third ODI
-
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
India vs Sri Lanka: 27 ఏళ్ల తర్వాత... శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
కొలంబో: ఆతిథ్య స్పిన్‌ను ఎదుర్కోలేక బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు సిరీస్‌ను సమం చేసుకోలేకపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన టీమిండియా సిరీస్‌ను 0–2తో శ్రీలంకకు సమరి్పంచుకుంది. బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీమిండియాపై 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (82 బంతుల్లో 59; 4 ఫోర్లు) రాణించారు. రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగుల వద్దే కుప్పకూలింది. రోహిత్ శర్మ (20 బంతుల్లో 35; 6 ఫోర్లు, 1 సిక్స్) చేసిన పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్! తర్వాత టెయిలెండర్ వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దునిత్ వెలలగే (5/27) చావుదెబ్బ తీయగా, వాండెర్సే, తీక్షణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తమకు కలిసొచి్చన స్పిన్ ట్రాక్‌పై పది వికెట్లలో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టేశారు. టాపార్డర్ రాణింపుతో... టాస్ నెగ్గగానే బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు నిసాంక, అవిష్క ఫెర్నాండో శుభారంభమిచ్చారు. ఓపెనర్లిద్దరు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. స్పిన్నర్లను దించినా యథేచ్ఛగా పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు ఓపెనింగ్ వికెట్‌కు 89 పరుగులు జతయ్యాక నిసాంకను అక్షర్ అవుట్ చేశాడు. కానీ తర్వాత వచి్చన కుశాల్‌తో అవిష్క మరో భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాడు. 65 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకొని సెంచరీ దిశగా సాగుతున్న అవిష్కను జట్టు స్కోరు 171 వద్ద పరాగ్ పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అసలంక (10), సమరవిక్రమ (0), జనిత్ (8), వెలలగే (2)లపై భారత బౌలర్లు ప్రభావం చూపారు. 77 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కుశాల్‌ను కుల్దీప్ బోల్తా కొట్టించడంతో లంకను 250 పరుగుల్లోపే కట్టడి చేశారు. ఈసారి వెలలగే వలలో... ఓపెనర్, కెపె్టన్ రోహిత్ ఎప్పట్లాగే తనశైలి దూకుడుతో ఆరంభం నుంచే ధాటిగా పరుగులు రాబట్టే పనిలో పడ్డాడు. కానీ శుబ్‌మన్ గిల్ (6) సీమర్ అసిత ఫెర్నాండో వేసిన ఐదో ఓవర్లోనే క్లీన్»ౌల్డయ్యాడు. కోహ్లి (18 బంతుల్లో 20; 4 ఫోర్లు)తో కలిసి ‘హిట్‌మ్యాన్’ జట్టు స్కోరును 50 పరుగులు దాటించాడు. కానీ కాసేపటికే వెలలగే స్పిన్ మ్యాజిక్కు రోహిత్ వికెట్ సమరి్పంచుకోవడంతో గత రెండు మ్యాచ్‌ల వైనమే ఇందులోనూ కొనసాగింది. కెప్టెన్ వికెట్ పడగానే షరామామూలుగా రిషభ్ పంత్ (9), కోహ్లి, అక్షర్ పటేల్ (2), శ్రేయస్ అయ్యర్ (8) పెవిలియన్‌కు క్యూకట్టడంతో 82 పరుగులకే భారత్ 6 వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. జట్టుస్కోరు 100 పరుగులకు చేరగానే వాండెర్సే... పరాగ్ (15)ను, తదుపరి ఓవర్లో శివమ్ దూబే (9)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఆ కొద్దిపాటి మెరుపులతో వంద పైచిలుకు స్కోరు చేసిందే తప్ప కనీసం 150 దగ్గరకు వెళ్లలేకపోయింది. సుందర్‌ను తీక్షణ, కుల్దీప్ (6)ను వెలలగే అవుట్ చేయడంతో భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పంత్ (బి) అక్షర్ 45; అవిష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 96; కుశాల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 59; అసలంక (ఎల్బీడబ్ల్యూ) (బి) పరాగ్ 10; సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; జనిత్ (బి) సుందర్ 8; వెలలగే (బి) పరాగ్ 2; కమిండు (నాటౌట్) 23; తీక్షణ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–89, 2–171, 3–183, 4–184, 5–196, 6–199, 7–235. బౌలింగ్: సిరాజ్ 9–0–78–1, శివమ్ దూబే 4–0–9–0, అక్షర్ 10–1–41–1, సుందర్ 8–1–29–1, కుల్దీప్ 10–0–36–1, రియాన్ పరాగ్ 9–0–54–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) కుశాల్ (బి) వెలలగే 35; గిల్ (బి) అసిత ఫెర్నాండో 6; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 20; పంత్ (స్టంప్డ్) కుశాల్ (బి) తీక్షణ 6; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 8; అక్షర్ (బి) వెలలగే 2; పరాగ్ (బి) వాండెర్సే 15; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 9; సుందర్ (సి) వాండెర్సే (బి) తీక్షణ 30; కుల్దీప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వెలలగే 6; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (26.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–37, 2–53, 3–63, 4–71, 5–73, 6–82, 7–100, 8–101, 9–138, 10–138. బౌలింగ్: అసిత ఫెర్నాండో 5–0–29–1, తీక్షణ 8–0–45–2, వెలలగే 5.1–0–27–5, వాండెర్సే 5–0–34–2, అసలంక 3–1–2–0. -
రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్‌కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుసాల్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్‌పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
సమం చేస్తారా.. సమర్పిస్తారా!
కొలంబో: టి20 సిరీస్‌ను సులువుగా గెలుచుకున్న టీమిండియాకు వన్డే సిరీస్ గెలుపు కూడా లాంఛనమే అనిపించింది. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో ఉన్న పూర్తిస్థాయి టీమిండియాకు వన్డేల్లో ఎవరూ ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. తొలి వన్డేను గెలుపు మెట్టుపై ‘టై’ చేసుకున్న రోహిత్ బృందం రెండో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 97/0తో పటిష్టస్థితిలో ఉండి కూడా... లంక స్పిన్ మాయాజాలానికి అనూహ్యంగా కుప్పకూలింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఆలౌటైంది. బంతులు మాత్రం మిగిలిపోయాయి. అంటే మన బ్యాటర్లు క్రీజులో నిలువడమే కష్టమైపోతోంది. కోహ్లి, రాహుల్‌లాంటి సీనియర్లపై కూడా ఆతిథ్య స్పిన్ బౌలింగ్ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది జట్టును కలవరపెడుతోంది. మరోవైపు 1–0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న శ్రీలంక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆఖరి పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మన బ్యాట్లకు పని చెప్పాల్సిందే! ఈ పర్యటనలో భారత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడింది. మూడు టి20లు సహా, గత రెండు వన్డేల్లోనూ బౌలర్లు ప్రతాపం చూపారు. కానీ బ్యాటర్లే ఆ రేంజ్లో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా వన్డేల్లో చక్కని శుభారంభాలు వచి్చనా... కెపె్టన్ రోహిత్ శర్మ ధాటైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని సులువుగా మారుస్తున్నా... తర్వాత వచి్చ న బ్యాటర్లు మిగిలిన లక్ష్యాన్ని ఛేదించలేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన టీమ్ మేనేజ్మెంట్ ఆఖరి పోరులో తమ బ్యాటింగ్ దళాన్ని సన్నద్ధం చేస్తోంది. రోహిత్ ఆడినట్లే టాపార్డర్‌లో కోహ్లి, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఏ కాస్తోకూస్తో ఆడినా... కొన్ని ఓవర్లు క్రీజులో పాతుకుపోయినా ఎంతటి స్పిన్నయినా తుత్తునీయలు చేయొచ్చు. జోరు మీదున్న లంక టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో పల్లెకెలెలో పోగొట్టుకున్న పరువును కొలంబోలో కొల్లగొట్టాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది. చక్కగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. పైగా 1–0తో ఉన్న శ్రీలంక ఇప్పుడు సిరీస్ కోల్పోలేని స్థితిలో ఉంది. ఒత్తిడేమో భారత్‌పై ఉంది. దీన్ని సది్వనియోగం చేసుకొని తమ స్పిన్‌తో తిప్పేయాలని వాండెర్సే, అసలంక పిడికిలి బిగిస్తున్నారు. కొలంబో వేదికపై లక్ష్యఛేదన మ్యాచ్ సాగేకొద్దీ కష్టతరమవుతోంది కాబట్టి టాస్ గెలిస్తే మాత్రం మరో మాటకు తావులేకుండా ఏ జట్టయినా బ్యాటింగే ఎంచుకోవడం ఖాయం. పిచ్, వాతావరణం కొలంబో పిచ్ స్పిన్‌కు స్వర్గధామం. దీనివల్లే ఆతిథ్య స్పిన్నర్లు చెలరేగుతున్నారు. బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే! వర్ష సూచన ఉన్నా... మ్యాచ్‌కైతే ఇబ్బంది ఉండకపోవచ్చు. -
INDW VS AUSW, 3rd ODI: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్ స్వీప్
వాంఖడే వేదికగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. జార్జియా వేర్హమ్ (3/23), మెగాన్ షట్ (2/23), అలానా కింగ్ (2/21), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (2/9) ధాటికి 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (29), రిచా ఘోష్ (19), జెమీమా రోడ్రిగెజ్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ప్రస్తుత భారత పర్యటనలో ఆసీస్ తదుపరి టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. -
టీమిండియాతో మూడో వన్డే.. భారీ స్కోర్ సాధించిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్ ఇదివరకే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో మాత్రం టీమిండియా ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ ఆనంతరం జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
IND VS SA 3rd ODI: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సాయి సుదర్శన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో (32.2వ ఓవర్) మిడాఫ్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి.. పక్షిలా ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్యాటర్ క్లాసెన్ (21) సహా ఈ క్యాచ్‌ను చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెంటేటర్లు ఈ క్యాచ్‌ను క్యాచ్ ఆఫ్ ద సిరీస్‌గా అభివర్ణించారు. క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Catch of the series - Sai Sudharsan 🫡🔥pic.twitter.com/tKr2Vrj3tq — Johns. (@CricCrazyJohns) December 21, 2023 కాగా, భారత్ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓటమి దిశగా సాగుతుంది. 38 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 192/7గా ఉంది. సౌతాఫ్రికా గెలవాలంటే 72 బంతుల్లో 105 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. రీజా హెండ్రిక్స్ (19), జార్జీ (81), డస్సెన్ (2), మార్క్రమ్ (36), క్లాసెన్ (21), మిల్లర్ (10), ముల్దర్ (1) ఔట్ కాగా.. కేశవ్ మహారాజ్ (9), హెండ్రిక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (108) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. -
IND VS SA 3rd ODI: సంజూ సెంచరీ.. బట్లర్ ఏం చేశాడో చూడండి..!
ఇంగ్లండ్ పరిమత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తన ఐపీఎల్ జట్టు (రాజస్థాన్ రాయల్స్) సారధి సంజూ శాంసన్‌పై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న మూడో వన్డేలో సంజూ సెంచరీ (108) సాధించగా.. బట్లర్ తన కెప్టెన్ సాధించిన ఘనతను, అలాగే మరో రాయల్ (చహల్) కెప్టెన్‌ను అభినందిస్తున్న దృశ్యాన్ని తన ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశాడు. బట్లర్ ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. Jos Buttler's Instagram story for Sanju Samson. pic.twitter.com/uSBAcKKCTZ — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 బట్లర్.. తన ఐపీఎల్ సహచరుడు సాధించిన ఘనతను సెలబ్రేట్ చేసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంజూతో సమానంగా బట్లర్‌ను కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. రాయల్స్‌కు తమ కెప్టెన్‌పై ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి ఫిదా అవుతున్నారు. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. సిరీస్ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కషాల్లో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా సంజూ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూతో పాటు తిలక్ వర్మ (52) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రింకూ సింగ్ (38) తనదైన స్టయిల్లో మెరుపులు మెరిపించాడు. Celebration by Sanju Samson after completing his maiden International hundred. 💪🫡 pic.twitter.com/fuHEwz0RPw — Johns. (@CricCrazyJohns) December 21, 2023 The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 -
IND VS SA 3rd ODI: శతక్కొట్టాక సంజూ సంబురాలు చూడండి..!
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుపెట్టి ఎనిమిది ఏళ్లు పూర్తయిన అనంతరం సంజూ శాంసన్ తన తొలి సెంచరీ సాధించాడు. 2015లో తొలిసారి టీమిండియాకు ఆడిన సంజూ (టీ20ల్లో) సుదీర్ఘ విరామం తర్వాత మూడంకెల మార్కును తాకాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూ తన తొలి అంతర్జాతీయ సెంచరీని బాది టీమిండియా అభిమానులకు క్రిస్మస్ కానుకను అందించాడు. సిరీస్ డిసైడర్‌లో క్లిష్టమైన పిచ్‌పై జట్టు కష్ట సమయంలో (49/2) ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. చాలా ఓపిగ్గా ఇన్నింగ్స్‌ను నిర్మించి సెంచరీ మార్కును చేరాడు. 110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ అనంతరం సంజూ చేసుకున్న సంబురాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. The hundred moment of Sanju Samson. 🔥pic.twitter.com/WjWODyjF3p — Johns. (@CricCrazyJohns) December 21, 2023 సంజూ తన హెల్మెట్‌ను కింద పడేసి కండలు చూపిస్తూ సంబురాలు చేసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. సంజూతో పాటు స్టాండ్స్‌లో ఉన్న చహల్ సైతం అదే రేంజ్లో సంబురాలు చేసుకున్నాడు. సంజూ, చహల్ ఇద్దరూ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే. The way Yuzi Chahal celebrated the hundred of Sanju Samson. 👏 pic.twitter.com/XrC4hNxgXK — Johns. (@CricCrazyJohns) December 21, 2023 సిరీస్ డిసైడర్‌లో సంజూ ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటర్లు ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి కేరళ క్రికెటర్‌గా సంజూ చరిత్రలో నిలిచిపోతాడు. Rinku Singh, the finisher - 38 runs from just 27 balls, giving a perfect finish for 🇮🇳 pic.twitter.com/CuL1YRK2XP — Johns. (@CricCrazyJohns) December 21, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికా ఛేజింగ్ చేయాల్సి ఉంది. -
అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్.. 14 ఏళ్ల తర్వాత..!
టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 21 పరుగులు చేసిన రాహుల్ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో (వన్డేల్లో) 1000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల క్రితం ఈ ఫీట్‌ను టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని సాధించాడు. కాగా, సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్‌లతో (10) పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (44), తిలక్ వర్మ (6) క్రీజ్‌లో ఉన్నారు. 25 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/3గా ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, హెండ్రిక్స్, ముల్దర్లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 1-1తో సమంగా ముగిసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. డిసెంబర్ 26న తొలి టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3న రెండో టెస్ట్ ప్రారంభమవుతాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్‌లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్‌లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్‌లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్‌లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సంజూ పెవిలియన్‌కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్‌ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్‌పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్‌లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్‌లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
IND VS AUS 3rd ODI: రోహిత్ రేర్ ఫీట్.. వన్డేల్లో తొలిసారి..!
టీమిండియా సారథి రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లో తొలిసారి ఓ రేర్ ఫీట్‌ను సాధించాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్.. తన వన్డే కెరీర్లో మొట్టమొదటి సారి హాఫ్ సెంచరీ మార్క్‌ను పవర్‌ప్లేలో టచ్ చేశాడు. హిట్‌మ్యాన్ 251 మ్యాచ్‌ల వన్డే కెరీర్లో తొలిసారి ఇంత వేగంగా (పవర్ ప్లేలో) హాఫ్ సెంచరీ మార్కును (31 బంతుల్లో) చేరుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిట్‌మ్యాన్ ఇదే జోరును కొనసాగిస్తే రానున్న వరల్డ్‌కప్ పవర్‌ప్లేల్లో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలే అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 57 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇదే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ మరో రికార్డును కూడా సాధించాడు. స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (260) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్.. స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 3 సిక్సర్ల దూరంలో (551) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔటయ్యాడు. 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. -
IND VS AUS 3rd ODI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔట్ కాగా.. విరాట్ క్రీజ్‌లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/1గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
IND VS AUS 3rd ODI: వన్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శన
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసు గుర్రం అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. బుమ్రా తన వన్డే కెరీర్లో చెత్త గణాంకాల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు (81) సమర్పించుకుని, ఈ మ్యాచ్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఇండియన్ బౌలర్ అయ్యాడు. 2017లో కటక్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా ఇలాగే 81 పరుగులు సమర్పించుకున్నాడు. వవ్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శనల్లో ఇవి టాప్ 2లో ఉండగా.. 2017లో ఇంగ్లండ్‌పై సమర్పించుకున్న 79 పరుగులు, 2020లో ఆసీస్‌పై సమర్పించుకున్న 79 పరుగులు ఆ తర్వాతి చెత్త ప్రదర్శనలుగా రికార్డయ్యాయి. ఇవాల్టి మ్యాచ్‌లో బుమ్రా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలి 5 ఓవర్లలో వికెట్లేమీ తీసుకోకుండా 51 పరుగులు ఇచ్చిన అతను.. ఆతర్వాతి 5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తీసిన 3 వికెట్లలో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన యార్కర్ డెలివరీ హైలైట్ అని చెప్పాలి. -
IND VS AUS 3rd ODI: అరుదైన క్లబ్లో చేరిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్లో చేరాడు. రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 27) జరుగుతున్న మూడో వన్డేలో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును అందుకున్న 17వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 145 వన్డేలు ఆడిన స్మిత్.. 12 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5049 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్మిత్ 70 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్‌ల్లో 18426 పరుగులు) పేరిట ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ రికార్డు రికీ పాంటింగ్ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్ 374 వన్డేల్లో 13589 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున వన్డేల్లో 10000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు కూడా పాంటింగే కావడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియాతో మూడో వన్డేలో ఆసీస్ ధాటిగా ఆడుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 31 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. డేవిడ్ వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. స్మిత్ (70), లబూషేన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
భారత్ అలౌట్ 286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సంగా బౌలింగ్‌లో జడేజా(35) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (2) క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (48) క్లీన్ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (8) ఔటయ్యాడు. భారత్ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్ విరాట్ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/3గా ఉంది. శ్రేయస్ (14), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 168/2గా ఉంది. విరాట్ (54), శ్రేయస్ (13) క్రీజ్‌లో ఉన్నారు.భారత్ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 153/2గా ఉంది. విరాట్ కోహ్లి (46), శ్రేయస్ అయ్యర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (18) ఔటయ్యాడు. రోహిత్ శర్మ (55), విరాట్ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్ శర్మ 353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో సుందర్ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 56/0గా ఉంది. రెచ్చిపోయిన ఆసీస్ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం టాపార్డర్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్ బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 345/7. ఆరో వికెట్ కోల్పోయిన అసీస్ 299 పరుగుల వద్ద ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ (9) ఔటయ్యాడు. లబూషేన్ (42), కమిన్స్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (5) క్లీన్ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 281/5. లబూషేన్ (33), గ్రీన్ క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 267 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అలెక్స్ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్ (26), మ్యాక్స్‌వెల్ క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్ 242 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్ (74) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 242/3గా ఉంది. లబూషేన్ (13), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్ మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 215/2. స్మిత్ (61), లబూషేన్ క్రీజ్‌లో ఉన్నారు. స్మిత్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్ 26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 202/1. 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ ఎంతంటే..? 15 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 120/1గా ఉంది. మిచెల్ మార్ష్ (43), స్టీవ్ స్మిత్ (21) క్రీజ్‌లో ఉన్నారు. విధ్వంసకర హాఫ్ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 84/1. మిచెల్ మార్ష్ (22), స్టీవ్ స్మిత్ (6) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్ విధ్వంసకర హాఫ్ సెంచరీ చాలా రోజుల తర్వాత వార్నర్ మునుపటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో అతను 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి వార్నర్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ధాటిగా ఆడుతున్న వార్నర్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్ (27 బంతుల్లో 43), మిచెల్ మార్ష్ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 65/0గా ఉంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్. -
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురు.. సిరీస్ కైవసం చేసుకున్న కివీస్
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు చుక్కెదురైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన మూడో వన్డేలో పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులకు ఆలౌటైంది. ఆడమ్ మిల్నే (4/34), ట్రెంట్ బౌల్ట్ (2/33), మెక్‌కొంచి (2/18) బంగ్లా పతనాన్ని శాశించగా.. లోకి ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో (76) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తౌహిద్ హ్రిదోయ్ (18), ముష్ఫికర్ రహీమ్ (18), మహ్మదుల్లా (21), మెహిది హసన్ (13) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ యంగ్ (70), హెన్రీ నికోల్స్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్ (28), టామ్ బ్లండెల్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ అరంగేట్రం ఆటగాడు డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టగా.. నసుమ్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
పసికూన ఐర్లాండ్‌పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్‌కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డకెట్‌తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో) కాగా, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్‌కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు. -
BAN VS NZ 3rd ODI: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 మ్యాచ్‌ల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. కెరీర్లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/33), ఆడమ్ మిల్నే (4/34), ఫెర్గూసన్ (1/26), రచిన్ రవీంద్ర (1/20), కోల్ మెక్‌కొంచి (2/18) బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొహాలీలో వేదికగా జరిగిన తొలి వన్డేను 5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఇండోర్‌లో నిన్న (సెప్టెంబర్ 24) జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే ఈనెల 27న రాజ్‌కోట్‌లో జరుగనుంది. రోహిత్ రీఎంట్రీ.. ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ మూడో వన్డే బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. ఈ వన్డేకు శుభ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇవ్వడంతో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. విరాట్, హార్దిక్ కూడా.. తొలి రెండు వన్డేలకు రోహిత్‌తో పాటు రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు సైతం మూడో వన్డే బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరితో పాటు రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా సైతం ఆఖరి వన్డే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. జట్టు మేనేజ్మెంట్ జడేజాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తేనే కుల్దీప్ బరిలో ఉంటాడు. అశ్విన్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన సిరాజ్ ఈ మ్యాచ్‌లో కూడా నిరీక్షించాల్సి ఉంటుంది. గిల్‌తో పాటు తొలి రెండు వన్డేలు ఆడిన శార్దూల్ ఠాకూర్ కూడా రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకే ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో నుంచి సైతం శార్దూల్‌ను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. అతని స్థానంలో అశ్విన్ జట్టులోకి రావడం ఖాయమని సమాచారం. ఆసీస్‌తో మూడో వన్డేకు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా -
IND VS AUS 3rd ODI: టీమిండియాకు భారీ షాక్
ఈనెల 27న రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నామమాత్రపు చివరి వన్డేకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. ఆసియా కప్-2023 సందర్భంగా గాయపడి, ఆసీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక ఆసీస్‌తో జరిగే మూడో వన్డేకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్‌లో ఉన్న అక్షర్ గాయం నుంచి కోలుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత సెలక్టర్లు ఆసీస్‌తో మూడో వన్డేకు అక్షర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్షర్ వరల్డ్‌కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అక్షర్ వరల్డ్‌కప్ సన్నాహక మ్యాచ్‌ల సమయానికంతా కోలుకుంటాడని చెబుతున్నాయి. మరోవైపు వరల్డ్‌కప్‌లో అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్‌తో సిరీస్‌లో జోరును ప్రదర్శిస్తూ సెలెక్టర్లకు సవాలు విసిరాడు. యాష్ ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో వరల్డ్‌కప్‌లో స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వరల్డ్‌కప్ సమయానికి అక్షర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. అక్షర్, అశ్విన్‌లలో ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. వీరిద్దరిలోనే ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కాక సెలెక్టర్లు సతమతమవుతుంటే, వాషింగ్టన్ సుందర్ నేను కూడా లైన్లో ఉన్నానంటూ సవాలు విసురుతున్నాడు. మరి ఉన్న ఒక్క స్పిన్ ఆల్‌రౌండర్ పోజిషన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా, వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల బృంధాన్ని అన్ని జట్లు సెప్టెంబర్ 28వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. నిన్న జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
శివాలెత్తిన బెన్ స్టోక్స్.. 15 ఫోర్లు, 9 సిక్సర్లు.. డబుల్ సెంచరీ మిస్
వరల్డ్‌కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని జట్టులో చేరిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్‌బై చెప్పిన స్టోక్సీ.. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుతున్న సిరీస్‌తోనే వన్డే క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. రెండో వన్డేలో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. The highest individual ODI score for England 🙌 1⃣8⃣2⃣ runs 1⃣2⃣4⃣ balls Sixes 9⃣ Fours 1⃣5⃣ See them all here 👇 — England Cricket (@englandcricket) September 13, 2023 లండన్‌లోని కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 14) జరుగుతున్న మూడో వన్డేలో తొలి బంతి నుంచి పూనకం వచ్చినట్లు ఊగిపోయిన స్టోక్స్ పట్టపగ్గాల్లేకుండా పేట్రేగిపోయాడు. కేవలం 124 బంతుల్లోనే 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. 1⃣8⃣2⃣ reasons to catch up on that simply incredible innings 😱 We put 3⃣6⃣8⃣ on the board 🏏💥 See the best of the action here 👇 — England Cricket (@englandcricket) September 13, 2023 తొలుత డేవిడ్ మలాన్ (95 బంతుల్లో 96; 12 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోతున్న సమయంలో ఆచితూచి ఆడిన స్టోక్స్.. అర్ధసెంచరీ పూర్తి చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మలాన్ 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ ఏమాత్రం తగ్గని స్టోక్స్, రెట్టింపు ఉత్సాహంతో బౌండరీలు, సిక్సర్లు బాది సెంచరీ, ఆతర్వాత 150 పరుగులు పూర్తి చేశాడు. మధ్యలో కాసేపు కెప్టెన్ బట్లర్ (38; 6 ఫోర్లు, సిక్స్) అతనికి జత కలిశాడు. Ridiculous. Scorecard/clips: https://t.co/Pd380O21mn@IGCom | #EnglandCricket pic.twitter.com/6FGco9sV24 — England Cricket (@englandcricket) September 13, 2023 182 పరుగుల వద్ద మరో భారీ సిక్సర్‌కు ప్రయత్నించి స్టోక్స్ ఔటయ్యాడు. స్టోక్స్ ఔటయ్యాక ఆఖర్లో వికెట్లు వెనువెంటనే పడిపోవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 368 పరుగుల వద్ద ముగిసింది. 11 బంతులు వేస్ట్ అయ్యాయి. ఒకవేళ స్టోక్స్ ఔట్ కాకుండా ఉండివుంటే, అతను డబుల్ సెంచరీ, ఇంగ్లండ్ 450కిపైగా పరుగులు తప్పక చేసుండేది. స్టోక్స్, మలాన్, బట్లర్ మినహా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అందరూ తేలిపోయారు. ODI 💯 #4 🙌 Just 76 balls! 😅@IGCom | @benstokes38 pic.twitter.com/FaVlwikMbB — England Cricket (@englandcricket) September 13, 2023 ఓ పక్క స్టోక్స్ తాండవం చేస్తున్నా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఏమాత్రం తగ్గకుండా 5 వికెట్లతో చెలరేగాడు. స్టోక్స్ అందరు బౌలర్లకు చుక్కలు చూపించినప్పటికీ బౌల్ట్ తప్పించుకున్నాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన బెన్ లిస్టర్ ఆఖర్లో 3 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకన్నారు. కాగా, 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందాయి. అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. Reaching 50 in style! 😍 Scorecard/clips: https://t.co/Pd380O21mn@IGCom | @benstokes38 pic.twitter.com/QKo94vqknl — England Cricket (@englandcricket) September 13, 2023 -
మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం
అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రహమాన్ (64) హాఫ్ సెంచరీ చేయగా, షాహిదుల్లా (37), రియాజ్ హసన్ (34) మాత్రమే కొద్దిగా పోరాడారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.