సాక్షి, విశాఖపట్నం: శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్ వైపు మొగ్గు చూపాడు. టాస్ నెగ్గిన వెంటనే ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇదివరకే సిరీస్ లో లంక, భారత్‌లు 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో నెగ్గి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన ఎదురుచూస్తోంది. మరోవైపు భారతగడ్డమీద టీమిండియాపై ఎలాగైనా తొలి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని లంకేయులు ఉవ్విళ్లూరుతున్నారు.
సుందర్ ఔట్.. కుల్దీప్ ఇన్!
భారత జట్టులో ఓ మార్పు చేశారు. కొత్త కుర్రాడు వాషింగ్టన్ సుందర్‌కు నిరాశ ఎదురైంది. కీలకమైన మూడో వన్డేలో బౌలింగ్ దాడిని పెంచాలని అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.
జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్ యాదవ్.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్ ప్రదీప్.
Comments
Please login to add a commentAdd a comment