బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. కయేస్ నవంబర్ 16న తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. కయేస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వీడియో మెసేజ్ ద్వారా షేర్ చేశాడు. కయేస్ రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా వైట్ బాల్ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కయేస్ తన చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నాడు.
ఈ టోర్నీలో ఖుల్నా డివిజన్‌కు ప్రాతినిథ్యం వహించే కయేస్.. ఢాకా డివిజన్‌తో తన ఆఖరి మ్యాచ్ ఆడతాడు. నేషనల్ క్రికెట్ లీగ్ అనేది బంగ్లాదేశ్‌లో సంప్రదాయ దేశవాలీ టోర్నీ. కయేస్ 2019లో తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడింది. కయేస్ తన టెస్ట్ కెరీర్‌లో 39 మ్యాచ్‌లు ఆడి 24.28 సగటున 1797 పరుగులు చేశాడు. కయేస్.. తమీమ్ ఇక్బాల్‌తో కలిసి తొలి వికెట్‌ను నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
కయేస్-తమీమ్ జోడీ తొలి వికెట్‌కు 53 ఇన్నింగ్స్‌ల్లో 2336 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున తొలి వికెట్‌కు ఇవి అత్యుత్తమ గణాంకాలు. కయేస్ తన చివరి మ్యాచ్‌లో కనీసం 70 పరుగులు చేస్తే తన కెరీర్‌లో 8000 పరుగుల మార్కును దాటతాడు. కయేస్‌కు వన్డే క్రికెట్‌లో ఓ మోస్తరు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 78 మ్యాచ్‌లు ఆడి 32 సగటున 2434 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment