మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం  | Pakistan won the third ODI as well | Sakshi
Sakshi News home page

మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం 

Published Sun, Aug 27 2023 2:29 AM | Last Updated on Sun, Aug 27 2023 2:29 AM

Pakistan won the third ODI as well - Sakshi

అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్‌ 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (67), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్‌ (38 నాటౌట్‌), నవాజ్‌ (30) రాణించారు. నైబ్, ఫరీద్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం అఫ్గన్‌ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (64) హాఫ్‌ సెంచరీ చేయగా, షాహిదుల్లా (37), రియాజ్‌ హసన్‌ (34) మాత్రమే కొద్దిగా పోరాడారు. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement