
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసు గుర్రం అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. బుమ్రా తన వన్డే కెరీర్‌లో చెత్త గణాంకాల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు (81) సమర్పించుకుని, ఈ మ్యాచ్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఇండియన్ బౌలర్ అయ్యాడు. 2017లో కటక్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా ఇలాగే 81 పరుగులు సమర్పించుకున్నాడు.
వవ్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శనల్లో ఇవి టాప్ 2లో ఉండగా.. 2017లో ఇంగ్లండ్‌పై సమర్పించుకున్న 79 పరుగులు, 2020లో ఆసీస్‌పై సమర్పించుకున్న 79 పరుగులు ఆ తర్వాతి చెత్త ప్రదర్శనలుగా రికార్డయ్యాయి. ఇవాల్టి మ్యాచ్‌లో బుమ్రా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలి 5 ఓవర్లలో వికెట్లేమీ తీసుకోకుండా 51 పరుగులు ఇచ్చిన అతను.. ఆతర్వాతి 5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తీసిన 3 వికెట్లలో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన యార్కర్ డెలివరీ హైలైట్ అని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment