
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్‌ను ఓడించాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లా క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
ఈ టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అదేజోరును ఈ మినీ వరల్డ్‌కప్‌లోనూ కనబరచాలని బంగ్లా జట్టు భావిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం బంగ్లాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ఓపెనర్ ఇమ్రాల్ కైస్ తమ జట్టుకు పలు సూచనలు చేశాడు. భారత జట్టులో బుమ్రాలేని లోటును బంగ్లా సొమ్ముచేసుకోవాలని కైస్ అభిప్రాయపడ్డాడు.
"భారత్ బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ను కలిగి ఉంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం. బుమ్రా గత రెండేళ్లలో భారత జట్టుకు ఎటువంటి విజయాలను అందించాడో మనకు మనందరికీ తెలిసిందే.
అతడి గైర్హాజరును బంగ్లాదేశ్ సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లేనప్పటికి మహ్మద్ షమీ వంటి స్పీడ్ స్టార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతడు తన రిథమ్‌ను తిరిగి పొందితే, బంగ్లాదేశ్‌కు పెనుముప్పులా మారుతాడని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైస్ పేర్కొన్నాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.
చదవండి: మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment