Imrul Kayes
-
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఓపెనర్
బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమ్రుల్ కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల కయేస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టెస్ట్‌లకు కూడా వీడ్కోలు పలికాడు. కయేస్ నవంబర్ 16న తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు వెల్లడించాడు. కయేస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వీడియో మెసేజ్ ద్వారా షేర్ చేశాడు. కయేస్ రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా వైట్ బాల్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కయేస్ తన చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ టోర్నీలో ఖుల్నా డివిజన్‌కు ప్రాతినిథ్యం వహించే కయేస్.. ఢాకా డివిజన్‌తో తన ఆఖరి మ్యాచ్ ఆడతాడు. నేషనల్ క్రికెట్ లీగ్ అనేది బంగ్లాదేశ్‌లో సంప్రదాయ దేశవాలీ టోర్నీ. కయేస్ 2019లో తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్‌తో తలపడింది. కయేస్ తన టెస్ట్ కెరీర్లో 39 మ్యాచ్‌లు ఆడి 24.28 సగటున 1797 పరుగులు చేశాడు. కయేస్.. తమీమ్ ఇక్బాల్‌తో కలిసి తొలి వికెట్‌ను నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కయేస్-తమీమ్ జోడీ తొలి వికెట్‌కు 53 ఇన్నింగ్స్‌ల్లో 2336 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున తొలి వికెట్‌కు ఇవి అత్యుత్తమ గణాంకాలు. కయేస్ తన చివరి మ్యాచ్‌లో కనీసం 70 పరుగులు చేస్తే తన కెరీర్లో 8000 పరుగుల మార్కును దాటతాడు. కయేస్కు వన్డే క్రికెట్లో ఓ మోస్తరు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో అతను 78 మ్యాచ్‌లు ఆడి 32 సగటున 2434 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సబ్‌స్టిట్యూట్ గా వరల్డ్ రికార్డు..
వెల్లింగ్టన్:అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు.. ఏకంగా వరల్డ్ రికార్డే నెలకొల్పాడు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ ఇమ్రూల్ కేయిస్. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెగ్యులర్ వికెట్ కీపర్ ముష్కిఫికర్ రహీమ్ గాయపడటంతో సబ్‌స్టిట్యూట్‌గా ఇమ్రూల్ ఫీల్డ్ లోకి వచ్చాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా నాల్గోరోజు ఆటలో ఐదు క్యాచ్‌లతో ఇమ్రూల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వికెట్ కీపర్ ఐదు అంతకంటే ఎక్కువ క్యాచ్‌లను పట్టిన దాఖలాలు లేవు. దాంతో ఆ ఘనత సాధించిన తొలి సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్ గా ఇమ్రూల్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉంచితే, బంగ్లాదేశ్ తరపున అత్యధిక వికెట్ కీపింగ్ అవుట్లు సాధించిన రెండో వికెట్ కీపర్‌గా ఇమ్రూల్ నిలిచాడు. అంతకుముందు ముష్కిఫికర్ ఆ ఘనతను రెండు సార్లు సాధించాడు. -
పరుగుల వరద
కుల్నా: పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో పరుగుల వరద కొనసాగుతోంది. రెండు టీమ్ లు పరుగుల వేటలో పోటీ పడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో పాక్ భారీ స్కోరు చేయగా, బంగ్లా టీమ్ దీటుగా జవాబిచ్చింది. 537/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాక్ 628 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్(224) డబుల్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కేయస్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 267 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. బంగ్లాదేశ్ తరపున ఏ వికెట్ కైనా ఇతే అత్యధిక భాగస్వామ్యం. ఇక్బాల్(183 బంతుల్లో 138; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమ్రుల్(185 బంతుల్లో 132; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీలతో కదం తొక్కారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేవు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 332 పరుగులు చేసింది. పాక్ కంటే బంగ్లా ఇంకా 23 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 1233 పరుగులు చేశాయి. ఇందులో ఆరు అర్ధసెంచరీలు, 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. మొదటి 4 రోజుల ఆటలో 20 వికెట్లు మాత్రమే పడ్డాయి.