అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇవాళ (జనవరి 24) న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో సెంచరీ బాదడం ద్వారా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న గిల్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 112 చేశాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీని, గత 4 వన్డేల్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 208) కూడా ఉంది. ఇవాల్టి మ్యాచ్‌లో గిల్ సెంచరీ సాధించాక పలు ప్రపంచ రికార్డుల్లో భాగమయ్యాడు.
- అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వన్డే సెంచరీలు (21) పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన ఇమామ్ ఉల్ హాక్ (9) అగ్రస్థానంలో ఉండగా.. క్వింటన్ డికాక్ (16), డెన్నిస్ అమిస్ (18), షిమ్రోన్ హెట్మేయర్ (22) 2, 3, 5 స్థానాల్లో నిలిచారు.
- భారత్ తరఫున అతి తక్కువ వన్డేల్లో 4 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉండేది. ధవన్ 24 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. గిల్ 21 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
- ఇదే మ్యాచ్‌లో గిల్ మరో ప్రపంచ రికార్డును సమం చేశాడు. 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరసన నిలిచాడు. బాబర్ 2016 విండీస్ సిరీస్‌లో 360 పరుగులు చేయగా.. గిల్ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో అన్నే పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఇమ్రుల్ కయేస్ (349), డికాక్ (342), గప్తిల్ (330) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 38.4 ఓవర్ల పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 293 పరుగుల చేసింది. రోహిత్ (101), గిల్ (112)తో పాటు కోహ్లి (36), ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ యాదవ్ (14) కూడా ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment