టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 21 పరుగులు చేసిన రాహుల్ 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో (వన్డేల్లో) 1000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 14 ఏళ్ల క్రితం ఈ ఫీట్‌ను టీమిండియా మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని సాధించాడు.
కాగా, సౌతాఫ్రికాతో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు రజత్ పాటిదార్ (22), సాయి సుదర్శన్‌లతో (10) పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (44), తిలక్ వర్మ (6) క్రీజ్‌లో ఉన్నారు. 25 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/3గా ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్, హెండ్రిక్స్, ముల్దర్‌లకు తలో వికెట్ దక్కింది.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగ్గా, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 1-1తో సమంగా ముగిసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. డిసెంబర్ 26న తొలి టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3న రెండో టెస్ట్ ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment