బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 మ్యాచ్‌ల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు.
కెరీర్‌లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/33), ఆడమ్ మిల్నే (4/34), ఫెర్గూసన్ (1/26), రచిన్ రవీంద్ర (1/20), కోల్ మెక్‌కొంచి (2/18) బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment