టీమిండియా స్టార్ ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును రాహుల్ సమం చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేసిన రాహుల్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ధోని ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేయగా.. రాహుల్ కూడా 24 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఈ సీజన్‌లో ధోనిని రాహుల్ అధిగమించే ఛాన్స్ ఉంది. వీరిద్దరి తర్వాత స్ధానాల్లో క్వింటన్ డికాక్(22), దినేష్ కార్తీక్(19) ఉన్నారు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసింది.
జైపూర్ వేదికగా జరుగుతున్న రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో లక్నో ఓటమి చవిచూసింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో రాహుల్(58), పూరన్(64) పోరాడనప్పటికి తమ జట్టును గెలిపించలేకపోయారు. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి 30న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2024: 'బాధపడకు హార్దిక్.. నేను నీకు ఉన్నా'
Comments
Please login to add a commentAdd a comment