
వర్షం కారణంగా మూడో రోజు ఆట తుడిచి పెట్టుకుపోయింది. పిచ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచి, గడ్డి కూడా తొలగించలేదు. కొద్దిగా మేఘావృతంగా ఉన్న కేప్‌టౌన్ వాతావరణంలో భారత కొత్త బంతి బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. స్వింగ్ చేయగలిగారు. క్లాస్ బ్యాట్స్‌మన్ అయిన డివిలియర్స్ తప్ప మిగతా ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. భారత క్యాచింగ్, కోహ్లి ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి. లంచ్ అనంతరం ఎండ మొదలై... పిచ్ పొడిబారడం ప్రారంభించింది. అయినప్పటికీ భారీకాయులు, పొడగరులైన దక్షిణాఫ్రికా బౌలర్లకు అదనపు బౌన్స్ రాబట్టడం కష్టమైంది. ఆస్ట్రేలియాలోలానే ఇక్కడా ధావన్ షార్ట్ బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. కొంత తప్పించుకుంటూ పుల్ షాట్ ఆడే యత్నంలో అతడు అవుటయ్యాడు.
ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతికి పుజారా వెనుదిరిగాడు. బౌన్సీ పిచ్‌లపై బ్యాట్స్‌మన్ బ్యాక్‌ఫుట్ సరిగా లేకుంటే రాణించడం కష్టం. సన్నాహక మ్యాచ్ ఆడి... స్థానిక బౌలర్లను ఎదుర్కొని ఉంటే, దక్షిణాఫ్రికా పొడగరి బౌలర్లతో ఇబ్బంది ఎదురై ఉండేది కాదు. వేగం, పదునుతో షమీ పాత ఫామ్‌ను అందుకున్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా క్రమంగా ఎదగడంతో పాటు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాట్‌తో విఫలమైనా... చివరి వరుస ఆటగాళ్లు కొంత పోరాడగలమని చాటారు. ఆధునిక క్రికెట్ షెడ్యూల్లో సిరీస్ మధ్యలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండా ఆడటమంటే... గాలిని చేతితో ఒడిసిపట్టడమే.
Comments
Please login to add a commentAdd a comment