
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా నిన్న (మార్చి 12) వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని మహ్మదుల్లా బోర్డును కోరాడు.
మహ్మదుల్లా తన రిటైర్మెంట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు.. నా సహచరులకు, కోచ్‌లకు, నాకు ఎల్లప్పుడూ మద్దతు నిలిచిన నా అభిమానులకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులు, అత్తమామలకు ధన్యవాదాలు. నా చిన్నతనం నుండి కోచ్‌గా, మెంటర్‌గా నిరంతరం నాకు తోడుగా ఉన్న నా సోదరుడు ఎమ్దాద్ ఉల్లాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
చివరిగా నా భార్య, పిల్లలకు కృతజ్ఞతలు. వారు క్లిష్ట సమయాల్లో నాకు మద్దతుగా నిలిచారు. బంగ్లాదేశ్ జెర్సీలో నా పిల్లలు నన్ను మిస్ అవుతారని తెలుసు. ప్రతిదీ పరిపూర్ణంగా ముగియదు. మనకు మనము సర్ది చెప్పుకొని ముందుకు సాగాలి. శాంతి.. నా జట్టుకు, బంగ్లాదేశ్ క్రికెట్‌కు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ ముగించారు.
39 ఏళ్ల మహ్మదుల్లా తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ (న్యూజిలాండ్‌పై) ఆడాడు. మహ్మదుల్లా తన అంతర్తాజీయ కెరీర్‌లో 400కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మహ్మదుల్లాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో మూడు సెంచరీలు (2015లో రెండు, 2023లో ఒకటి) చేసిన ఏకైక బంగ్లాదేశ్ ప్లేయర్ మహ్మదుల్లానే.
2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 50 టెస్ట్‌లు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 5689 పరుగులు.. టెస్ట్‌ల్లో 2914, టీ20ల్లో 2444 పరుగులు చేశాడు. మహ్మదుల్లా వన్డేల్లో 4, టెస్ట్‌ల్లో 5 సెంచరీలు చేశాడు.
రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన మహ్మదుల్లా టెస్ట్‌ల్లో 43 వికెట్లు.. వన్డేల్లో 82, టీ20ల్లో 41 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో మహ్మదుల్లా 181 క్యాచ్‌లు కూడా పట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment