ముందు రోజు భారత ఆటగాళ్ల వ్యవహారశైలి ఆశ్చర్యపరిచింది. గురువారం జట్టు సభ్యుల్లో ఒక్కరు కూడా కనీసం సాధన చేయలేదు. తప్పనిసరి కాదు, ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమే అని చెప్పుకున్నా... కీలక మ్యాచ్‌కు ముందు కొంత ప్రాక్టీస్ చేయడంలో తప్పేమీ ఉండకపోవచ్చు. మరోవైపు మ్యాచ్‌కు ముందు రోజు మీడియా సమావేశానికి కెప్టెన్లు హాజరు కావడం సాంప్రదాయం. కానీ కోహ్లి దీనికి డుమ్మా కొట్టి అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు. అతను కూడా గంట ఆలస్యంగా వచ్చాడు. దాంతో చిర్రెత్తిన స్థానిక మీడియా తమ అసంతృప్తిని బహిరంగంగానే ప్రదర్శించింది. బంగర్ మాట్లాడుతుండగానే కొందరు రిపోర్టర్లు లేచి వెళ్లిపోయారు. కేప్‌టౌన్‌లో అడుగు పెట్టగానే గతవారం మాట్లాడాడు కాబట్టి కోహ్లి హాజరు కాలేదంటూ భారత మేనేజ్మెంట్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
భారత్... అప్పటిలా లేదు!
కెన్యాలోని సుప్రసిద్ధ ఫించ్ హటన్స్లో నేను కొత్త సంవత్సర వేడుకల్ని ఆస్వాదిస్తున్నా. అక్కడ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్‌తో మాటమాట కలిసింది. కొంతకాలంగా సఫారీ క్రికెట్‌ను కవర్ చేస్తున్న ఆయనతో భారత్–దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించిన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఇరు జట్ల మధ్య సిరీస్ రసవత్తరంగా జరుగుతుందని విశ్లేషించారు. ప్రస్తుత భారత జట్టు లైనప్, అనుభవం దృష్ట్యా గతంలో సఫారీలో ఓడినట్లుగా ఈసారి జరగదన్నారు. భారత ప్రేక్షకులు ఈ క్రికెట్ విందును ఆస్వాదించవచ్చని చెప్పుకొచ్చారు. నిజమే..! గత ఫలితాలను చూసి జరగబోయే సిరీస్‌నూ తేలిగ్గా అంచనా వేస్తే అది తెలివితక్కువ తనమే అవుతుంది. కానీ ఓ విశేష అనుభవజ్ఞుడు చెబితే మాత్రం అది నిజమవుతుంది. హోల్డింగ్ చెప్పింది అదే! బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన అనుభవం సంపాదించింది. ఇంతకుముందు బౌన్సీ వికెట్‌పై తెల్లబోయినట్లు ఇప్పుడు జరగకపోవచ్చు. భారత ఓపెనర్లు ఇప్పటికే చాలాసార్లు స్టెయిన్, మోర్కెల్‌ల బౌన్సర్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా భయపడాల్సిన పనిలేదు. మొండిగా పోరాడే పుజారా గతంలోనే ఇక్కడ భారీ సెంచరీ చేశాడు. కోహ్లి కూడా సెంచరీలతో చేలరేగాడు. రహానే ఇప్పుడు గొప్ప ఫామ్‌లో లేకపోవచ్చు... కానీ విదేశాల్లో అతనికి మెరుగైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తప్పకుండా రాణిస్తుందనే చెప్పాలి. ఇక పేసర్లు కూడా అంతే. అనుభవం నేర్పిన పాఠాలతో రాటుదేలారు. లైన్ అండ్ లెంగ్త్‌పై మంచి అవగాహనతో ఉన్నారు. సీనియర్ స్పిన్నర్ల సంగతి సరే సరి. పిచ్ నుంచి ఏ మాత్రం టర్న్ దొరికినా ఏ ఒక్కరిని విడిచిపెట్టరు. దక్షిణాఫ్రికాకు ఇవేవి తెలియని విషయాలు కాదు... అందుకే పూర్తిస్థాయి జట్టుతో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై వచ్చే అనుకూలతలతో పాటు డివిలియర్స్ తిరిగి జట్టులోకి చేరడం దక్షిణాఫ్రికా బలాన్ని పెంచింది. ఓపెనింగ్‌లో మాత్రం ఎల్గర్, మర్క్రమ్లు ఈ సీజన్లో నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనలేదు. ఇప్పుడు భారత బౌలర్ల రూపంలో వాళ్లకు సవాల్ ఎదురుకానుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నాడు. కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందిపెడుతున్నాడు. ఇలాంటి వైరివర్గాలతో పోటీ రేకెత్తిస్తున్న ఈ సిరీస్ కోసం ఇంకా వేచిచూడటం కష్టమేమో! -
6,7,8 నిలిచేవారెవరు?
2014 డిసెంబర్ 13... వేదిక అడిలైడ్. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మ్యాచ్ చివరి రోజు లక్ష్యం 364. మురళీ విజయ్ (99), విరాట్ కోహ్లి (141) అద్భుతంగా ఆడుతున్నారు. భారత్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇంతలో శతకం చేజార్చుకుంటూ విజయ్ అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సింది 122 పరుగులే. మరో ఎండ్‌లో కోహ్లి పాతుకుపోయాడు. కానీ... తర్వాత అతడికి సహరించేవారు కరవయ్యారు. 78 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. (ఈ జట్టులో అశ్విన్, జడేజా లేరు). 2015 నవంబర్... చండీగఢ్‌లో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జడేజా (38), అశ్విన్ (20) ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరిదే రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండు జట్ల తరఫున స్వల్ప స్కోర్లు నమోదైన ఈ టెస్టులో భారత్ 108 పరుగులతో గెలిచింది. ...ఈ రెండు ఉదాహరణలు స్వదేశంలో అయినా, విదేశంలో అయినా టెస్టుల్లో 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగినవారి ప్రాధాన్యతను చాటుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేపడితే ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తూ, తమవంతుగా పరుగులు చేస్తూ భారీ స్కోరుకు దోహదపడటం, రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు నిచ్చెనలా నిలవడం ఈ స్థానాల్లో ఆడేవారి బాధ్యత. ఒకవేళ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమైతే ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పిస్తూ గౌరవప్రదమైన స్కోరుకు పాటుపడటం వీరి విధి. స్వదేశంలో ఈ విషయంలో మన జట్టుకు ఢోకా లేదు. కూర్పు మారిపోయి అదనంగా పేసర్‌ను ఆడించాల్సిన విదేశాల్లోనే ఈ ఇబ్బందంతా. భారత్ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి ప్రకారం ఓపెనర్లు, పుజారా, కోహ్లి, రహానే/రోహిత్‌లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తొలి అయిదు స్థానాల్లో వస్తారు. ఆరో నంబరు వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహాది. ఇక్కడ ఎలాగూ స్పిన్ పిచ్లే కాబట్టి అశ్విన్, జడేజా 7, 8 స్థానాల్లో ఆడేవారు. మ్యాచ్ పరిస్థితులరీత్యా కొంత మారినా అటుఇటుగా ఈ ముగ్గురిది మాత్రం ఇదే బ్యాటింగ్ ఆర్డర్. బయట మాత్రం ఇది చెల్లుబాటు కాదు. విదేశాల్లో కూర్పు మార్పు... అయిదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఒక ఆల్‌రౌండర్, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు. బహుశా సఫారీ టూర్లో ఇదే భారత్ వ్యూహం. అలవాటైన వికెట్లపై మన బ్యాట్స్‌మన్ స్వదేశంలో పరుగుల వరద పారించేవారు. లోయర్ ఆర్డర్ ఆడినా, ఆడకున్నా ప్రభావం కనిపించేది కాదు. విదేశాల్లో విజయం సాధించాలంటే మాత్రం సమష్టిగా ఆడాల్సిందే. చివరి శ్రేణిలోని బౌలింగ్ ఆల్‌రౌండర్లు... టాప్, మిడిలార్డర్‌కు దన్నుగా నిలవాల్సిందే. వారు తమవంతుగా 20లు 30లైనా జత చేయాలి. అయితే పూర్తి పేస్ పిచ్‌లుండే దక్షిణాఫ్రికాలో ఒక్క స్పిన్నర్‌తోనే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 6, 7 స్థానాల్లో సాహా, హార్దిక్ పాండ్యా, 8లో అశ్విన్ వస్తారు. సరిగ్గా వీరే గెలుపునకు కీలకం అవుతారు. దేశంలో నంబర్‌వన్ టెస్టు కీపర్‌గా పేరున్న సాహా... మూడేళ్ల క్రితం ఆసీస్‌లో కీలక సమ యంలో అనవసర దూకుడు కనబర్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది వెస్టిండీస్‌లో శతకం సాధించి వాటికి తగిన జవాబిచ్చాడు. తెలివైన క్రికెటర్‌గా అశ్విన్ ఎక్కడైనా ఉపయోగపడేవాడే. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడిని కాచుకుంటూ వీరు నమోదు చేసే భాగస్వామ్యాలే జట్టుకు విలువైనవిగా మారతాయనడంతో సందేహం లేదు. హార్దిక్ ఏం చేస్తాడో...? పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇటీవలే లంకపై అరంగేట్రం చేసిన పాండ్యా శతకం కూడా సాధించాడు. భారీ హిట్టింగ్తో బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్న పాండ్యా... తన పేస్ పదును చూపాల్సిన సమయం వచ్చింది. మ్యాచ్ స్థితికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ‘కోహ్లికి పాండ్యా ఒక ఆయుధం’ అన్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలకూ సార్థకత చేకూర్చిన వాడవుతాడు. అచ్చొచ్చే(నా) ‘9’ 9... ఈ సంఖ్యను చాలామంది ఇష్టపడతారు. ఇదే సంఖ్య సఫారీ పర్యటనలో భారత జట్టుకూ ఎంతోకొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థానంలో బ్యాటింగ్ వచ్చేది పేసర్ భువనేశ్వర్. కొంతకాలంగా బౌలింగ్‌లో 140 కి.మీ. వేగం అందుకుంటున్న భువీ బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తున్నాడు. శ్రీలంకతో వన్డేలో బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట అతడు సాధించిన అర్ధ సెంచరీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. స్ట్రోక్స్ ఆడటంలోనూ భువీ మెరుగయ్యాడు. ఈ నేప థ్యంలో దక్షిణాఫ్రికాలోనూ జట్టు బ్యాటింగ్ ప్రయోజనాలకు ఉపయోగపడతామో చూడాలి. చేజారితే మ్యాచ్ పోయినట్లే... అవి అసలు సిసలు పేస్ పిచ్‌లు... బ్యాట్ అంచులకు తగిలిన బంతి స్లిప్‌లోకి వచ్చేందుకు క్షణం కూడా పట్టదు. అలాంటివాటిని ఒడిసిపట్టాలంటే ఫీల్డర్‌కు ఓపికతో పాటు తీక్షణత అవసరం. గతంలో భారత్‌కు ఈ ఏరియాలో రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ వంటివారు పెట్టని కోటగా ఉండేవారు. ప్రస్తుత జట్టులో రహానే తప్ప... స్లిప్ స్పెషలిస్టుల లోటు కనిపిస్తోంది. ఇతడికి తోడుగా మరో చురుకైన ఆటగాడిని ఎంచుకోవాలి. కోహ్లి... ఇటీవలి శ్రీలంక సిరీస్‌లో తరచూ స్లిప్ ఫీల్డర్లను మార్చి ప్రయోగం చేసినా ఫలితం రాబట్టలేకపోయాడు. పైగా విలువైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇదే తీరు ఎల్గర్, ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ వంటి బ్యాట్స్‌మన్ ఉన్న దక్షిణాఫ్రికాపైనా కొనసాగితే విజయం గురించి ఆలోచించడం సాహసమే అవుతుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేసే ఇలాంటివారి క్యాచ్‌లు చేజారిస్తే మ్యాచ్‌లో తిరిగి కోలుకోవడం కష్టం. ధావన్ సిద్ధం... జడేజా అనుమానం! భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అస్వస్థత జట్టును కలవరపరుస్తోంది. రేపటి నుంచి కేప్‌టౌన్ టెస్టు ప్రారంభమవుతుండగా... అతను వైరల్ జ్వరం బారిన పడ్డాడు. ‘ధావన్ ఫిట్‌గా ఉన్నాడు. చీలమండ గాయంతోనే సఫారీకి బయల్దేరిన అతను తొలి టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ తెలిపింది. రెండు రోజులుగా వైరల్ జ్వరం బారిన పడిన జడేజాను బీసీసీఐ వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతను తుది జట్టులో ఉండేది లేనిది శుక్రవారమే తెలుస్తుంది. -
‘కోహ్లి సేనకు ఆ సత్తా ఉంది..!’
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లి సేనపై ప్రశంసలు కురిపించారు. సచిన్ తన మనసులోని మాటలను ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీకి ఇచ్చిన ఇంటార్య్వూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దశాబ్దం(1990) పాటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అదే విధంగా టీమిండియా కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని సచిన్ అన్నారు. మాస్టర్ బ్లాస్టర్ అన్న ఈ మాటలతో మన ఆటగాళ్లకు మరింత ప్రొత్సాహాం లభించింది. ‘ అతి చిన్న వయసులో(16) ఇండియా తరపున ఆడే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తానని సచిన్ పేర్కొన్నారు. ‘నాకు క్రికెట్ ఆక్సిజన్‌తో సమానం. అది లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఫ్యూచర్లోను క్రికెట్‌ను కొనసాగిస్తాను’ అని క్రికెట్ దిగ్గజం తెలిపారు. అంతేకాక నన్ను ఆదరించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్ అన్నారు. సఫారీ గడ్డపై టీమిండియా జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. జనవరి 5వ తేదీ నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. బ్రెట్ లీ ‘అప్ ఇన్ ది గ్రిల్’ అనే తన యూట్యూబ్ షో కోసం చేసిన ఇంటార్య్వూలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఆమ్నెస్టీ పీఠంపై కుమీ నాయుడు
ప్రసిద్ధ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా భారత తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్షెట్టి 2018 ఆగస్ట్‌లో రిటైరయ్యాక నాయుడు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. లండన్కేంద్రస్థానంగా పనిచేసే ఆమ్నెస్టీ అత్యున్నత పదవిలో సలీల్2010 నుంచి కొనసాగుతున్నారు. 52 ఏళ్ల నాయుడు ఇంతకు ముందు గ్రీన్పీస్ఇంటర్నేషన్ఎగ్జిక్యూటివ్డైరెక్టర్గా 2009 నుంచి 2015 వరకూ పనిచేశారు. ఆయన ఈ ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్‌గా మొదట నాలుగేళ్లు ఉంటారు. మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశముంది. డర్బన్నగరంలో దిగువ మధ్య తరగతి భారత సంతతి కుటుంబంలో జన్మించిన నాయుడు 15 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. తండ్రితో గొడవపడిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత దురహంకార సర్కారు పాలనతో సరైన ఆదరణ, కనీస సౌకర్యాలు లేక స్థానిక నల్లజాతివారు, భారత్‌నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబాల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేవని నాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు పుట్టినా మిగిలిన భారత సంతతి జనం మాదిరిగానే నాయడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో నాయడును అనేక సార్లు అరెస్ట్‌చేశారు. పదిహేనేళ్ల వయసులో ఆయనను స్కూలు నుంచి బహిష్కరించాక కూడా ఇంట్లో చదువుకున్నారు. తర్వాత యూనివర్సిటీ లా డిగ్రీ సాధించారు. 1987లో దేశంలో తనకు భద్రత లేదని గ్రహించి ఆయన ఇంగ్లండ్వెళ్లి ఆక్స్ఫర్డ్యూనివర్సిటీలో చేరారు. మండేలా విడుదలతో ఆఫ్రికాలో ఆక్షరాస్యతా ఉద్యమం వర్ణవివక్ష వ్యతిరేక విప్లవపోరాట యోధుడు నెల్సన్మండేలా 1990లో విడుదలయ్యాక నాయుడు ఆక్స్ఫర్డ్చదువును మధ్యలో ఆపేసి దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ నల్లజాతివారి పిల్లలకు, పెద్దలకు చదువు నేర్పే ఉద్యమంలో పనిచేశారు. ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. బానిస సంకెళ్లు తెంచుకున్న మాతృదేశంలో చేయాల్సింది చాలా ఉన్నా ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్పూర్తిచేయడానికి మళ్లీ లండన్వెళ్లారు. తన డాక్టరేట్పూర్తయితే ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ తీసుకునే మొదటి దక్షిణాఫ్రికా భారతీయుడినయ్యే అవకాశం పొందడానికే వెళ్లానని తర్వాత ఆయన వివరించారు. మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా పౌరసమాజం, పౌరుల స్వయం కృషిని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన సివికస్అనే ఎన్జీఓను స్థాపించి దాని లక్ష్య సాధనకు బాగా పనిచేశారు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులు, పౌరసమాజం కోసం చేసిన విశేష కృషిని గుర్తించి ఆమ్నెస్టీ ఇంటర్నేషన్బోర్డు ఆయనను సెక్రెటరీ జనరల్పదవికి ఎంపికచేసింది. లండన్‌లోని ఈ సంస్థ ప్రధాన ప్రతినిధిగా, సెక్రెటేరియట్చీఫ్ఎగ్జిక్యూటివ్గా సెక్రెటరీ జనరల్పనిచేస్తారు. ఆమ్నెస్టీ ప్రపంచంలోనే అతిపెద్ద మానవహక్కుల పరిరక్షణ సంస్థ. 70 దేశాల్లో 2600 మంది సిబ్బందితో దీని కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది సభ్యులు, వలంటీర్లు, మద్దతుదార్లు ఉన్నారు. కుమీ నాయుడు తెలుగు మూలాలు 1860 నుంచి 1911 వరకూ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తమిళులతోపాటు తెలుగువారువ్యవసాయ సామాజికవర్గాలైన రెడ్లు, కాపు బలిజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయం చేయడానికి, కింది కులాలకు చెందిన పేదలు పనిచేయడానికి దక్షిణాఫ్రికాకు వలసపోయారు. అక్కడి తెల్లజాతి పాలకుల దృష్టిలో స్థానిక నల్లజాతివారితో భారత సంతతికి చెందినవారూ సమానమే. అందుకే 20వ శతాబ్దంలో వర్ణవివక్ష వ్యతిరేకపోరాటంలో నల్లజాతివారితో కలిసి భారత సంతతి జనం పోరాడారు. తెలుగువారిలో కొందరు తమ ఉనికి తెలుపుకోవడానికి (ఒక వేళ క్రైస్తవంలోకి మారినా) పేరు చివర నాయుడు అని పెట్టుకునేవారు. ఇలాంటి తెలుగు కార్మిక కుటుంబంలో నాయుడు జన్మించారు. డర్బన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని చాట్స్వర్త్పట్టణానికి బలవంతంగా వేలాది మంది తెలుగువారిని అక్కడి సర్కారు తరలించింది. నాయుడు పుట్టడానికి 50 సంవత్సరాల ముందే డర్బన్నుంచి ఇండియా వెళ్లిపోయిన మోహన్దాస్గాంధీ చిత్రపటం ఇంటి గోడపై వేలాడదీసి ఉంది. శ్వేతదురహంకార సర్కారుపై ఆఫ్రికా నేషనల్‌కాంగ్రెస్(ఏఎన్సీ) సాగించిన సాయుధపోరాటంలో చేరాలని కూడా ఒకానొక దశలో ఆలోచించానని, గాంధీజీ స్పూర్తితో హింసామార్గంలోకి వెళ్లకుండా ఆగిపోయానని నాయుడు చెప్పారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
దక్షిణాఫ్రికా అదే జోరు
బ్లూమ్ఫొంటీన్: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ రాత టి20ల్లోనూ మారలేదు. గత మ్యాచ్‌లతో పోలిస్తే కాస్త పోరాటపటిమ కనబర్చినా... చివరకు ఓటమి తప్పలేదు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 20 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు) చెలరేగగా, డి కాక్ (44 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. చివర్లో బెహర్దీన్ (17 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడు ప్రదర్శించాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ప్యాటర్సన్, హెండ్రిక్స్, ఫ్రైలింక్, ఫెలుక్వాయో తలా 2 వికెట్లు తీశారు. -
దక్షిణాఫ్రికా 496/3 డిక్లేర్డ్
పోష్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (199; 15 ఫోర్లు, 3 సిక్సర్లు), హాషీమ్ ఆమ్లా (137; 17 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్ బౌలర్లతో ఆటాడుకున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఎల్గర్ పరుగు తేడాతో ‘డబుల్ సెంచరీ’ని చేజార్చుకున్నాడు. కానీ... ఓవరాల్‌గా 199 పరుగుల వద్ద ఔటైన పదో బ్యాట్స్‌మన్‌గా టెస్టు చరిత్రలో నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున తొలి బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోరు 298/1తో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 146 ఓవర్లలో 496/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్, ఆమ్లా రెండో వికెట్‌కు 215 పరుగులు జోడించారు. బవుమా (31 నాటౌట్), డు ప్లెసిస్ (26 నాటౌట్) అజేయంగా నిలిచారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. -
చెలరేగిన సఫారీలు
ముంబై: టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగుల భారీ స్కోరు చేసింది. సఫారీ ఓపెనర్లు హషిమ్ ఆమ్లా(31 బంతుల్లో 58 పరుగులు), డికాక్(24 బంతుల్లో 52 పరుగులు) ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరి వీర విహారంతో 7 ఓవర్లకే సౌతాఫ్రికా స్కోరు 96 పరుగులకు చేరుకుంది. అనంతరం స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లను కోల్పోవడంతో స్కోరు కాస్త నెమ్మదించింది. డివిలియర్స్(16), డుప్లిసిస్(17) దాటిగా ఆడే ప్రయత్నంలో త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుమిని(28 బంతుల్లో 54 పరుగులు), మిల్లర్(12 బంతుల్లో 28) చివర్లో దాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీకి 2 వికెట్లు దక్కగా.. విల్లీ, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. -
డ్రా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్
ముంబై: దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్ నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు.