చివరి వన్డేలోనూ ఓడిన రోహిత్ సేన స్పిన్‌కు దాసోహమైన బ్యాటర్లు
138 పరుగులకే ఆలౌట్
లంకను గెలిపించిన అవిష్క, కుశాల్, వెలలగే
కొలంబో: ఆతిథ్య స్పిన్‌ను ఎదుర్కోలేక బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు సిరీస్‌ను సమం చేసుకోలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన టీమిండియా సిరీస్‌ను 0–2తో శ్రీలంకకు సమరి్పంచుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59; 4 ఫోర్లు) రాణించారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగుల వద్దే కుప్పకూలింది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! తర్వాత టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దునిత్ వెలలగే (5/27) చావుదెబ్బ తీయగా, వాండెర్సే, తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తమకు కలిసొచి్చన స్పిన్ ట్రాక్‌పై పది వికెట్లలో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టేశారు.
టాపార్డర్ రాణింపుతో...
టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక, అవిష్క ఫెర్నాండో శుభారంభమిచ్చారు. ఓపెనర్లిద్దరు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. స్పిన్నర్లను దించినా యథేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు ఓపెనింగ్ వికెట్‌కు 89 పరుగులు జతయ్యాక నిసాంకను అక్షర్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచి్చన కుశాల్‌తో అవిష్క మరో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాడు. 65 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొని సెంచరీ దిశగా సాగుతున్న అవిష్కను జట్టు స్కోరు 171 వద్ద పరాగ్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అసలంక (10), సమరవిక్రమ (0), జనిత్ (8), వెలలగే (2)లపై భారత బౌలర్లు ప్రభావం చూపారు. 77 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కుశాల్‌ను కుల్దీప్ బోల్తా కొట్టించడంతో లంకను 250 పరుగుల్లోపే కట్టడి చేశారు.
ఈసారి వెలలగే వలలో...
ఓపెనర్, కెపె్టన్ రోహిత్ ఎప్పట్లాగే తనశైలి దూకుడుతో ఆరంభం నుంచే ధాటిగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. కానీ శుబ్‌మన్ గిల్ (6) సీమర్ అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లోనే క్లీన్»ౌల్డయ్యాడు. కోహ్లి (18 బంతుల్లో 20; 4 ఫోర్లు)తో కలిసి ‘హిట్‌మ్యాన్’ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. కానీ కాసేపటికే వెలలగే స్పిన్ మ్యాజిక్‌కు రోహిత్ వికెట్ సమరి్పంచుకోవడంతో గత రెండు మ్యాచ్‌ల వైనమే ఇందులోనూ కొనసాగింది. కెప్టెన్ వికెట్ పడగానే షరామామూలుగా రిషభ్ పంత్ (9), కోహ్లి, అక్షర్ పటేల్ (2), శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్‌కు క్యూకట్టడంతో 82 పరుగులకే భారత్ 6 వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. జట్టుస్కోరు 100 పరుగులకు చేరగానే వాండెర్సే... పరాగ్ (15)ను, తదుపరి ఓవర్లో శివమ్ దూబే (9)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ కొద్దిపాటి మెరుపులతో వంద పైచిలుకు స్కోరు చేసిందే తప్ప కనీసం 150 దగ్గరకు వెళ్లలేకపోయింది. సుందర్‌ను తీక్షణ, కుల్దీప్ (6)ను వెలలగే అవుట్ చేయడంతో భారత్ ఆలౌటైంది.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పంత్ (బి) అక్షర్ 45; అవిష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 96; కుశాల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 59; అసలంక (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 10; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; జనిత్ (బి) సుందర్ 8; వెలలగే (బి) పరాగ్ 2; కమిండు (నాటౌట్) 23; తీక్షణ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 248.
వికెట్ల పతనం: 1–89, 2–171, 3–183, 4–184, 5–196, 6–199, 7–235.
బౌలింగ్: సిరాజ్ 9–0–78–1, శివమ్ దూబే 4–0–9–0, అక్షర్ 10–1–41–1, సుందర్ 8–1–29–1, కుల్దీప్ 10–0–36–1, రియాన్ పరాగ్ 9–0–54–3.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కుశాల్ (బి) వెలలగే 35; గిల్ (బి) అసిత ఫెర్నాండో 6; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 20; పంత్ (స్టంప్డ్) కుశాల్ (బి) తీక్షణ 6; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 8; అక్షర్ (బి) వెలలగే 2; పరాగ్ (బి) వాండెర్సే 15; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 9; సుందర్ (సి) వాండెర్సే (బి) తీక్షణ 30; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 6; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (26.1 ఓవర్లలో ఆలౌట్) 138.
వికెట్ల పతనం: 1–37, 2–53, 3–63, 4–71, 5–73, 6–82, 7–100, 8–101, 9–138, 10–138.
బౌలింగ్: అసిత ఫెర్నాండో 5–0–29–1, తీక్షణ 8–0–45–2, వెలలగే 5.1–0–27–5, వాండెర్సే 5–0–34–2, అసలంక 3–1–2–0.
Comments
Please login to add a commentAdd a comment